Gold And Silver Prices Today | పెట్టుబడిదారులకు అలర్ట్.. ఒక్క రోజులోనే రూ.33వేలు తగ్గిన పసిడి ధర..
Gold And Silver Prices Today | అమెరికా వృద్ధి రేటు అంచనాలకు మించి ఉండడం, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో పెరుగుతున్న ఒత్తిడి కారణంగా బులియన్ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఒక్క రోజులోనే భారీగా పతనమయ్యాయి. ఔన్స్ బంగారం ధర 3.62 శాతం క్షీణించి 3,875 డాలర్లకు చేరగా, వెండి ధర 5.78 శాతం పతనమై 49 డాలర్లకు చేరింది.
Gold And Silver Prices Today | అమెరికా వృద్ధి రేటు అంచనాలకు మించి ఉండడం, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో పెరుగుతున్న ఒత్తిడి కారణంగా బులియన్ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఒక్క రోజులోనే భారీగా పతనమయ్యాయి. ఔన్స్ బంగారం ధర 3.62 శాతం క్షీణించి 3,875 డాలర్లకు చేరగా, వెండి ధర 5.78 శాతం పతనమై 49 డాలర్లకు చేరింది. ఏఐ రంగ పెట్టుబడులపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు చిప్ కంపెనీల స్టాక్స్‌ను భారీ ఎత్తున విక్రయించారు. దీంతో గత సెషన్‌లో అమెరికా మార్కెట్లు కుదేలయ్యాయి. అయితే అమెరికా డాలర్ బలపడడం బంగారంపై ప్రధానంగా ప్రభావం చూపించింది. దీంతో ఒక్క రోజులోనే పసిడి ధరలు భారీగా తగ్గాయి. ఇక దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు ఏకంగా 4,111 పాయింట్లు పతనమై 1,38,485 వద్ద స్థిరపడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 10,321 పాయింట్లు తగ్గి 1,79,132 వద్ద నిలిచింది. దేశీయ స్పాట్ మార్కెట్లకు సైతం ఈ సెగ తగిలింది. బంగారం ధర ఒక్క రోజులోనే రూ.33వేలకు పైగా తగ్గగా, వెండి ధర రూ.10వేలకు పైగా పతనమైంది.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,888 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,11,104 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,38,880 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.13,88,800 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.33,800 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.12,730 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,01,840గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,27,300 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.12,73,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.31,000 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.10,416 ఉండగా, 8 గ్రాముల ధర రూ.83,328గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,04,160 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.10,41,600గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.25,300 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,00,000 ఉండగా, తులం ధర రూ.2,000గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధర కిలోకు రూ.10వేలు తగ్గింది. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,00,000 ఉండగా, తులం ధర రూ.2,000 గా ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Gold Prices | బంగారం ధరలు ఢమాల్.. అంచనాలకు మించి అమెరికా వృద్ధి..
అక్టోబర్ 30, 2026

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.17వేలు తగ్గిన పసిడి ధర.. బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
అక్టోబర్ 30, 2026

Gold Prices | ఫెడ్ వడ్డీ రేట్ల ఎఫెక్ట్.. బంగారం, వెండిలపై ఇప్పుడు పెట్టుబడులు పెట్టవచ్చా..?
అక్టోబర్ 29, 2026
తాజావార్తలు
- ●US Stock Markets | అమెరికా టెక్ మార్కెట్లలో 2.4 లక్షల కోట్ల డాలర్లు ఆవిరి.. ఏఐ పెట్టుబడులే కారణమా?
- ●Cotton Imports | టెక్స్టైల్స్ రంగానికి కేంద్రం భారీ ఊరట.. పత్తి దిగుమతులపై సుంకం మినహాయింపు గడువు పొడిగింపు
- ●Electric Shock | అర్ధరాత్రి దావత్.. పోలీసులను చూసి పరిగెత్తి.. కరెంట్ షాక్‌తో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతి
- ●Shehbaz Sharif | భారత్‌పై పాక్ గెలుపు.. ప్రధాని షరీఫ్‌పై నెట్టింట ట్రోల్స్
- ●Rain Alert | రానున్న మూడు రోజులు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
- ●PM Modi | జీఎస్ఎల్వీ ప్రయోగం విజయవంతం.. ప్రధాని మోదీ అభినందన

US Stock Markets | అమెరికా టెక్ మార్కెట్లలో 2.4 లక్షల కోట్ల డాలర్లు ఆవిరి.. ఏఐ పెట్టుబడులే కారణమా?

Cotton Imports | టెక్స్టైల్స్ రంగానికి కేంద్రం భారీ ఊరట.. పత్తి దిగుమతులపై సుంకం మినహాయింపు గడువు పొడిగింపు

Electric Shock | అర్ధరాత్రి దావత్.. పోలీసులను చూసి పరిగెత్తి.. కరెంట్ షాక్‌తో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతి

Shehbaz Sharif | భారత్‌పై పాక్ గెలుపు.. ప్రధాని షరీఫ్‌పై నెట్టింట ట్రోల్స్



