Danam Nagender | ‘దానం’ కూతురుకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్..!
Danam Nagender | ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూతురు దానం మనీషా, ఆమె భర్త అభినవ్ కిషన్ పువ్వాలకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది.
Danam Nagender | త్రినేత్ర.న్యూస్ : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూతురు దానం మనీషా, ఆమె భర్త అభినవ్ కిషన్ పువ్వాలకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. నాంపల్లిలోని తొమ్మిదవ ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ మార్చి 2న వారెంట్ జారీ చేస్తూ, అదే నెల 16వ తేదీలోగా తమ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించారు. ఎన్ఐ యాక్ట్( Negotiable Instruments Act ) లోని 138 సెక్షన్ కింద నమోదైన కేసులో ఏ3, ఏ4గా ఉన్న ఇరువురికి ఈ వారెంట్ జారీ అయ్యాయి.
కాగా, ఈ నెల 8న వారెంట్‌పై వారిరువురూ న్యాయస్థానంలో తమ న్యాయవాది ద్వారా పిటిషన్ దాఖలు చేయగా, న్యాయమూర్తి దానిని అనుమతించడంతో వారెంట్ రద్దైంది. నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటు ఉన్నప్పటికీ మూడు నెలలకు పైగా పోలీసులు వారిని అరెస్టు చేయకపోవడం గమనార్హం. ఇదే కేసులో గతంలోనూ అనగా గతేడాది డిసెంబర్ 30న సైతం వారికి నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్‌లు జారీ అయ్యాయి. ఈ విషయం మీడియాలో ఎక్కడా బయటకు పొక్కకపోవడం విశేషం.




సంబంధిత వార్తలు

Chintala Ramachandra Reddy | “ఉపఎన్నిక కోసం కొట్లాడింది మేము.. గెలిచేదీ మేమే”: విజయా రెడ్డి పిటిషన్లో ఇంప్లీడ్ అవుతాం
అక్టోబర్ 3, 2026

Khairatabad By Election Update | ఖైరతాబాద్ ఉప ఎన్నికపై ఈసీఐ కీలక నిర్ణయం.. హైకోర్టుకు ఎన్నికల సంఘం స్పష్టీకరణ
అక్టోబర్ 1, 2026

Vijaya Reddy | నేనే ఖైరతాబాద్ అభ్యర్థిని.. దానం ఎంపీ అభ్యర్థి
అక్టోబర్ 1, 2026
తాజావార్తలు
- ●Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!
- ●Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..
- ●Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!

Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత

Stock Markets | స్టాక్ మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..

Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ



