HYDRAA | హైడ్రా పేరిట నకిలీ ఎన్ఓసీలు సృష్టించిన 8 కాలేజీలు
HYDRAA | హైదరాబాద్ నగరంలోని పలు ప్రయివేటు కాలేజీలు హైడ్రా (HYDRAA) పేరిట నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఇంటర్ బోర్డుకు సమర్పించిన ఘటన కలకలం రేపాయి. హైడ్రా పేరిట నకిలీ ఫైర్ ఎన్ఓసీలను (NOC) సృష్టించాయి.
HYDRAA | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగరంలోని పలు ప్రయివేటు కాలేజీలు హైడ్రా (HYDRAA) పేరిట నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఇంటర్ బోర్డుకు సమర్పించిన ఘటన కలకలం రేపాయి. హైడ్రా పేరిట నకిలీ ఫైర్ ఎన్ఓసీలను (NOC) సృష్టించాయి. వాటిని ఇంటర్మీడియట్ బోర్టుకు సమర్పించాయి. గుర్తించిన అధికారులు విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నకిలీ పత్రాలు సమర్పించిన ఆ ఎనిమిది ప్రైవేట్ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఈ ఘటనపై లేక్ పోలీస్ స్టేషన్‌లో బీఎన్ఎస్ 337, 336(3), 340(2), 318(4) , ఆర్/డబ్ల్యూ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది.
హైదరాబాద్‌లోని తెల్లాపూర్, చిక్కడపల్లి, ఎస్‌ఆర్ నగర్, మెహదీపట్నం, బర్కత్ పురాలలో ఉన్న కాలేజీల యాజమాన్యాలు ఈ ఫోర్జరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. మరో 60 కాలేజీల ఎన్ఓసీలను (Fire NOC) స్క్రూట్నీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు నకిలీ ఎన్ఓసీలను సమర్పించిన ఎనిమిది కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని అధికారులు ఫిర్యాదు చేశారు.
ఆ కాలేజీలు ఇవే..
- ప్రియాంకా జూనియర్ కాలేజీ- మెహదిపట్నం
- మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజీ- విద్యానగర్
- శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ- చాంద్రాయన్‌గుట్ట
- న్యూ ఎరా జూనియర్ కాలేజీ- చిక్కడపల్లి
- షాహీర్ జూనియర్ కాలేజీ- శివరాంపల్లి
- వశిష్ట జూనియర్ కాలేజీ- తెల్లాపూర్
- హైందవి జూనియర్ కాలేజీ- బర్కత్‌పురా
- రెసిడెన్స్ జూనియర్ కాలేజీ- ఎస్సార్ నగర్
సంబంధిత వార్తలు

HYDRAA Ranganath | ఆ బండపై వ్యూ పాయింట్ పెట్టండి.. చెరువు చుట్టూ పచ్చదనం పెంచండి: రంగనాథ్
సెప్టెంబర్ 5, 2026

HYDRAA | హైదరాబాద్‌లో చెరువుల అభివృద్ధి భేష్.. హైడ్రా పనితీరుపై బీహార్ సిటీ మేనేజర్లు ప్రశంసలు
ఆగస్టు 28, 2026

MP Eatala Rajender | నీతి మాటలు చెబుతున్న రంగనాథ్.. నిజంగా హిట్లర్ లెక్క చేశారు : ఎంపీ ఈటల
ఆగస్టు 27, 2026
తాజావార్తలు
- ●UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?
- ●T20 Cricket | స్మృతి మంధాన సరికొత్త రికార్డు.. టీ20ల్లో చరిత్ర
- ●Kavitha | రాజకీయం అంటే బూతులేనా..? కోస్గి సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్..
- ●Maithili Thakur | రోల్స్ రాయిస్‌లో ఎమ్మెల్యే.. ట్రోలింగ్‌పై కంగనా ఫైర్..
- ●Ukraine Biggest Attack | మాస్కోపై 1,600కుపైగా డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్..!
- ●Delhi SIR | ఎస్ఐఆర్లో ప్రముఖులకూ షాక్.. అద్వానీ, కేజ్రీవాల్ సహా పలువురికి నోటీసులు..!

UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?

T20 Cricket | స్మృతి మంధాన సరికొత్త రికార్డు.. టీ20ల్లో చరిత్ర

Kavitha | రాజకీయం అంటే బూతులేనా..? కోస్గి సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్..

Maithili Thakur | రోల్స్ రాయిస్‌లో ఎమ్మెల్యే.. ట్రోలింగ్‌పై కంగనా ఫైర్..



