Komatireddy Rajagopal Reddy | అయ్యా! నీ వల్లే మాకు కండ్ల ఆపరేషన్లు.. పెద్ద కొడుకులెక్క సూస్కుంటున్నవ్
Komatireddy Rajagopal Reddy | అయ్యా రాజగోపాల్ సారు.. నీ వల్లనే మాకు కండ్ల ఆపరేషన్లు అయితున్నయ్.. పెద్ద కొడుకులెక్క సూస్కుంటున్నవ్.. లేదంటే ఏమయ్యేటోళ్లమో.. కండ్లుంటే సేతి కర్రతోనైనా నడువొచ్చు. ఈ భాగ్యమంతా నీ వల్లనే. అంటూ ఆ వృద్ధులు తమ ఎదల ఉన్న మురిపాన్ని ఎమ్మెల్యే ముంగటేశారు.
- 17వ విడత ఉచిత కంటి వైద్య శిబిరంలో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డితో వృద్ధుల భావోద్వేగం
Komatireddy Rajagopal Reddy | త్రినేత్ర న్యూస్: అయ్యా రాజగోపాల్ సారు.. నీ వల్లనే మాకు కండ్ల ఆపరేషన్లు అయితున్నయ్.. పెద్ద కొడుకులెక్క సూస్కుంటున్నవ్.. లేదంటే ఏమయ్యేటోళ్లమో.. కండ్లుంటే సేతి కర్రతోనైనా నడువొచ్చు. ఈ భాగ్యమంతా నీ వల్లనే. అంటూ ఆ వృద్ధులు తమ ఎదల ఉన్న మురిపాన్ని ఎమ్మెల్యే ముంగటేశారు. గుండెలున్న బాధలు మరిసి కండ్ల కాసేపు సంబరపడిపోయారు. సంస్థాన్ నారాయణ్ పూర్ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన 17వ విడత ఉచిత కంటి వైద్య శిబిరం ఈ అరుదైన ఆత్మీయ పలకరింపులకు వేదికైంది.
మునుగోడు నియోజకవర్గం సంస్థాన్ నారాయణ్ పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 17వ విడత కంటి శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి సుశీలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ప్రారంభించారు. మొత్తం 5 కౌంటర్లలో కండ్లను పరీక్షించుకుంటున్న వృద్ధులు, మహిళలను ఆత్మీయంగా పలకరిస్తూ వైద్య శిబిరం జరుగుతున్నతీరును పరిశీలించారు. వారిని ఆత్మీయంగా పలకరిస్తూ నేనున్నానని భరోసా ఇచ్చారు. ఓ వృద్ధురాలికి బీపీ పెరుగుతున్న తీరును చూసి ఆమెను కూర్చొబెట్టుకుని దగ్గరుండి పరీక్షలు చేయించారు. ప్రతి ఒక్కరికి భోజన సదుపాయం కల్పించి ప్రతి ఒక్కరు తిన్నారా లేదా అని దగ్గరుండి చూసుకున్నారు.
ఈ కంటి వైద్య శిబిరంలో 976 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా వారిలో 183 మంది కంటి ఆపరేషన్లకు ఎంపికయ్యారు. వీరిలో 111 మందిని వెంటనే హైదరాబాద్‌లోని శంకరా కంటి ఆసుపత్రికి పంపించారు. ఫీనిక్స్ ఫౌండేషన్, శంకరా కంటి ఆసుపత్రి సహకారంతో సుశీలమ్మ ఫౌండేషన్ ఈ ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వస్తున్నట్లు రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.
ఇప్పటివరకు 16 విడతల్లో..
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరు మీద ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తూ వస్తున్నారు. నియోజకవర్గంలో ఏ ఒక్కరు కూడా కంటి సమస్యలతో బాధపడొద్దనే సదుద్దేశంతో నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కంటి శిబిరాలకు విశేష స్పందన వస్తోంది. ఇప్పటి వరకు 16 ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి 12,306 మందికి కంటి పరీక్షలు చేయించారు. 2,673 మందికి కంటి ఆపరేషన్లు పూర్తి చేసి, 5,522 మందికి కండ్ల జోళ్లు అందజేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●TGOs | టీజీవో ఫోరం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ప్రేమ్ కరణ్ రెడ్డి, మోర శ్రీనివాస్
- ●Danam Nagender | తప్పులతడకగా సర్ ప్రక్రియ : దానం నాగేందర్
- ●Shweta Basu Prasad | టాలీవుడ్లోకి శ్వేతాబసు ప్రసాద్ రీఎంట్రీ - కొత్త బంగారం లోకం హీరోతో మిస్టరీ థ్రిల్లర్ వెబ్‌సిరీస్
- ●No UPI Day | అక్టోబర్ 2న ‘నో UPI డే’.. మొబైల్ రిటైలర్ల నిరసన
- ●Iran US conflict | శాంతి ప్రతిపాదనను తిరస్కరించిన ట్రంప్: అమెరికాకు తీవ్ర నష్టం తప్పదంటూ ఇరాన్ ఆర్మీ వార్నింగ్
- ●John Wesley | బ్యాంక్ ఉద్యోగుల సమ్మెకు సీపీఐ(ఎం) మద్దతు

TGOs | టీజీవో ఫోరం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ప్రేమ్ కరణ్ రెడ్డి, మోర శ్రీనివాస్

Danam Nagender | తప్పులతడకగా సర్ ప్రక్రియ : దానం నాగేందర్

Shweta Basu Prasad | టాలీవుడ్లోకి శ్వేతాబసు ప్రసాద్ రీఎంట్రీ - కొత్త బంగారం లోకం హీరోతో మిస్టరీ థ్రిల్లర్ వెబ్‌సిరీస్

No UPI Day | అక్టోబర్ 2న ‘నో UPI డే’.. మొబైల్ రిటైలర్ల నిరసన










