Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు.. స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు..
Gold And Silver Prices Today | అమెరికా, ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర అస్థిరత ఏర్పడింది. దీంతో సూచీలు భారీ హెచ్చు తగ్గులతో కదులుతున్నాయి. అయితే ఇలాంటి సమయంలో బంగారం, వెండి వంటి సేఫ్ హావెన్ ఆస్తుల పట్ల పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తుంటారు.
Gold And Silver Prices Today | అమెరికా, ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర అస్థిరత ఏర్పడింది. దీంతో సూచీలు భారీ హెచ్చు తగ్గులతో కదులుతున్నాయి. అయితే ఇలాంటి సమయంలో బంగారం, వెండి వంటి సేఫ్ హావెన్ ఆస్తుల పట్ల పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తుంటారు. అందులో భాగంగానే గత వారం సెషన్ మొత్తం ఈ లోహాల ధరలు పెరగ్గా, ఈ వారం మాత్రం నెగెటివ్‌గా ప్రారంభం అయ్యాయి. సోమవారం సెషన్‌లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 0.58 శాతం తగ్గి 4చ352కు చేరగా, వెండి ధర 0.16 శాతం తగ్గి 66 డాలర్లకు చేరింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 929 పాయింట్లు తగ్గి 1,53,452కు చేరగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1752 పాయింట్లు తగ్గి 2,39,995కు చేరింది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధరలు భారీగా తగ్గుదలను నమోదు చేశాయి.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,568 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,24, 544 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,55,680 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,56,800 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.1,600 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,270 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,14,160గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,42,700 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.14,27,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.1,500 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,676 ఉండగా, 8 గ్రాముల ధర రూ.93,408గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,16,760 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,67,600గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.1200 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,50,000 ఉండగా, తులం ధర రూ.2,500గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి కిలోకు రూ.5వేలు తగ్గింది. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,60,000 ఉండగా, తులం ధర రూ.2,600 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.14వేలకు పైగా పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారులకు చాన్స్..
సెప్టెంబర్ 19, 2026

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో మళ్లీ కొనుగోళ్ల జోష్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
సెప్టెంబర్ 18, 2026

Gold And Silver Prices Today | ఫెడ్ రేట్ల పెంపు ఎఫెక్ట్.. బంగారం ధరలపై ప్రభావం..
సెప్టెంబర్ 17, 2026
తాజావార్తలు
- ●Kerala Rains | కేరళలో వర్ష బీభత్సం.. ఐదుగురు మృతి.. ఐఎండీ హెచ్చరికలు
- ●Toxic OTT | ట్రిమ్ వెర్షన్‌తో ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’ - బోల్డ్ సీన్లు కట్!
- ●Rashmika Mandanna | షూటింగ్ అంటేనే వణికిపోయా - మైసాపై రష్మిక మందన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- ●Stock Markets | మార్కెట్లకు విదేశీ పెట్టుబడుల అండ.. 478 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్..
- ●K Shobha Reddy | సీఎం గారూ అపాయింట్మెంట్ ఇవ్వండి ప్లీజ్.. ట్రోల్స్‌పై కే శోభారెడ్డి ఆవేదన
- ●Neem Tree | నల్లమలలో వేప చెట్లకు వింత తెగులు..

Kerala Rains | కేరళలో వర్ష బీభత్సం.. ఐదుగురు మృతి.. ఐఎండీ హెచ్చరికలు

Toxic OTT | ట్రిమ్ వెర్షన్‌తో ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’ - బోల్డ్ సీన్లు కట్!

Rashmika Mandanna | షూటింగ్ అంటేనే వణికిపోయా - మైసాపై రష్మిక మందన్న ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Stock Markets | మార్కెట్లకు విదేశీ పెట్టుబడుల అండ.. 478 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్..



