Medico Priyanka | మెడికో ప్రియాంకది హిట్ అండ్ రన్ కాదు.. ఆమెపై హత్యాయత్నం జరిగింది
Medico Priyanka | మెడికో ప్రియాంక కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఆమెది హిట్ అండ్ రన్ కాదని.. నిందితులు హత్యాయత్నం చేశారని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ అధికారికంగా ప్రకటించారు. రాజమండ్రిలోని ఓ మాల్‌లో నిందితులతో ప్రియాంక వాగ్వాదానికి దిగిందని, ఆ కోపంతోనే ప్రియాంకను చంపేందుకు ప్రయత్నించారని చెప్పారు.
- ఉద్దేశపూర్వకంగానే ఆమె వెళ్తున్న స్కూటీని మూడుసార్లు ఢీకొట్టారు
- నిందితులతో గొడవ పడడంతో చంపేందుకు యత్నించారు
- తూర్పుగోదావరి ఎస్పీ నరసింహ కిశోర్ వెల్లడి
Medico Priyanka | త్రినేత్ర.న్యూస్: మెడికో ప్రియాంక కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఆమెది హిట్ అండ్ రన్ కాదని.. నిందితులు హత్యాయత్నం చేశారని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ అధికారికంగా ప్రకటించారు. రాజమండ్రిలోని ఓ మాల్‌లో నిందితులతో ప్రియాంక వాగ్వాదానికి దిగిందని, ఆ కోపంతోనే ప్రియాంకను చంపేందుకు ప్రయత్నించారని చెప్పారు. నిందితులపై సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశామని తెలిపారు.
తాజాగా ఈ కేసుకు సంబంధించి ఎస్పీ నరసింహ కిశోర్ మీడియాకు వివరాలను వెల్లడించారు. నిందితులు మొదట ఆదిత్య మాల్ వద్దకు మద్యం మత్తులో వెళ్లారు. అక్కడ వారిని సెక్యూరిటీ సిబ్బంది నిలువరించడంతో గొడవ జరిగింది. అదే సమయంలో అక్కడే ఉన్న డాక్టర్ ప్రియాంక నిందితుల ప్రవర్తనను ప్రశ్నిస్తూ వారితో వాగ్వాదానికి దిగారు. అనంతరం మాల్ నుండి బయలుదేరిన ప్రియాంక, ఆమె స్నేహితురాలి స్కూటీని నిందితులు తమ కారుతో వెంట వెంటనే మూడుసార్లు ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టారు. ప్రియాంక కింద పడిపోవడంతో ఆమె తలపై నుంచి కారు పోనిచ్చి అత్యంత క్రూరంగా ప్రవర్తించారు అని ఎస్పీ తెలిపారు.
కారు నడిపిన సూరవరపు జశ్వంత్ (A1), పక్కన కూర్చున్న ఆండ్రూ జోసెఫ్ (A2) లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వీరికి రిమాండ్ విధించడంతో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. సీసీటీవీ ఫుటేజీలు, పక్కా ఆధారాలతో నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని ఎస్పీ నరసింహ స్పష్టం చేశారు.
కాగా ప్రియాంక తలకు తీవ్ర గాయం కావడతో ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
సంబంధిత వార్తలు

Harish Rao | నిరుపేదలను డాక్టర్లను చేసే బాధ్యత నాదే.. పట్టుదలతో చదివి గొప్ప ఆఫీసర్లుగా ఎదగండి
ఆగస్టు 9, 2026

Ministers in Bonaalu Festival | ప్రజలందిరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలి.. ఆయురారోగ్యాలతో మెలగాలని ప్రార్థించాం
ఆగస్టు 9, 2026

Gutta Sukhendar Reddy | వానలు సమృద్ధిగా పడాలని.. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని మహంకాళి అమ్మవారిని కోరుకున్నా
ఆగస్టు 9, 2026
తాజావార్తలు
- ●Aviation | ఎయిర్ ఇండియా పైలట్‌కు ‘డోప్’ టెస్ట్‌లో పాజిటివ్?
- ●Varun Batchigari | అమెరికాలో ప్రియురాలిని చంపి భారత్‌కు పారిపోతుండగా.. జర్మనీలో దొరికిపోయిన ఇండియన్ స్టూడెంట్!
- ●Anasuya | గుమ్మడి కాయ దొంగ అంటూ అనసూయ పోస్ట్ - ఆ హీరోకు కౌంటర్ అంటోన్న నెటిజన్లు
- ●August 15 | నిఘానీడలో ఎర్రకోట.. పంద్రాగస్టుకు కట్టుదిట్టబమైన భద్రత
- ●Harish Rao | నిరుపేదలను డాక్టర్లను చేసే బాధ్యత నాదే.. పట్టుదలతో చదివి గొప్ప ఆఫీసర్లుగా ఎదగండి
- ●NALSAR Students vs CJI Surya Kant | కాన్వకేషన్‌కు 'చీఫ్ గెస్ట్'గా సీజేఐ సూర్యకాంత్ వద్దే వద్దు: నల్సార్ విద్యార్థుల సంచలన నిర్ణయం

Aviation | ఎయిర్ ఇండియా పైలట్‌కు ‘డోప్’ టెస్ట్‌లో పాజిటివ్?

Varun Batchigari | అమెరికాలో ప్రియురాలిని చంపి భారత్‌కు పారిపోతుండగా.. జర్మనీలో దొరికిపోయిన ఇండియన్ స్టూడెంట్!

Anasuya | గుమ్మడి కాయ దొంగ అంటూ అనసూయ పోస్ట్ - ఆ హీరోకు కౌంటర్ అంటోన్న నెటిజన్లు

August 15 | నిఘానీడలో ఎర్రకోట.. పంద్రాగస్టుకు కట్టుదిట్టబమైన భద్రత



