RS Praveen Kumar | కనీసం మీ కలెక్షన్ బ్యాచ్‌లోనైనా ఒక్క ఎస్సీ అయినా ఉన్నడా?
RS Praveen Kumar | ఎస్సీలపై సీఎం రేవంత్‌రెడ్డి అవకాశవాద ప్రేమల డ్రామాలు బంద్ చేయాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. సీఎం ఆఫీస్ దగ్గర నుంచి మీ వెంట తిరిగే వాళ్లలో ఎవరైనా ఎస్సీలు ఉన్నారా అని ప్రశ్నించారు.
- మీ సీఎం కార్యాలయంలోనే ఎస్సీ ఆఫీసర్లు లేరు
- రియల్ ఎస్టేట్‌లో మీ వెంట తిరిగినోళ్లు కనీసం మారుతీ కారు కొన్నరా?
- ఉంటే వాళ్ల వివరాలు బయటపెట్టండి
- సీఎం రేవంత్‌పై ఎక్స్ వేదికగా ఆర్ఎస్ ప్రవీణ్ ఫైర్
RS Praveen Kumar | త్రినేత్ర.న్యూస్: ఎస్సీలపై సీఎం రేవంత్‌రెడ్డి అవకాశవాద ప్రేమల డ్రామాలు బంద్ చేయాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. సీఎం ఆఫీస్ దగ్గర నుంచి మీ వెంట తిరిగే వాళ్లలో ఎవరైనా ఎస్సీలు ఉన్నారా అని ప్రశ్నించారు. కనీసం మీ కలెక్షన్ బ్యాచ్‌లోనైనా ఒక్క ఎస్సీ అయినా ఉన్నాడా అని నిలదీశారు. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ నన్నెవరూ చూడడం లేదనుకుంటే పొరపాటేనని ఎద్దేవా చేశారు. ఈమేరకు శనివారం ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
వాళ్లు మారుతి కార్లయినా కొన్నరా?
మొదట మీ సీఎం కార్యాలయంలోనే ఎస్సీ వర్గానికి చెందిన ఆఫీసర్లు ఎవరూ లేరు.. ఎందుకు? ఉంటే వాళ్ల వివరాలు ప్రజలకు చెప్పండి. కనీసం మీ చుట్టూ ఉన్న ‘కలెక్షన్ బ్యాచ్’ లో అయినా ఒక్కడైనా ఎస్సీ ఉన్నడా? ఉంటే ఆయన వివరాలు బయటపెట్టండి. మీ 25 సంవత్సరాల రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మీ వెంట తిరిగిన ఎస్సీలు ఎంత మంది? వాళ్లలో ఎంత మంది మీలాగా రియాల్టర్లు/బిల్డర్లు అయ్యారు? విల్లాలు కొనుక్కున్నరు? ఎంత మంది ఫార్చ్యూనర్ కార్లు కొనుక్కున్నరు? కనీసం మారుతి కార్లయినా కొనుక్కున్నరా?
రేవంత్ మాదిగ అని ఎత్తుకుంటే..
మాదిగ ఉద్యోగులు అందరూ మీరేదో చేస్తారని ఆశతో శిల్ప కలావేదికలో ఒక మీటింగ్ పెట్టి మిమ్మల్ని ‘రేవంత్ మాదిగ’ అని ఆకాశానికి ఎత్తుతే మీరు మీ అల్లుడి క్రషర్ కు అక్రమ పర్మిషన్ ఇవ్వలేదని మాదిగ ఇంజినీర్ అంబేద్కర్‌ను రూ.200 కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నయని అభియోగం మోపి జైలుకు పంపారు. ఇప్పుడు ఆ లెక్కలు తప్పని తల పట్టుకున్నరు. ఆయన ఉద్యోగం పోయి రోడ్ల మీద పడ్డాడు.
ఎంత మంది ఎస్సీ అధికారులకు మంచి పోస్టింగ్‌లు ఇచ్చిండ్రు మీరు? లెక్కలు తీయండి. మీరు-పొంగులేటిలు కక్షతో సస్పెండ్ చేసిన అధికారుల్లో మెజారిటీ ఎస్సీ, ఎస్టీలే. మీరు ఆటోల్లో కుక్కి ఎర్రవల్లికి పంపించిన డప్పు కళాకారులకు కూడా ఇంత వరకు జీతాలు ఇవ్వకపోతిరి? నిన్న వాళ్లు సమ్మె కూడా చేసిండ్రు. మీ హాయాంలో అత్యంత పవిత్రమైన గౌలిదొడ్డి క్షేత్రాన్ని బందెల దొడ్డిగా మార్చారు.
కర్ల రాజేష్, ఎర్ర రాజశేఖర్ లను చంపింది ఎవరు? వేముల వీరేశంను పిర్రలు వాచేలా కొట్టమని చెప్పింది ఎవరు? మీరు కాదా? అసెంబ్లీలో వేముల వీరేశం పెట్టిన స్వీటును తాకకుండా తిరస్కరించింది ఎవరు? మందుల సామేలు ఇంటి మీద గుడ్లు వేయించింది ఎవరు? మీరు కాదా? చేవెళ్ల సాక్షిగా ఎస్సీలను మోసం చేసింది ఎవరు.. మీరు కాదా? యాదాద్రి గుడిలో ఎస్సీ మంత్రి భట్టిని నేలపై కూర్చోబెట్టింది ఎవరు.. మీరు కాదా? గోచి కట్టుకున్న ప్రతోడు వైఎస్ రాజశేఖర రెడ్డి కాలేడని అని దెప్పిపొడిచింది ఎవరు.. మీరు కాదా? స్పీకర్‌ను దళిత దళిత అని రోజూ చిత్రహింసలు పెట్టేదెవరు.. మీరు కాదా? ఎస్సీ మంత్రి లక్ష్మణ్ కుమార్ కు తెలవకుండా రూ.2000 కోట్ల కుంభకోణానికి తెరలేపింది ఎవరు?
నకిలీ ప్రేమ ఒలకబోయకు..
కేసీఆర్ ఎస్సీ బాలమల్లుని TGIIC ఛైర్మన్ చేస్తే మీరు జగ్గారెడ్డి భార్యను చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ ప్రతి ఒక్క ఎస్సీని గుండెలో పెట్టి కాపాడుకున్నడు. ఎన్నడూ చెప్పుకోలేదు. తన మనసులో ఉన్న ప్రేమను చేతల్లో చూపించాడు. వేల కోట్లు పంచాడు. మీరు రోజూ ఎస్సీలపై నకిలీ ప్రేమ ఒలకబోస్తూ వాళ్లను పాతాళానికి తొక్కుతున్నారు. కేసీఆర్ ఎస్సీలను పైలెట్లు గా మారిస్తే, మీరు వాళ్లను ఇంకా పాలేరుల లాగానే చూస్తున్నారు.
అందుకే అనుకుంటా దొర పాలేరును పంపించినట్లు మళ్లీ అదే వేముల వీరేశంను భయపెట్టి మళ్లీ ఎర్రవల్లికి డప్పులు ఇచ్చి మరీ బందోబస్తుతో పంపించారు. దీనిపై మీరెక్కడ బహిరంగ చర్చకు రమ్మంటే అక్కడికి వస్తా అని ఆర్ఎస్ ప్రవీణ్ సవాల్ విసిరారు.
తాజావార్తలు
- ●RBI | భారీగా పెరగనున్న వడ్డీ రేట్లు..? రుణం ఇక మరింత ప్రియం..
- ●Rejinagar Assembly bypoll | మమతకు షాక్.. ఉప ఎన్నిక పోటీ నుంచి తప్పుకున్న మరో అభ్యర్థి
- ●Kishan Reddy | బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు.. ఎంపీ టికెట్ ఎలా ఇస్తారు..?
- ●Horror OTT | ఓటీటీలోకి ట్విస్ట్‌లతో వణికించే తెలుగు హారర్ మూవీ - దుష్టశక్తులున్న గుహలో అడుగుపెడితే!
- ●UPI Payments | కొత్త ఛార్జీల మోత.. రూ.2 వేలు దాటితే యూపీఐ చెల్లింపులు తీసుకోబోమంటున్న పెట్రోల్ బంకులు..!
- ●MLC Deshapathi Srinivas | లండన్ "టాక్ చేనేత బతుకమ్మ" పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్

RBI | భారీగా పెరగనున్న వడ్డీ రేట్లు..? రుణం ఇక మరింత ప్రియం..

Rejinagar Assembly bypoll | మమతకు షాక్.. ఉప ఎన్నిక పోటీ నుంచి తప్పుకున్న మరో అభ్యర్థి

Kishan Reddy | బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు.. ఎంపీ టికెట్ ఎలా ఇస్తారు..?

Horror OTT | ఓటీటీలోకి ట్విస్ట్‌లతో వణికించే తెలుగు హారర్ మూవీ - దుష్టశక్తులున్న గుహలో అడుగుపెడితే!





