Revanth vs Uttam | నా ప్రజెంటేషన్‌ను నువ్వెట్ల ఆపుతవ్..
Revanth vs Uttam | కొత్త ఏడాది తొలిరోజే ప్రజా భవన్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేదు అనుభవం ఎదురైనట్లు సమాచారం. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, సీఎం రేవంత్ రెడ్డికి తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.
నీకు ఊడిగం చేసేందుకు లేం..
సీఎంను నిలదీసిన నీళ్ల మంత్రి
ఇరువురి మధ్య తీవ్ర దుమారం
తన పీపీటీని ఆపిన సీఎంపై
ఢిల్లీ పెద్దలకు ఉత్తమ్ ఫిర్యాదు
Revanth vs Uttam | త్రినేత్ర.న్యూస్ : కొత్త ఏడాది తొలిరోజే ప్రజా భవన్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేదు అనుభవం ఎదురైనట్లు సమాచారం. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, సీఎం రేవంత్ రెడ్డికి తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. కృష్ణా నదీ జలాల వినియోగంతో పాటు పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుండగా, దాన్ని సీఎం రేవంత్ అడ్డుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అకారణంగా పీపీటీ ప్రత్యక్ష ప్రసారాన్ని అడ్డుకోవడంతో.. సీఎంపై ఉత్తమ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. నువ్వెంత అంటే నువ్వెంత అని హద్దులు దాటి తిట్టుకున్నట్టు సమాచారం.
దీంతో సీఎం రేవంత్, నీళ్ల మంత్రి ఉత్తమ్ మధ్య తీవ్ర దుమారం రేగినట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే తామేం నీకు ఊడిగం చేయడం లేదు, నేను ఇచ్చే ప్రెజెంటేషన్‌ను జనాల్లోకి వెళ్లకుండా ఆపడానికి నువ్వెవరని ముఖ్యమంత్రిపై ఇరిగేషన్ మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
మేమేం నీ దగ్గర పని చేయడం లేదు. నీదగ్గర ఊడిగం అంతకన్నా చేయడం లేదు. ఏం చేయాలో మాకు తెలుసని ఉత్తం కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డితో అన్నట్లు వినికిడి. సీనియర్ మంత్రిగా నేనేం చేయాలో నాకు తెలుసు, నీ ద్వారా తెలుసుకోవలసిన అవసరం నాకు లేదు. అసలు నేను ప్రజలకు చెప్పదలుచుకున్న విషయాలను వాళ్లకు చేరకుండా నిలువరించడానికి నువ్వెవరు అంటూ నీళ్ల మంత్రి నిప్పులు చెరిగినట్లు సమాచారం.
అంతటితో ఆగని ఉత్తం కుమార్ రెడ్డి ఢిల్లీలోని అధిష్టానం పెద్దలకు కూడా ఫోన్ చేసి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడల వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో బద్నాం అవుతుందని అధిష్టానికి ఉత్తమ్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ప్రజా భవన్‌లో సీఎం ప్రసంగం ముగిశాక ఇంటికి చేరుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తన పీపీటీ మీడియా కవరేజ్‌పై సన్నిహితులతో ఆరా తీసినట్టు సమాచారం. పీపీటీ మీడియా లింక్‌ను సీఎం రేవంత్ దగ్గరుండి నిలిపివేయించినట్లు తెలియడంతో మరింత కోపోద్రిక్తులైనట్లు తెలిసింది. ఈ అంశంపై అసెంబ్లీ లాబీల్లో శుక్రవారం నిఘావర్గాలు సైతం ఆరా తీస్తూ కనిపించడం సంచలనం రేకెత్తిస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



