Mandula Samuel | నల్లగొండల మీ రాజ్యం అనుకుంటుర్రా? మీరు
Mandula Samuel | తుంగతుర్తి బాలేదు, నకిరేకల్ బాలేదని మాట్లాడడం ఆపి ఫస్ట్ మునుగోడు సక్కదనమేందో చూసుకోవాలని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిపై తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ ఫైరయ్యారు. అన్ని కులాలతో కలిసిపోతూ 24 గంటలు ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలను చిన్నచూపు చూస్తూ సరైన సమాధానం చెబుతామని హెచ్చరించారు.
- నాగ్గూడా రిపోర్టొచ్చింది.. సమాధానం చెప్పు
- రాజగోపాల్‌రెడ్డి మా కాంగ్రెస్ అని మాట్లాడితే.. మరి వీళ్లంతా ఎవరు?
- మీకు చేయి సాపలే.. మీ చెంతకు రాలే.. మమ్ముల ఎందుకు హీనంగా మాట్లాడుతున్నవ్?
- ఏమనుకుంటుర్రో మీరు.. తుంగతుర్తిల సామేల్ ఉంటడు.. ఖబర్దార్
- కోమటిరెడ్డి బ్రదర్స్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ ఫైర్
Mandula Samuel | త్రినేత్ర.న్యూస్: తుంగతుర్తి బాలేదు, నకిరేకల్ బాలేదని మాట్లాడడం ఆపి ఫస్ట్ మునుగోడు సక్కదనమేందో చూసుకోవాలని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిపై తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ ఫైరయ్యారు. అన్ని కులాలతో కలిసిపోతూ 24 గంటలు ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. మా కాంగ్రెస్ అని రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతున్నారని.. మరి వీళ్లంతా ఎవరని ప్రశ్నించారు. మీకు చేయి సాపకున్నా మమ్మల్ని ఎందుకు హీనంగా మాట్లాడుతున్నావని ధ్వజమెత్తారు. బడుగు బలహీన వర్గాలను చిన్నచూపు చూస్తూ సరైన సమాధానం చెబుతామని హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కోమటిరెడ్డి బ్రదర్స్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
మీయి మీరు సక్కదానం సూడండి..
ఇయ్యాళ వీరేశం 68 వేల మెజారిటీతోటి గెలిచిండు. ఈడ మందుల సామేల్ 52 వేల మెజారిటీతోటి గెలిచిండు. మీకు చేయి సాపలేదు మేం. మీ చెంతకు రాలే. మమ్ముల ఎందుకు హీనంగా మాట్లాడుతా ఉన్నవ్? మీ నియోజకవర్గాలు సూసుకోర్రి. మీయి మీరు సక్కదానం సూడండి. ఏమనుకుంటుర్రో మీరు. మా నియోజకవర్గంలో 24 గంటలు జనం మధ్యన ఉంటున్న నేన్. 24 గంటలు జనం సమస్యలు పరిష్కరిస్తున్న నేన్. అన్ని కులాలను కలుపుకపోయేటోన్ని నేను. అన్ని వర్గాలను కలుపుకపోయేటోన్ని నేను అని సామేల్ పేర్కొన్నారు.
స్వయానా నేన్ కౌలు రైతును. ఇంత భూమి ఉన్నాగానీ నా పక్కనోళ్లతోటి రెడ్డోళ్లతోని వ్యవసాయం చేసుకొని బతుకుతున్నా. కానీ మీరు తుంగతుర్తి బాగలేదు.. నకిరేకల్ బాగలేదు అని ఆడ గాంధీ భవన్‌ల మాట్లాడుతుండు రాజగోపాల్‌రెడ్డి. ఫస్ట్ నీది నువ్వు కడుక్కో మునుగోడుల. మునుగోడుల అడిగితే నీ సక్కదనమేందో తెలుస్తది. నాగ్గూడా రిపోర్ట్ వచ్చింది మునుగోడుల ఇట్లా ఉందని. నాకు సమాధానం చెప్పాలే అని మందుల డిమాండ్ చేశారు.
బీజేపీలకు ఎందుకు పోయినవో చెప్పు?
మాగ్గాని, బడుగు బలహీన వర్గాలకు గానీ, బక్కచిక్కినవారికి గానీ మీరు చిన్నచూపు చూస్తే దానికి సమాధానం చెప్తానని హెచ్చరిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ బతకాలే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలే. నీలెక్క ఇటు రాకపోతే అటు.. అటు రాకపోతు ఇటు ఉండది నా దగ్గర. రాజగోపాల్‌రెడ్డి బీజేపీలకు ఎందుకు వోయిండో సమాధానం చెప్పాలే. అక్కడవోయి ఎందుకు పోటీ చేసిండో చెప్పాలే. నువ్ రాహుల్ గాంధీని తిట్టినవ్.. సోనియా గాంధీని తిట్టినవ్. అన్ని మర్సిపోయి మళ్లా కాంగ్రెస్‌లకు వచ్చి పోటీ చేసినవ్. కాంగ్రెస్‌లకొచ్చి పోటీ చేసి.. నిఖార్సయిన కాంగ్రెస్, మా కాంగ్రెస్ అని మాట్లాడితే మరి వీళ్లంతా ఎవరు? ఈ సర్పంచులంతా ఎవరు? ఈ కార్యకర్తలంతా ఎవరు? ఈ లీడర్లంతా ఎవరు? అని ఎమ్మెల్యే సామేల్ నిలదీశారు.
మళ్లా మాట్లాడిర్రో..
నల్లగొండల మీ రాజ్యం అనుకుంటుర్రా మీరు. నల్లగొండ అంటే శ్రమజీవుల జిల్లా. బడుగు బలహీన వర్గాలు ఉద్యమాలు చేసిన తుంగతుర్తి పోరాటాల గడ్డ. ఈ పోరాటాల గడ్డలో తెలంగాణ పోరు బిడ్డ మందుల సామేల్ ఉంటడు ఖబర్దార్. మళ్లీ ఒకసారి తుంగతుర్తి కోసం గానీ, నకిరేకల్ కోసం గానీ మా మాదిగ సీట్ల కోసం, మా దళిత సీట్ల కోసం మీరు మాట్లాడితే దానికి సమాధానం చెబుతం అని హెచ్చరిస్తున్నా అని మందుల సామేల్ ఫైరయ్యారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!
- ●BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!
- ●Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!

Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!

Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!






