త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG BIE | ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల ఫీజు గ‌డువు పొడిగింపు

TG BIE | ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల ఫీజు చెల్లింపు గ‌డువును ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు పొడిగించింది. ఈ మేర‌కు బోర్డు అధికారులు అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఈ నెల 23వ తేదీ లోపు విద్యార్థులు ఫీజు చెల్లించొచ్చ‌ని అధికారులు పేర్కొన్నారు.

S

Telangana | Published On Apr 20, 2026, 3.46 pm IST

TG BIE | ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల ఫీజు గ‌డువు పొడిగింపు
Advertisement

TG BIE | త్రినేత్ర‌.న్యూస్ : ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల ఫీజు చెల్లింపు గ‌డువును ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు పొడిగించింది. ఈ మేర‌కు బోర్డు అధికారులు అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఈ నెల 23వ తేదీ లోపు విద్యార్థులు ఫీజు చెల్లించొచ్చ‌ని అధికారులు పేర్కొన్నారు. వాస్త‌వానికి నేటితో ప‌రీక్ష ఫీజు గ‌డువు చెల్లింపు ముగియ‌నుంది. కానీ విద్యార్థులు, కాలేజీల యాజ‌మాన్యాల అభ్య‌ర్థ‌న‌ను దృష్టిలో ఉంచుకుని ప‌రీక్ష ఫీజు చెల్లింపు గ‌డువును పొడిగించారు.

ఇక ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌ను మే 13 నుంచి 21వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు అధికారులు ప్ర‌క‌టించారు. ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ విద్యార్థుల‌కు ఉద‌యం 9 నుంచి మ‌. 12 వ‌రకు, సెకండియ‌ర్ విద్యార్థుల‌కు మ‌. 2.30 నుంచి సాయంత్రం 5.30 వ‌ర‌కు ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు.

ప్రాక్టిక‌ల్ ఎగ్జామ్స్ మే 22 నుంచి 25వ తేదీ వ‌ర‌కు ఉద‌యం 9 నుంచి మ‌. 12 గంట‌ల వ‌ర‌కు, మ‌ధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. 26వ తేదీన ఇంగ్లీష్ ప్రాక్టిక‌ల్ ఎగ్జామ్స్, 28న ఎన్విరాన్‌మెంట‌ర్ ఎడ్యుకేష‌న్ ఎగ్జామ్ నిర్వ‌హించ‌నున్నారు.

అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల షెడ్యూల్ ఇదే..

మే 13 - సెకండ్ లాంగ్వేజ్
మే 14 - ఇంగ్లీష్‌
మే 15 - మ్యాథ్స్, బోట‌నీ, పొలిటిక‌ల్ సైన్స్
మే 16 - మ్యాథ్స్, జువాల‌జీ, హిస్ట‌రీ
మే 18 - ఫిజిక్స్, ఎక‌నామిక్స్
మే 19 - కెమిస్ట్రీ, కామ‌ర్స్‌
మే 20 - ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్(బైపీసీ విద్యార్థుల‌కు మాత్ర‌మే)
మే 21 - మోడ్ర‌న్ లాంగ్వేజ్, జియోగ్ర‌ఫీ

Advertisement
Advertisement