త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Goud | కార్య‌క‌ర్త‌ల వ‌ల్లే కాంగ్రెస్‌కు అధికారం.. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డే వారికి ప‌ద‌వుల్లో ప్రాధాన్యం: పీసీసీ చీఫ్ మ‌హేశ్ గౌడ్‌

Mahesh Goud | పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు పదవుల్లో సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని టీపీసీసీ అధ్య‌క్షుడు, ఎమ్మెల్సీ మ‌హేశ్ కుమార్ గౌడ్ (Mahesh Goud) అన్నారు.

G

Telangana | Published On Aug 23, 2026, 12.31 pm IST

Mahesh Goud | కార్య‌క‌ర్త‌ల వ‌ల్లే కాంగ్రెస్‌కు అధికారం.. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డే వారికి ప‌ద‌వుల్లో ప్రాధాన్యం: పీసీసీ చీఫ్ మ‌హేశ్ గౌడ్‌
Advertisement

Mahesh Goud | త్రినేత్ర‌.న్యూస్‌: పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు పదవుల్లో సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని టీపీసీసీ అధ్య‌క్షుడు, ఎమ్మెల్సీ మ‌హేశ్ కుమార్ గౌడ్ (Mahesh Goud) అన్నారు. కింది స్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తలకు (Party Workers) కూడా పదవులు ఇవ్వాలని డిమాండ్ వస్తున్న‌దని, పదవుల భర్తీలో అన్ని వర్గాలకు సమతుల్యత పాటిస్తామని చెప్పారు. 70 శాతం పదవులను పాత కార్యకర్తలకే ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Redd), పార్టీ ఇన్‌చార్జితో కలిసి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఏఐసీసీ స్థాయిలో అనుసరిస్తున్న విధానం కూడా ఇదే ఫార్మాట్‌లో ఉందన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ (Congress) పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ.. గత ఐదేండ్లుగా పార్టీ కోసం నిరంతరం కష్టపడిన‌ వారికి పదవుల్లో అవకాశం కల్పిస్తామన్నారు. ఎన్ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్‌తో పాటు పార్టీని అంటిపెట్టుకుని పనిచేస్తున్న కార్యకర్తలకు తొలి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.

అన్ని కమిటీలను భర్తీ చేస్తామని, ఇందులో 20 శాతం కొత్త వారికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. మార్కెట్ కమిటీలకు సంబంధించి అప్రూవల్ ఇవ్వాలని మంత్రి సీతక్క (Seethakka) సూచించార‌ని వెల్ల‌డించారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తను తప్పకుండా ఆదుకుంటామని స్ప‌ష్టం చేశారు. కార్యకర్తల కృషి వల్లే కాంగ్రెస్‌కు అధికారం వచ్చింద‌ని, ఎప్ప‌టికీ కార్యకర్తల కష్టాన్ని పార్టీ మరచిపోదని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం పీసీసీ అధ్యక్షుడిగా తన 35 ఏండ్ల ఇంజినీరింగ్ కాలేజీ, వ్యవసాయ కళాశాల కల సాకారం అయిందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లతో తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement