త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS Letter | రేవంత్ కూతురు బినామీ వ్యాపారాల‌పై విచార‌ణ జ‌రిపించండి.. ఈడీ, పీఎంకు బీఆర్ఎస్ లేఖ‌

BRS Letter | సీఎం రేవంత్‌రెడ్డి కూత‌రు నైమిషారెడ్డి బినామీ వ్యాపారాల‌పై విచార‌ణ జ‌రిపించాల‌ని బీఆర్ఎస్ నేత‌లు డిమాండ్ చేశారు. ఈమేర‌కు శ‌నివారం ఈడీ, రాష్ట్రపతి, లోక్ భవన్, ప్రధాని మోదీతో పాటు పలు విచారణ సంస్థలకు పూర్తి మెటీరియల్ సహా లేఖ రాశారు.

S

Telangana | Published On Oct 3, 2026, 3.48 pm IST

BRS Letter | రేవంత్ కూతురు బినామీ వ్యాపారాల‌పై విచార‌ణ జ‌రిపించండి.. ఈడీ, పీఎంకు బీఆర్ఎస్ లేఖ‌
Advertisement

BRS Letter | త్రినేత్ర న్యూస్‌: సీఎం రేవంత్‌రెడ్డి కూత‌రు నైమిషారెడ్డి బినామీ వ్యాపారాల‌పై విచార‌ణ జ‌రిపించాల‌ని బీఆర్ఎస్ నేత‌లు డిమాండ్ చేశారు. ఈమేర‌కు శ‌నివారం ఈడీ, రాష్ట్రపతి, లోక్ భవన్, ప్రధాని మోదీతో పాటు పలు విచారణ సంస్థలకు పూర్తి మెటీరియల్ సహా లేఖ రాశారు. రేవంత్ రెడ్డి రూ.13,200 కోట్ల బినామీ వ్యాపారాల పూర్తి వివరాలు లేఖ‌లో వివ‌రించిన‌ట్లు పేర్కొన్నారు.

మెడికోవర్ ఆసుపత్రిలో సీఎం రేవంత్ బినామీల వాటా, అల్లుడు సత్యా గోలుగూరి మాక్స్ బియన్ ఫార్మా, ఎనుముల నిమిషా రెడ్డి మైండ్ వాల్ట్ నిర్మాణ సంస్థతో చేపడుతున్న కార్పొరేట్ స్కూల్స్, ఇటీవలే మేడికోవర్ ఆసుపత్రిని అమ్మి దక్కించుకున్న రూ.13,200 కోట్ల పై విచారణ చేపట్టాలని అందులో కోరారు. అన్ని ఆధారాలను జతపరిచి అన్ని పార్టీల జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులకు, విచారణ సంస్థలకు పంపించారు.

Advertisement
Advertisement