త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Toxic OTT | ట్రిమ్ వెర్షన్‌తో ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’ – బోల్డ్ సీన్లు కట్!

భారీ అంచ‌నాల న‌డుమ థియేట‌ర్ల‌లో రిలీజైన య‌శ్ టాక్సిక్ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. దాదాపు ఆరు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ మూడు వంద‌ల కోట్ల లోపే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈ డిజాస్ట‌ర్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. సెప్టెంబ‌ర్ 25 నుంచి జీ5 ఓటీటీలో టాక్సిక్ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

N

Entertainment | Published On Sep 21, 2026, 11.44 am IST

Toxic OTT  | ట్రిమ్ వెర్షన్‌తో ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’ – బోల్డ్ సీన్లు కట్!
Advertisement

Toxic OTT | ఈ ఏడాది ద‌క్షిణాదితో పాటు బాలీవుడ్ ప్రేక్ష‌కుల్లో అత్యంత ఆస‌క్తిని రేకెత్తించిన సినిమాల్లో ఒక‌టిగా య‌శ్ టాక్సిక్ నిలిచింది. రిలీజ్‌కు ముందు ఈ గ్యాంగ్‌స్ట‌ర్ మూవీపై వ‌చ్చిన హైప్ అంతా ఇంతా కాదు. కేజీఎఫ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత య‌శ్ చేసిన‌ సినిమా కావ‌డం, ఐదుగురు హీరోయిన్లు న‌టించ‌డం, హాలీవుడ్ స్టాయిలో టీజ‌ర్‌, ట్రైల‌ర్ ఉండ‌టంతో దేశ‌వ్యాప్తంగా సినీ ల‌వ‌ర్స్ ఈ సినిమా కోసం ఉత్కంఠ‌గా ఎదురుచూశారు. భారీ అంచ‌నాల న‌డుమ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన టాక్సిక్ బాక్సాఫీస్ వ‌ద్ద దారుణంగా నిరాశ‌ప‌రిచింది. క‌థ‌లో బ‌ల‌మైన ఎమోష‌న్లు లేక‌పోవ‌డం, అన‌వ‌స‌ర‌పు బోల్డు సీన్లు, హీరోయిన్ల పాత్ర‌ల‌కు ప్రాధాన్య‌త లేక‌పోవ‌డంతో ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది. దాదాపు ఆరు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ మూడు వంద‌ల కోట్ల‌లోపే వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. నిర్మాత‌ల‌కు భారీగా న‌ష్టాల‌ను తెచ్చిపెట్టింది.

ఓటీటీలోకి....

థియేట‌ర్ల‌లో డిజాస్ట‌ర్‌గా నిలిచిన టాక్సిక్ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. సెప్టెంబ‌ర్ 25 నుంచి జీ5 ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. క‌న్న‌డంతో పాటు తెలుగులోనూ రిలీజ్ అవుతోన్న‌ట్లు స‌మాచారం. థియేట‌ర్ వెర్ష‌న్‌తో పోలిస్తే ఓటీటీ వెర్ష‌న్‌లో చాలా మార్పులు చేసిన‌ట్లు స‌మాచారం. బోల్డ్ సీన్ల‌తో పాటు ర‌న్‌టైమ్‌పై చాలా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. మూడు గంట‌ల ప‌ధ్నాలుగు నిమిషాల సుధీర్ఘ ర‌న్‌టైమ్‌తో థియేట‌ర్ల‌లో టాక్సిక్ రిలీజైంది. ఓటీటీ కోసం దాదాపు 30 నిమిషాలు సినిమాను ట్రిమ్ చేయ‌బోతున్నారు. బోల్డు సీన్ల‌తో పాటు కొన్ని యాక్ష‌న్ ఎపిసోడ్స్ క‌ట్ చేయ‌బోతున్న‌ట్లు చెబుతున్నారు.

న‌య‌న‌తార‌, కియారా అద్వానీ...

టాక్సిక్ మూవీలో న‌య‌న‌తార, కియారా అద్వానీ, రుక్మిణి వ‌సంత్‌, తారా సుతారియా హీరోయిన్లుగా న‌టించారు. హ్యూమా ఖురేషి ఓకీల‌క పాత్ర‌లో న‌టించింది. గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. డైరెక్ట‌ర్‌తో క‌లిసి య‌శ్ ఈ సినిమాకు క‌థ‌ను అందించారు.

గ్యాంగ్‌స్ట‌ర్ రాయ

రాయ అనే గ్యాంగ్‌స్ట‌ర్ జీవితం ఆధారంగా టాక్సిక్ మూవీని తెర‌కెక్కించారు డైరెక్ట‌ర్ గీతూ మోహ‌న్ దాస్‌. గోవా నేర‌సామ్రాజ్యానికి కింగ్ మేక‌ర్ కావాల‌ని అనుకున్న రాయ జీవితం నాదియా ప‌రిచ‌యంతో ఎలాంటి మ‌లుపులు తిరిగింది? త‌మ్ముడి కోసం రాయ సోద‌రి గంగ ఎలాంటి త్యాగం చేసింది? రెబెకాను పెళ్లి చేసుకున్న రాయ ఆమెకు ఎందుకు దూర‌మ‌య్యాడు? రాయ పోలిక‌ల‌తోనే ఉన్న టికెట్ ఎవ‌రు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

 

Advertisement
Advertisement