త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Barse Deva | మావోయిస్టు అగ్ర‌నేత బ‌ర్సే దేవా లొంగుబాటు

Barse Deva | మావోయిస్టు అగ్ర‌నేత బ‌ర్సే దేవా తెలంగాణ డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. బ‌ర్సే దేవాతో పాటు మ‌రో 15 మంది మావోయిస్టులు కూడా స‌రెండ‌ర్ అయ్యారు.

S

Telangana | Published On Jan 2, 2026, 5.02 pm IST

Barse Deva | మావోయిస్టు అగ్ర‌నేత బ‌ర్సే దేవా లొంగుబాటు
Advertisement

Barse Deva | త్రినేత్ర‌.న్యూస్ : మావోయిస్టు అగ్ర‌నేత బ‌ర్సే దేవా తెలంగాణ డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. బ‌ర్సే దేవాతో పాటు మ‌రో 15 మంది మావోయిస్టులు కూడా స‌రెండ‌ర్ అయ్యారు. బ‌ర్సే లొంగుబాటు వివ‌రాల‌ను డీజీపీ శ‌నివారం మీడియాకు వెల్ల‌డించ‌నున్నారు.

మావోయిస్టు పార్టీ గెరిల్లా లిబ‌రేష‌న్ ఆర్మీ చీఫ్‌గా బ‌ర్సే బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. హిడ్మా ఎన్‌కౌంట‌ర్ త‌ర్వాత మావోయిస్టు పార్టీలో దేవా కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌ధానంగా మావోయిస్టు పార్టీ సాయుధ బ‌ల‌గాల వ్య‌వ‌హారాల‌ను చూస్తున్నారు. అయితే హిడ్మా, దేవా ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని ఒకే గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మావోయిస్టుల‌కు ఆయుధాల స‌ర‌ఫ‌రాలో దేవా కీల‌క పాత్ర పోషించారు. నిన్న తెలంగాణ - ఛ‌త్తీస్‌గ‌ఢ్ స‌రిహ‌ద్దు నుంచి బ‌ర్సే దేవా బృందాన్ని పోలీసులు తీసుకొచ్చారు.

Advertisement

తాజావార్తలు

Advertisement