HYDRAA | విద్యార్థుల భద్రతే ముఖ్యం.. ఫేక్ ఫైర్ ఎన్‌వోసీలపై కాలేజీలకు హైడ్రా దిశానిర్దేశం
HYDRAA | విద్యార్థుల భద్రత ముఖ్యం కావాలి.. కాలేజీ యాజమాన్యాలు ఆ దిశగా ఆలోచించాలని హైడ్రా - ఇంటర్ బోర్డు సూచించాయి. అనుకోని పరిస్థితుల్లో అగ్నిప్రమాదాలు జరిగితే విద్యార్థులు, బోధనా సిబ్బంది సురక్షితంగా బయట పడేందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరాయి.
HYDRAA | త్రినేత్ర.న్యూస్ : విద్యార్థుల భద్రత ముఖ్యం కావాలి.. కాలేజీ యాజమాన్యాలు ఆ దిశగా ఆలోచించాలని హైడ్రా - ఇంటర్ బోర్డు సూచించాయి. అనుకోని పరిస్థితుల్లో అగ్నిప్రమాదాలు జరిగితే విద్యార్థులు, బోధనా సిబ్బంది సురక్షితంగా బయట పడేందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరాయి.
ఇందుకు అనుగుణంగా ఏమైనా మార్పులు చేర్పులు అవసరమైతే వెంటనే చేపట్టాలన్నారు. ఫేక్ ఫైర్ ఎన్‌వోసీల నేపథ్యంలో హైడ్రా కేసులు పెట్టడం.. ఇంటర్ బోర్డు ఆయా కళాశాలపై చర్యలు తీసుకున్న వేళ.. నిర్వాహకులతో హైడ్రా - ఇంటర్ బోర్డు సంయుక్తంగా సమామేశాన్ని ఏర్పాటు చేశాయి. ఫేక్ ఫైర్ ఎన్‌వోసీలతో విద్యార్థలు భద్రతను గాలిలో పెట్టొద్దని సూచించాయి. ఇదే సమయంలో ఆయా కళాశాలల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నాయి. ఫేక్ ఫైర్ ఎన్‌వోసీలు పెట్టడానికి గల కారణాలపై ఆరాతీశాయి. అనంతరం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ మాట్లాడారు.
ఫేక్ ఫైర్ ఎన్‌వోసీల పేరిట కళాశాలల యాజమాన్యాలను ఇబ్బంది పెట్టడం ఇరు శాఖల ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. కళాశాలల యాజమాన్యాలు కోరిన విధంగా ప్రతి ఏటా కాకుండా రెండేళ్లకోసారి రెన్యూవల్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తామని హైడ్రా కమిషనర్ చెప్పారు. అలాగే రెండో స్టైర్‌కేస్ ఉండేలా చర్యలు తీసుకోవాలని.. పాత భవనాలకు వెసులుబాటు లేకపోతే ప్రత్యామ్నాయం చూడాలని సూచించారు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగలరు..
ఫైర్ ఎన్‌వోసీలు, వాటి రెన్యూవల్స్ కోసం https://hydraafirenoc.telangana.gov.in హైడ్రా వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సూచించారు. బ్రోకర్లను నమ్మి మోసపోవద్దన్నారు. ఫైర్ ఎన్ వోసీల జారీని సరళతరం చేశామన్నారు. హైడ్రా అనుమతి పొందిన ఏజెన్సీల ద్వారా ఫైర్ ఎన్ వోసీలు జారీ చేసే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తామన్నారు. ఆన్లైన్లోనే దరఖాస్తుల స్వీకరణ, అనుమతుల మంజూరీ, పాత అనుమతుల పునరుద్ధరణ, వాటికి సంబంధించిన ఫీజుల చెల్లింపులు.. ఇలా అన్నీ ఆన్లైన్లోనే జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పరేషన్‌తో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ), క్యూర్ (కోర్ ఆర్బన్ రీజయన్ ఎకానమీ) పరిధిలోని మూడు కార్పొరేషన్ల పరిధిలో ఉన్నవారంతా ఇదే విధంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
హైడ్రా కార్యాలయం వరకూ ఎవరూ రావాల్సిన పని లేదని పేర్కొన్నారు. ఫేక్ ఫైర్ ఎన్‌వోసీలకు సంబంధించి సూత్రదారులు, పాత్రదారులు ఎవరనేదానిపై లోతైన విచారణ జరుగుతుందని అన్నారు. బాధ్యులపై చర్యలుంటాయన్నారు. ఇంటర్ కళాశాలల యాజమాన్యాలు ఎవరికి వారు ఫైర్ ఎన్‌వోసీలు సరైనవా కావా అని సరి చూసుకోవాలన్నారు. కళాశాలలను ఇబ్బందిపెట్టేది ఏమీ లేదని ఇరు శాఖలు స్ష్టం చేశాయి. ఫేక్ ఫైర్ ఎన్‌వోసీలు పెట్టిన కళాశాలలకు విధించిన రూ. 8 లక్షల అపరాధ రుసుం విషయంలో కూడా పునరాలోచన చేస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ తెలిపారు.
అంతకు ముందు హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య మాట్లాడుతూ.. ఫైర్ నిబంధనలను వివరించారు. అలాగే ఇంటర్ బోర్డు సంయుక్త కార్యదర్శి వసుంధర సమావేశ వివరాలను అందించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Irrigation Projects | భూసేకరణకు రూ.6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ
- ●Ganesh Festival | గణేష్ ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
- ●Harish Rao | జీవో 97 రద్దు చేయకపోతే.. లక్ష మందితో సచివాలయం ముట్టడి
- ●Rahul Ramakrishna | కట్టె కాలే వరకు కేసీఆర్ వెంటే.. రాహుల్ ఎమోషన్ ట్వీట్
- ●Mrunal Thakur | బాహుబలి ప్రీక్వెల్ - శివగామి పాత్రలో మృణాల్ ఠాకూర్ - వంద కోట్లతో షూటింగ్ - కట్ చేస్తే!
- ●Etala Rajendar | కాంగ్రెస్లో రేవంత్ ఉడుం లెక్క చొర్రిండట.. వాళ్ల కార్యకర్తలే ఆయనపై కోపంగున్నరు

Irrigation Projects | భూసేకరణకు రూ.6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ

Ganesh Festival | గణేష్ ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

Harish Rao | జీవో 97 రద్దు చేయకపోతే.. లక్ష మందితో సచివాలయం ముట్టడి

Rahul Ramakrishna | కట్టె కాలే వరకు కేసీఆర్ వెంటే.. రాహుల్ ఎమోషన్ ట్వీట్





