IMD Alert | తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్.. మరో మూడు రోజులు ఎండలు, వడగాల్పులు
IMD Alert | వేసవి దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న భిన్న వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు (Rain) కురిసే అవకాశం ఉందని తెలిపింది. వడగాలుల (Heat waves) ముప్పు కూడా పొంచి ఉందని హెచ్చరించింది.
IMD Alert | త్రినేత్ర.న్యూస్: వేసవి దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న భిన్న వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు (Rain) కురిసే అవకాశం ఉందని తెలిపింది. వడగాలుల (Heat waves) ముప్పు కూడా పొంచి ఉందని హెచ్చరించింది. అటు ఎండలు (Hot weather), ఇటు వర్షాలతో తెలుగు ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మరోవైపు అకాల వర్షాలతో రైతులకు తీవ్ర పంట నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో ఐఎండీ అప్రమత్తం చేసింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బలమైన ఈదురు గాలులు సహా పిడుగులతో కూడిన జల్లులు కురుస్తాయని పేర్కొంది. వడగాలుల ముప్పు కూడా పొంచి ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణలో శుక్ర, శని వారాల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వేడి, తేమ సహా అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. మరో 72 గంటల పాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు, వర్షాలతో భిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయని తెలిపింది. ఇదిలా ఉండగా తెలంగాణ, ఏపీలో పలు జిల్లాల్లో ఇప్పటికే గరిష్టంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



