త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana – AP | తెలుగు రాష్ట్రాల మ‌ధ్య న‌దీ జ‌లాల వివాదాల ప‌రిష్కారానికి క‌మిటీ..!

Telangana - AP | గోదావ‌రి, కృష్ణా న‌దీ జ‌లాల విష‌యంలో తెలంగాణ‌, ఏపీ రాష్ట్రాల మ‌ధ్య నిరంత‌రం ఏదో ఒక వివాదం నెల‌కొంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

S

Telangana | Published On Jan 2, 2026, 5.12 pm IST

Telangana – AP | తెలుగు రాష్ట్రాల మ‌ధ్య న‌దీ జ‌లాల వివాదాల ప‌రిష్కారానికి క‌మిటీ..!
Advertisement

Telangana - AP | త్రినేత్ర‌.న్యూస్ : గోదావ‌రి, కృష్ణా న‌దీ జ‌లాల విష‌యంలో తెలంగాణ‌, ఏపీ రాష్ట్రాల మ‌ధ్య నిరంత‌రం ఏదో ఒక వివాదం నెల‌కొంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. తెలంగాణ‌, ఏపీ రాష్ట్రాల మ‌ధ్య న‌దీ జ‌లాల వివాదాల ప‌రిష్కారానికి కేంద్ర జ‌ల సంఘం చైర్మ‌న్ నేతృత్వంలో క‌మిటీని ఏర్పాటు చేసింది. ఏర్పాటైన క‌మిటీని నోటిఫై చేస్తూ జ‌ల్‌శ‌క్తి శాఖ శుక్ర‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఈ కమిటీలో సభ్యులుగా కృష్ణా-గోదావరి బోర్డుల ఛైర్మన్లు, ఎన్‌డబ్ల్యూడీఏ చీఫ్ ఇంజనీర్, సీడబ్ల్యూసీ చీఫ్ ఇంజనీర్‌తో పాటు రెండు రాష్ట్రాల జల వనరుల శాఖ ఉన్నతాధికారులకు స్థానం క‌ల్పించింది. కమిటీలో ఏపీ నుంచి నలుగురికి, తెలంగాణ నుంచి నలుగురికి చోటు ద‌క్కింది.

Advertisement

తాజావార్తలు

Advertisement