త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | మ‌ధ్యాహ్న భోజ‌నంలో పురుగులు.. హ‌రీశ్‌రావు వాహ‌నాన్ని ఆపి విద్యార్థుల ఆవేద‌న‌

Harish Rao | జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఇందువాసి గ్రామంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు కాన్వాయ్‌ను స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆపి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.

S

Telangana | Published On Oct 14, 2026, 6.37 pm IST

Harish Rao | మ‌ధ్యాహ్న భోజ‌నంలో పురుగులు.. హ‌రీశ్‌రావు వాహ‌నాన్ని ఆపి విద్యార్థుల ఆవేద‌న‌
Advertisement

Harish Rao | త్రినేత్ర న్యూస్ : జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఇందువాసి గ్రామంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు కాన్వాయ్‌ను స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆపి తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.

పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో ప్రతిరోజూ నాసిరకం పురుగుల అన్నం, ప్రతిరోజు వంకాయ కూర పెడుతున్నారని హరీశ్ రావు ఎదుట విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో సబ్జెక్ట్ టీచర్లు లేకపోవడంతో చదువుకు తీవ్ర ఆటంకం కలుగుతోందని, కనీస వసతులు కరువై ఇబ్బందులు పడుతున్నామని దీనివల్ల స్కూల్ డ్రాపౌట్స్ అధికంగా పెరిగాయని వాపోయారు.

అంతేకాకుండా, గ్రామంలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితుల వల్ల చదువులు మధ్యలోనే మానేసి, తల్లిదండ్రులతో కలిసి కూలీ పనుల కోసం వలస వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలను ఓపిగ్గా విన్న హరీశ్ రావు.. పాఠశాల దుస్థితిని విద్యార్థుల ఆవేదనను స్వయంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.

Advertisement
Advertisement