Jagadeesh Reddy | డిమాండ్ బుక్, అవుట్ కమ్ బడ్జెట్ బుక్‌పై ఇంత నిర్లక్ష్యమా?: మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
MLA Jagadeesh Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందో సర్కస్ నడుస్తుందో తెలియడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి (MLA Jagadeesh Reddy) ఎద్దేవా చేశారు. డిమాండ్ బుక్ (Demand book), అవుట్ కమ్ బడ్జెట్ బుక్ కాపీ పేస్ట్ (Copy, paste) చేశారని, ఇది ఆర్థిక మంత్రి అవగాహనా రాహిత్యానికి నిదర్శనమన్నారు. డిమాండ్ బుక్స్‌లో అవుట్ కమ్ బడ్జెట్ ముద్రించడం ఏంటని ప్రశ్నించారు.
త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందో సర్కస్ నడుస్తుందో తెలియడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి (MLA Jagadeesh Reddy) ఎద్దేవా చేశారు. డిమాండ్ బుక్ (Demand book), అవుట్ కమ్ బడ్జెట్ బుక్ కాపీ పేస్ట్ (Copy, paste) చేశారని, ఇది ఆర్థిక మంత్రి అవగాహనా రాహిత్యానికి నిదర్శనమన్నారు. డిమాండ్ బుక్స్‌లో అవుట్ కమ్ బడ్జెట్ ముద్రించడం ఏంటని ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లుపై నిర్లక్ష్యమా?
డిమాండ్ బుక్‌లో అవుట్ కమ్ బడ్జెట్ ముద్రించడం చూస్తుంటే ఆర్థిక మంత్రి సొంత ఆర్థిక కారణాలపై బిజీగా ఉన్నట్లు అనిపిస్తుందని అన్నారు. ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని ప్రశ్నించారు. ఈ విషయంలో అధికారులు సైతం బాధ్యతా రహితంగా వ్యవహరించారని మండిపడ్డారు. గతంలో సాధించిన ఫలితాలు, ఈ ఏడాది గ్రాంట్స్ పై ప్రభుత్వానికి స్పష్టత లేదని అర్థమవుతుందన్నారు. పవిత్రమైన అసెంబ్లీలో ప్రవేశ పెట్టే బిల్లులపై ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? అని ఫైరయ్యారు.
పొరపాటు కాదు.. నేరం
ఇదే విషయంపై సభలో మాట్లాడతానని వెల్లడించారు. ఇది పొరపాటు కాదని.. కచ్చితంగా నేరమే అవుతుందని పేర్కొన్నారు. అవుట్ కమ్ బడ్జెట్, ఈ ఏడాది గ్రాంట్స్ బుక్ ఒకేలా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పారు. అసలు కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వం నడుపుతున్నారో, సర్కస్ నడుపుతున్నారో తెలియడం లేదన్నారు. తప్పును సరిదిద్దుకోని అధికారులపై చర్యలు తీసుకోవాలని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



