Heavy Rain Alert | నేడు, రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Heavy Rain Alert | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధ, గురువారాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (Heavy Rain Alert) తెలిపింది. ఈ మేరకు తొమ్మిది జిల్లాలకు రెడ్ అలర్ట్ (Red Alert) జారీ చేసింది.
Heavy Rain Alert | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధ, గురువారాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (Heavy Rain Alert) తెలిపింది. ఈ మేరకు తొమ్మిది జిల్లాలకు రెడ్ అలర్ట్ (Red Alert) జారీ చేసింది. మరో ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ (Orange Alert) జారీ చేసింది. వాయుగుండానికి తోడు.. కర్ణాటక, కోస్తాంధ్ర మీదుగా ద్రోణి కూడా కొనసాగుతున్నదని, వాటి ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొన్ని చోట్ల 20.4 సెంటీమీటర్లకు పైగా అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, మరికొన్ని చోట్ల 11.5 సెం.మీ. నుంచి 20.4 సెం.మీ.లోపు అతి భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇతర జిల్లాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నట్లు తెలిపింది. 25, 26 తేదీల్లోనూ పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
బుధవారం..
బుధవారం పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు (Heavy to Very Heavy Rains) కురుస్తాయని తెలిపింది. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, నల్లగొండ, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురి సే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
మరోవైపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.
రేపు ఈ జిల్లాల్లో..
ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ (IMD Hyderabad) పేర్కొంది. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
అదేవిధంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
అప్రమత్తంగా ఉండండి..
భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆదేశించారు. హైదరాబాద్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, హైడ్రా, పోలీసు కమిషనర్లు సమన్వయంతో పనిచేయాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ప్రధాన రహదారులు, జంక్షన్లు, కాలనీల్లో వర్షపు నీరు నిలిచిపోకుండా తక్షణ చర్యలు చేపట్టాలన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●84 ఏళ్లుగా అమెరికా ఒక్క ‘యుద్ధం’ చేయలేదట.. మరి ఇవన్నీ ఏంటి?
- ●Horoscope | సెప్టెంబర్ 23 రాశిఫలాలు.. ఈ రాశివారు కుటుంబ సభ్యుల ద్వారా లాభాలు పొందుతారు!
- ●Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!
- ●Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. కనులపండువగా వెంకన్న బ్రహ్మోత్సవం..
- ●Srimad Bhagavad Gita | మారిషస్‌లో ఆంగ్ల ‘శ్రీమద్భగవద్గీత’ ఆడియో ఆల్బమ్ ఆవిష్కరణ
- ●Minister Damodar Rajanarsimha | రిమ్స్ అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ

84 ఏళ్లుగా అమెరికా ఒక్క ‘యుద్ధం’ చేయలేదట.. మరి ఇవన్నీ ఏంటి?

Horoscope | సెప్టెంబర్ 23 రాశిఫలాలు.. ఈ రాశివారు కుటుంబ సభ్యుల ద్వారా లాభాలు పొందుతారు!

Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!

Brahmotsavam 2026 | రథంపై రాజసం.. అశ్వంపై దివ్య తేజం.. కనులపండువగా వెంకన్న బ్రహ్మోత్సవం..






