త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Manne Krishank | ఆ 8 ఎక‌రాల్లో 6000 ఇందిర‌మ్మ ఇండ్లు నిర్మించాలి

Manne Krishank | కేవ‌లం ప‌ది నెల‌ల్లోనే రూ.400 కోట్ల విలువైన 8 ఎక‌రాల‌ ప్ర‌భుత్వ భూమి ప్రైవేట్ భూమిగా ఎలా మారింద‌ని కంటోన్మెంట్ బీఆర్ఎస్ స‌భ్య‌త్వ న‌మోదు ఇంచార్జ్ మన్నె క్రిశాంక్ ప్ర‌శ్నించారు. రాత్రికి రాత్రి అదే భూమిలో నీలిరంగు ప్రహరీ ఏర్పాటు చేసి ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసేశార‌ని ఆయ‌న ఆరోపించారు.

S

Hyderabad | Published On Jun 12, 2026, 4.25 pm IST

Manne Krishank | ఆ 8 ఎక‌రాల్లో 6000 ఇందిర‌మ్మ ఇండ్లు నిర్మించాలి
Advertisement
  • రూ.400 కోట్ల విలువైన భూమి ప్రైవేట్ భూమిగా ఎలా మారింది
  • పొంగులేటి, ఎమ్మెల్యే గ‌ణేష్‌కు క‌మీష‌న్ ముట్టినట్టుంది
  • మ‌న్నె క్రిశాంక్ ఆరోప‌ణ‌

Manne Krishank | త్రినేత్ర‌.న్యూస్: కేవ‌లం ప‌ది నెల‌ల్లోనే రూ.400 కోట్ల విలువైన 8 ఎక‌రాల‌ ప్ర‌భుత్వ భూమి ప్రైవేట్ భూమిగా ఎలా మారింద‌ని కంటోన్మెంట్ బీఆర్ఎస్ స‌భ్య‌త్వ న‌మోదు ఇంచార్జ్ మన్నె క్రిశాంక్ ప్ర‌శ్నించారు. గ‌తేడాదే ఆ భూమిని 6000 ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణానికి కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించింద‌న్నారు. ఇదే ప్రభుత్వ భూమిలో ఇండ్లు నిర్మాణం చేయాలని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అప్పటి ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డికి వినతి పత్రాలు ఇచ్చామ‌ని గుర్తు చేశారు. ఇప్పుడు రాత్రికి రాత్రి అదే భూమిలో నీలిరంగు ప్రహరీ ఏర్పాటు చేసి ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసేశార‌ని ఆయ‌న ఆరోపించారు.

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ‌గణేష్ కు కమీషన్ ముట్టాయా అని సందేహం వ్య‌క్తం చేశారు. గత ప్రభుత్వాలు 8 ఎకరాల భూమిని కాపాడితే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంవత్సరం ముందే ప్రభుత్వ భూమిగా గుర్తించి ఇప్పుడు దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు క‌ట్టబెట్టింద‌ని ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టి ప్రభుత్వ ఆస్తిని కాపాడాలన్నారు. ఇచ్చిన హామీ మేర‌కు 6000 ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేయాల‌ని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement