త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG Inter Results | ఈ రోజే ఇంట‌ర్ ఫ‌లితాలు.. క్ష‌ణికావేశాల‌కు లోను కాకండి..!

TG Inter Results | తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు( TG Inter Results ) ఆదివారం ఉద‌యం 11 గంట‌ల‌కు విడుద‌ల కానున్నాయి. ఈ ఫ‌లితాల‌ను నాంప‌ల్లి ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు కార్యాల‌యంలో ప్ర‌భుత్వ స‌ల‌హాదారు కే కేశ‌వ‌రావు( Keshava Rao ) విడుద‌ల చేయ‌నున్నారు.

S

Telangana | Published On Apr 12, 2026, 7.07 am IST

TG Inter Results | ఈ రోజే ఇంట‌ర్ ఫ‌లితాలు.. క్ష‌ణికావేశాల‌కు లోను కాకండి..!
Advertisement

TG Inter Results | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు( TG Inter Results ) ఆదివారం ఉద‌యం 11 గంట‌ల‌కు విడుద‌ల కానున్నాయి. ఈ ఫ‌లితాల‌ను నాంప‌ల్లి ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు కార్యాల‌యంలో ప్ర‌భుత్వ స‌ల‌హాదారు కే కేశ‌వ‌రావు( Keshava Rao ) విడుద‌ల చేయ‌నున్నారు. ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ఫ‌లితాల‌ను ఒకేసారి విడుద‌ల చేయ‌నున్నారు. ఇక ఫ‌లితాల‌ను వాట్సాప్ ద్వారా సులువుగా పొందొచ్చు.

క్ష‌ణికావేశాల‌కు లోను కాకండి..!

  • ఇంట‌ర్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌రం ప‌రీక్ష‌ల‌కు 9,97,075 మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు. వీరిలో అంద‌రూ ఉత్తీర్ణ‌త సాధించ‌లేరు. కొంద‌రు ఫెయిల్ కూడా అవుతారు. అది కూడా ఒక‌ట్రెండు మార్కుల‌తోనే ఉత్తీర్ణ‌త సాధించ‌లేక‌పోతారు. అలా ఫెయిలైన వారు క్ష‌ణికావేశాల‌కు లోను కావాల్సిన అవ‌స‌రం లేదు.
  • ఫెయిల‌య్యాను.. కుటుంబంతో పాటు స్నేహితుల ముందు అవ‌మానంగా ఉంటుందేమో అని ఊహించుకోకండి. న‌రం లేని నాలుక ఎన్ని ర‌కాలుగానైనా మాట్లాడుతుంది. ఎవ‌రో అవ‌మానిస్తార‌ని, ఎవ‌రో ఏదో అనుకుంటార‌ని భావించి.. మ‌న‌స్తాపానికి గురై త‌ల్లిదండ్రులకు క‌న్నీటి శోకాన్ని మిగ‌ల్చ‌కండి.
  • జీవితం అంటే ఇంట‌ర్ పాస్ అవ్వ‌డం ఒక్క‌టే కాదు. ఇంట‌ర్ ఫెయిలైతే బ‌త‌క‌లేమా..? ఇత‌ర కోర్సులు చేయ‌లేమా..? ఎన్నో ర‌కాలుగా జీవితంలో స్థిర‌ప‌డొచ్చు. చ‌దువుతోనే జీవితంలో బ‌త‌క‌ల‌గం అనే ధోర‌ణి నుంచి బ‌య‌ట‌ప‌డాలి. ఒకవేళ మీరు క్ష‌ణికావేశానికి గురై చేయ‌కూడని ప‌ని చేస్తే.. అక్క‌డితోనే జీవితం ముగిసిపోతోంది. అదే గుండై ధైర్యం చేసుకుని మ‌రో ముంద‌డుగు వేస్తే ఇంకా గొప్ప విజ‌యాలు సాధించే అవ‌కాశం ఉంటుంది. జీవితంలో ఉన్న‌త శిఖ‌రాలు అధిరోహించే అవ‌కాశం ఉంటుంది.
  • ప‌ది, ఇంట‌ర్ ఫెయిలైన వారిలో చాలా మంది ఓపెన్ డిగ్రీలు చేసి.. ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉద్యోగాల‌తో పాటు అనేక ఉన్న‌త రంగాల్లో ఉద్యోగాలు సంపాదించిన వారు ఉన్నారు. అలాంటి వారు ఇంట‌ర్, ప‌ది ఫెయిలైన‌ప్పుడు ఇక ఈ జీవితం చాలు అని అనుకుంటే.. ఈ రోజు వారు ఉన్న‌త స‌ర్వీసుల్లో ఉండేవారా..? ఆలోచించుకోవాలి. కాబ‌ట్టి విద్యార్థులెవ‌రూ క్షణికావేశాల‌కు లోను కావాల్సిన అవ‌స‌రమే లేదు.

ఇంట‌ర్ విద్యార్థుల‌కు సూచ‌న‌లు

  • ఇవాళ విడుద‌ల‌య్యే ఫ‌లితాల్లో ఫెయిల్ అయితే మ‌రోసారి ఫెయిలైన ప‌రీక్ష రాసుకోవ‌చ్చు. అది కూడా ఒక‌ట్రెండు నెల‌ల్లోనే ప‌రీక్ష‌లు నిర్వ‌హించి, ఫ‌లితాల‌ను విడుద‌ల చేస్తారు. ఒక నెల రోజులు క‌ష్ట‌ప‌డి చ‌దివి స‌ప్లిమెంట‌రీ పరీక్ష‌ల‌కు హాజ‌రై ఉత్తీర్ణ‌త సాధిస్తే.. మీ స్నేహితుల‌తో పాటు మీరు కూడా ఉన్న‌త చ‌ద‌వులు చ‌ద‌వొచ్చు.
  • ఫెయిలైన విద్యార్థులు ఒంట‌రిగా ఉండ‌కండి.. మీ త‌ల్లిదండ్రుల‌తోనూ లేదంటే ఇష్ట‌మైన స్నేహితుల మ‌ధ్య గ‌డ‌పండి. లేదా ఒక‌ట్రెండు రోజులు ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో గ‌డ‌పండి.
  • మ‌రి ముఖ్యంగా ఇత‌రుల మార్కుల‌తో మీ మార్కుల‌ను పోల్చుకోకండి. ఎవ‌రి శ‌క్తి సామర్థ్యాల‌ను బ‌ట్టి వారికి మార్కులు వ‌స్తాయి. కాబ‌ట్టి ఇత‌రుల మార్కుల‌ను పోల్చి చూసుకున్న‌ప్పుడు మ‌న‌కు తెలియ‌కుండానే మ‌నం డిప్రెష‌న్‌లోకి వెళ్లే అవ‌కాశం ఉంటుంది. ఇది చాలా ప్ర‌మాద‌క‌రం.

త‌ల్లిదండ్రులారా.. మంద‌లించ‌కండి..

  • చాలా మంది త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌లు నూటికి నూరు శాతం మార్కులు సాధించాలి అని భావిస్తారు. ఇందులో త‌ప్పేం లేదు. కానీ చాలా కార‌ణాల వ‌ల్ల‌.. కొంత మేర మార్కులు త‌గ్గే అవ‌కాశం ఉంటుంది. మార్కులు త‌గ్గాయ‌ని చెప్పి మీ పిల్ల‌ల‌ను మంద‌లించ‌కండి.. మేం ఉన్నామ‌ని ధైర్యం చెప్పండి. చాలా మంచి మార్కులు వ‌చ్చాయ‌ని.. పిల్ల‌ల‌కు ఆత్మ‌స్థైర్యం క‌ల్పించేలా వారితో మాట్లాడండి. అంతేకాని మంద‌లించి.. మీ పిల్ల‌ల భ‌విష్య‌త్‌ను మీరే చీక‌ట్లోకి నెట్టేయ‌కండి.
Advertisement

తాజావార్తలు

Advertisement