Raashii Khanna | ఓటీటీలో రిలీజైన రాశీఖన్నా బాలీవుడ్ డిజాస్టర్ మూవీ – 90 కోట్లతో తీస్తే 20 కోట్లు వచ్చాయి
రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ మూవీ 120 బహదూర్ ఓటీటీలో రిలీజైంది. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు 90 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ వార్ డ్రామా మూవీ 20 కోట్ల కలెక్షన్స్‌తో డిజాస్టర్‌గా నిలిచింది.
Entertainment | Published On Jan 2, 2026, 6.35 pm IST
Raashii Khanna | రాశీఖన్నా బాలీవుడ్ మూవీ 120 బహదూర్ ఓటీటీలోకి వచ్చింది. వార్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు రంజీస్ దర్శకత్వం వహించారు. ఫర్హాన్ అక్తర్ హీరోగా నటించాడు. థియేటర్లలో రిలీజైన నెలన్నర తర్వాత ఈ బాలీవుడ్ సినిమా ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. ఫ్రీగా కాకుండా రెంటల్ విధానంలో మేకర్స్ 120 బహదూర్‌ను స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకొచ్చారు.
థియేటర్లలో...
దాదాపు 90 కోట్ల భారీ బడ్జెట్‌తో 120 బహదూర్ సినిమా రూపొందింది. కానీ థియేటర్లలో 20 కోట్ల లోపే వసూళ్లను దక్కించుకుంది. గత ఏడాది బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. టెక్నికల్‌గా మాత్రం హిందీలో ఇప్పటివరకు వచ్చిన బెస్ట్ వార్ డ్రామా మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. ఎమోషన్స్ సరిగ్గా వర్కవుట్ కాకపోవడంతో 120 బహదూర్ ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది.
ఇండో - చైనా యుద్ధం నేపథ్యంలో...
1962లో జరిగిన ఇండియా చైనా యుద్ధంలోని రెంజాగ్ లా సంఘటన నుంచి స్ఫూర్తి పొందుతూ దర్శకుడు రంజీస్ ఈ సినిమాను రూపొందించారు. దేశంలోకి చొరబడటానికి ప్రయత్నించిన మూడువేల చైనా సైనికులను 120 మంది భారత ఆర్మీ ఎలా ఎదురించారనే కాన్సెప్ట్‌తో స్ఫూర్తిదాయకంగా దర్శకుడు ఈ సినిమాను రూపొందించారు. 120 బహదూర్ సినిమాకు ఢిల్లీ, రాజస్థాన్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాలు పన్ను మినహాయింపు ఇచ్చాయి.
నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ...
120 బహదూర్‌లో హీరోగా నటిస్తూనే ఈ సినిమాకు ఓ ప్రొడ్యూసర్‌గా కూడా ఫర్హాన్ అక్తర్ వ్యవహరించారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత యాక్టర్‌గా ఈ మూవీతో రీఎంట్రీ ఇచ్చాడు. ఫర్హాన్ అక్తర్ భార్య పాత్రలో రాశీఖన్నా కనిపించింది.
స్పెషల్ సాంగ్...
గత ఏడాది తెలుసు కదా మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది రాశీఖన్నా. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశీ ఖన్నాతో పాటు శ్రీలీల మరో నాయికగా నటిస్తోంది.
సంక్రాంతికి రిలీజ్ కానున్న అనగనగా ఒక రాజు సినిమాలో రాశీఖన్నా ఓ స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



