Nushrat Bharucha | ఉజ్జయిని టెంపుల్‌లో హీరోయిన్ పూజలు – ఫత్వా జారీ చేసిన ముస్లిం పెద్దలు
న్యూ ఇయర్ సందర్భంగా బాలీవుడ్ నటి నుష్రత్ బరుచా ఉజ్జయిని లోని మహాకాళేశ్వర్‌ను దర్శించుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ముస్లిం అయిన నుష్రత్ మహాకాళేశ్వర్‌ను దర్శించుకోవడం వివాదానికి దారితీసింది.
Entertainment | Published On Jan 2, 2026, 5.58 pm IST
Nushrat Bharucha | బాలీవుడ్ హీరోయిన్ నుష్రత్ బరుచా వివాదంలో చిక్కుకుంది. ఓ వర్గం వారితో పాటు నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. లవ్ సెక్స్ అవుర్ దోఖా సినిమాతో బాలీవుడ్ ఫస్ట్ హిట్ అందుకుంది. ప్యార్ కా పూంచ్‌నామా, సోను కే టీటు కీ స్వీటీ సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ సక్సెస్‌లతో గ్లామర్ రోల్స్‌కు బాలీవుడ్‌లో కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ఈ ఏడాది ఛోరీ 2 తో పాటు ఉఫ్ సినిమాల్లో కనిపించింది. ప్రయోగాత్మక కథాంశాలతో రూపొందిన ఈ సినిమాల్లో నుష్రత్ నటనకు మంచి పేరొచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోన్న నుష్రత్ వివాదంలో చిక్కుకుంది. న్యూ ఇయర్ సందర్భంగా ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్‌ను దర్శించుకుంది. గుడిలో ప్రత్యేకంగా పూజలు చేయడమే కాకుండా భస్మ హారతి సేవలో పాల్గొన్నది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది నుష్రత్. మహాకాళేశ్వర్ టెంపుల్‌ను దర్శించుకోవడం ఇది రెండో సారి అంటూ నుష్రత్ ఈ పోస్ట్‌లో పేర్కొన్నది. ఇక నుంచి ప్రతి ఏడాది కొత్త సంవత్సరం రోజున మహాకాళేశ్వర్‌ను దర్శిస్తానని ఈ పోస్ట్‌లో పేర్కొన్నది. నుష్రత్ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఫత్వా జారీ....
ముస్లిం అమ్మాయి అయిన నుష్రత్ మహాకాళేశ్వర్ టెంపుల్‌ను దర్శించుకోవడంపై ముస్లిం వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నుష్రత్‌పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఆల్ ఇండియా ముస్లిం నేషనల్ ప్రెసిడెంట్ మౌలానా షహబుద్దీన్ రజ్వీ...నుష్రత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు ఫత్వా జారీ చేశారు. ముస్లిం అమ్మాయిలు టెంపుల్స్‌ను దర్శించుకోవడం, పూజలు చేయడం షరియా లా ప్రకారం నిషేధమని రజ్వీ అన్నారు. మహంకాళి టెంపుల్‌ను దర్శించి ముస్లిం వర్గాన్ని నుష్రత్ ఆవమానించిందంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లాతో పాటు ముస్లిమ్‌లు అందరికి ఆమె క్షమాపణలు చెప్పాల్సిందేనని, కల్మా పఠించాలని డిమాండ్ చేశారు.
ఈ వివాదం కారణంగా గతంలో ఓ ఇంటర్వ్యూలో తాను అన్ని మతాలను విశ్వసిస్తానని నుష్రత్ చెప్పిన ఓ పాత ఇంటర్వ్యూ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టెంపుల్‌తో పాటు గురుద్వారా, చర్చి అన్నింటిని దర్శించుకుంటానని చెప్పింది. అన్నింటిలో ఒకే రకమైన ప్రశాంతత లభిస్తుందని అన్నది. ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
సంబంధిత వార్తలు

Jacqueline Fernandez | మనీ లాండరింగ్ కేసులో ట్విస్ట్ – బాలీవుడ్ హీరోయిన్‌కు ఎదురుదెబ్బ
మే 11, 2026

Kriti Sanon | నేను నెపోటిజం బాధితురాలినే – బాలీవుడ్‌లో హీరోయిన్లపై వివక్ష ఎక్కువే – కృతి సనన్ కామెంట్స్
మే 10, 2026

Nargis Fakhri | బాలయ్య సినిమాలో హాట్ హీరోయిన్ … ఐటెంసాంగ్ కోసం రంగంలోకి బాలీవుడ్ సెన్సేషన్
మే 7, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



