NEET-UG | నీట్ పరీక్ష విధానంలో కీలక మార్పులు.. పెన్-అండ్-పేపర్ విధానానికి స్వస్తి
NEET-UG | పేపర్ లీక్ ఘటనతో నీట్ పరీక్ష (NEET-UG) విధానంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. పెన్-అండ్-పేపర్ విధానానికి స్వస్తి పలికి ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత (CBT) పరీక్ష నిర్వహణపై కసరత్తు మొదలు పెట్టింది.
NEET-UG | త్రినేత్ర.న్యూస్ : పేపర్ లీక్ ఘటనతో నీట్ పరీక్ష (NEET-UG) విధానంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. పెన్-అండ్-పేపర్ విధానానికి స్వస్తి పలికి ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత (CBT) పరీక్ష నిర్వహణపై కసరత్తు మొదలు పెట్టింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు (Supreme Court)కు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది.
ఆ అఫిడవిట్ ప్రకారం.. జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (JEE) తరహాలో నీట్ నిర్వహణకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపింది. అయితే, ఈ అంశంపై నందన్ నీలేకని నేతృత్వంలోని ఉన్నత స్థాయి టాస్క్‌ఫోర్స్ సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది. అంతేకాదు, పేపర్ లీక్‌ల కట్టడికి, వ్యవస్థాగత లోపాలను సరిదిద్దడాని నీట్ పరీక్షా విధానంలో సమగ్ర మార్పులు చేపట్టినట్లు తెలిపింది.
మరోవైపు, కంప్యూటర్ ఆధారిత విధానంలోకి మారితే ముందుగానే స్పష్టత ఇవ్వాలని కేంద్రానికి వైద్యుల సంఘం (FAIMA) విజ్ఞప్తి చేసింది. పేపర్ లీకేజీలు, అక్రమాల నివారణకు ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అమెండ్‌మెంట్ యాక్ట్-2026’ను కఠినంగా అమలు చేయాలని కోరింది. ఇక కేంద్రం సమర్పించిన అఫిడవిట్‌పై వైద్యుల సంఘంతోపాటూ సంబంధిత పిటిషనర్ల నుంచి సుప్రీంకోర్టు స్పందన కోరింది. అనంతరం కేసు తదుపరి విచారణను ఆగస్టు 19కి వాయిదా వేసింది.
Also Read..
విద్యార్థులపై పోలీసుల చర్య.. సభలో ప్రకటన చేయడానికి అమిత్‌షాకు ఏం అడ్డంకులు ఉన్నాయ్..?
విశాల్ ‘మకుటం’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. రేపే ట్రైలర్ విడుదల
స్టాక్ మార్కెట్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి.. స్వల్ప లాభాల్లో ముగిసిన సూచీలు..
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Rajaram Yadav | అభివృద్ధి నాలుగు పాదాల నడుస్తుందట.. మహేశ్‌కుమార్‌గౌడ్ మాటలు సిగ్గుచేటు
- ●CM Revanth Reddy | సీఎం రేవంత్‌రెడ్డితో ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ భేటీ
- ●HIPLEX 2026 | సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలి.. మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు..
- ●'మక్కా' వేదికగా పాక్-సౌదీ-టర్కీల సంచలన రక్షణ ఒప్పందం: భారత్‌పై పాక్ కయ్యానికి కాలుదువ్వితే ఏం జరుగుతుంది?
- ●Supreme Court | గుడ్లు విసురుతారన్న భయంతో మినహాయింపా? మహువా పిటిషన్‌పై సుప్రీం ఘాటు వ్యాఖ్యలు
- ●POCSO Judgment | 12 ఏండ్ల బాలికపై అఘాయిత్యం చేశాడు.. 10 ఏండ్ల జైలు శిక్ష వేశారు

Rajaram Yadav | అభివృద్ధి నాలుగు పాదాల నడుస్తుందట.. మహేశ్‌కుమార్‌గౌడ్ మాటలు సిగ్గుచేటు

CM Revanth Reddy | సీఎం రేవంత్‌రెడ్డితో ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్ భేటీ

HIPLEX 2026 | సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలి.. మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు..

'మక్కా' వేదికగా పాక్-సౌదీ-టర్కీల సంచలన రక్షణ ఒప్పందం: భారత్‌పై పాక్ కయ్యానికి కాలుదువ్వితే ఏం జరుగుతుంది?





