Ramchandar Rao | మీ ఆరోపణలు పక్కనబెట్టి.. ప్రజలు ఏం సంపాదించుకున్నరో చెప్తే బాగుంటది
Ramchandar Rao | బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు వారి వారి సంపాదనలపై ఆరోపణలు చేసుకుంటున్నారని.. దయచేసి ప్రజలు ఏం సంపాదించుకున్నరో చెప్తే బాగుంటదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు వ్యాఖ్యానించారు.
- కనీసం రబీకైనా రైతుభరోసా పైసలు రైతుల ఖాతాల్లో వేయండి
- అవినీతిలో పోటీ పడడం ఆపండి.. రైతులను ఆదుకోండి
- మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు డిమాండ్
Ramchandar Rao | త్రినేత్ర న్యూస్: బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు వారి వారి సంపాదనలపై ఆరోపణలు చేసుకుంటున్నారని.. దయచేసి ప్రజలు ఏం సంపాదించుకున్నరో చెప్తే బాగుంటదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు వ్యాఖ్యానించారు. ఒక కుటుంబం, ఒకరి అన్నదమ్ములు బాగుపడుతున్నారని విమర్శించారు. అవినీతిలో పోటీ పడడం ఆపి ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టాలన్నారు. రబీకైనా రైతు భరోసా ఇచ్చి రైతులను ఆదుకోవాలని కోరారు. శుక్రవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
మొన్న సిరిసిల్ల సభలో సీఎం రేవంత్‌రెడ్డి గతంలో ఉన్న సీఎం, మంత్రి మీద వ్యాఖ్యలు చేశారు. వీళ్లు ఎంత సంపాదించుకున్నరో చెప్పుకుంటున్నరు, కానీ ప్రజలు ఏం సంపాదించుకున్నరో చెప్తే బాగుంటుంది. ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంది ఈరోజు? మేం ఒచ్చాక 100 రోజుల్లో వారి చిట్టా తీస్తం.. వాళ్లను అరెస్టు చేస్తామని కాంగ్రెస్ వాళ్లు చెప్పారు. కానీ ఏం చేశారు? దొందు దొందే కదా. అవినీతిని ప్రోత్సహించుకుంటూ పోతున్నరు. ఇన్ని ఉన్నయ్.. అన్ని ఉన్నయ్ అని చెప్తున్నరు. మరి ఎందుకు చర్యలు తీసుకుంటలేరు?
317 జీవోకు విరుగుడుగా 190 జీవో తీసుకొచ్చారు. డిప్యూటేషన్ మీద ట్రాన్స్‌ఫర్ చేయాల్సి ఉంటది. ఈ 190 జీవో ప్రకారం 4 వేల మందికి బదిలీలు ఇవ్వాల్సి ఉంటే కేవలం 100 మందికే ఇచ్చారు. టీచర్లంతా ఆందోళన చెందుతున్నరు. గాంధీ భవన్ ముందు వాళ్లు ధర్నా చేస్తే అరెస్టు చేస్తున్నారు. రైతులను, రాజకీయ నాయకులను, విద్యార్థులను, టీచర్లను అరెస్టు చేస్తున్నారు. మీరు ఏం సందేశం ఇస్తున్నరు. మొన్న జూరాలకు పోతే రైతులను అరెస్టు చేశారు. రైతులు నీళ్లు అడిగితే తప్పు అన్నట్లు భావిస్తున్నరు. పంటలు నాశనం అయితా ఉంటే ఒకరికొకరు ఆరోపణలు చేసుకుంటున్నరు.
నరేంద్ర మోదీ అవినీతి రహిత పాలన అందిస్తున్నరు. తెలంగాణకు వచ్చేసరికి ఎవరు ఎక్కువ అవినీతి చేస్తున్నరని బీఆర్ఎస్, కాంగ్రెసోళ్ల మధ్యన పోటీ పెరుగుతుంది. మీరు అవినీతి చేశారు.. మాకు అవకాశం దొరకడం లేదని కాంగ్రెస్ వాళ్లు అంటరు. ఎవరేమన్నా కానీ ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదు. ఇప్పటికైనా రైతులను, విద్యార్థులను, టీచర్లను పట్టించుకోవాల్సిన అవసరం ఉంది.
రబీ పంటకైనా రైతుభరోసాను ఇవ్వండి. ఖరీఫ్ కు దెబ్బ తిన్నరు. రబీలో అయిన రైతుభరోసా ఇవ్వండి. కేంద్రం పెట్టిన ఫసల్ బీమాకు ప్రీమియం కట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నరు. ఈ బీమా ఉండి ఉంటే రైతులకు ఇంత నష్టం జరగకపోయేది. రైతులు వేలల్లో పెట్టుబడి పెట్టి నష్టపోయే ప్రమాదం ఉంది. టీచర్ల అరెస్టును ఖండిస్తున్నాం. సినిమా ఫీల్డ్ నుంచి ఇద్దరు పార్టీలో చేరారు. రోజురోజుకు పార్టీకి ఆదరణ పెరుగుతోంది. ప్రతిఒక్కరు బీజేపీలో చేరండి అని రాంచందర్ రావు పిలుపునిచ్చారు.
సంబంధిత వార్తలు

Raghunandan Rao | రేవంత్, కేటీఆర్ ఆస్తులపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: రఘునందన్ రావు
అక్టోబర్ 2, 2026

Harish Rao | ఒక సామాజిక సమస్యకు కేసీఆర్ చూపిన శాశ్వత పరిష్కారమే.. కల్యాణ లక్ష్మీ: హరీశ్ రావు
అక్టోబర్ 2, 2026

KCR | గాంధీజీ అనుసరించిన సత్యాగ్రహ పంథా నేటి యువతరానికి ఆచరణీయం: కేసీఆర్
అక్టోబర్ 2, 2026
తాజావార్తలు
- ●CM Vijay | బస్సు కండక్టర్‌గా సీఎం విజయ్.. స్వయంగా టికెట్లు ఇచ్చి
- ●ISRO | గువాహటికి ఇస్రో కొత్త కేంద్రం.. అంతరిక్ష భద్రతకు మరింత బలం..
- ●Captain Smit Machchhar | 140 కోట్ల మంది భారతీయుల గౌరవాన్ని పెంచారు.. పైలట్ స్మిత్‌తో ప్రధాని మోదీ
- ●Raghunandan Rao | రేవంత్, కేటీఆర్ ఆస్తులపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: రఘునందన్ రావు
- ●Poland | భారత్‌తో రక్షణ బంధం.. కీలక నిర్ణయం తీసుకున్న పోలాండ్..
- ●EC orders special drive | సర్ తర్వాత ఓటర్ల జాబితాలో పేరు లేదా..? ప్రత్యేక డ్రైవ్‌కు ఈసీ ఆదేశం

CM Vijay | బస్సు కండక్టర్‌గా సీఎం విజయ్.. స్వయంగా టికెట్లు ఇచ్చి

ISRO | గువాహటికి ఇస్రో కొత్త కేంద్రం.. అంతరిక్ష భద్రతకు మరింత బలం..

Captain Smit Machchhar | 140 కోట్ల మంది భారతీయుల గౌరవాన్ని పెంచారు.. పైలట్ స్మిత్‌తో ప్రధాని మోదీ

Raghunandan Rao | రేవంత్, కేటీఆర్ ఆస్తులపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: రఘునందన్ రావు



