త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Coldest October Day | అక్టోబ‌ర్‌లో అత్యంత చ‌ల్ల‌ని రోజుగా శుక్ర‌వారం.. 75 ఏండ్ల‌లో తొలిసారి..

Coldest October Day | దేశ రాజ‌ధాని ఢిల్లీలో (Delhi) గ‌త రెండు రోజులుగా ఎడ‌తెర‌పి లేకుండా వ‌ర్షాలు కురుస్తున్నాయి. వాతావ‌రణ‌ చ‌ల్లబ‌డిపోవ‌డంతో ఉష్ణోగ్ర‌త‌లు ఒక్క‌సారిగా 20.7 డిగ్రీల‌కు ప‌డిపోయాయి. దీంతో అక్టోబ‌ర్ నెల‌లో అత్యంత చ‌ల్ల‌ని రోజుగా (Coldest October Day) శుక్ర‌వారం (అక్టోబ‌ర్ 30) నిలిచింది.

G

National | Published On Oct 31, 2026, 7.16 am IST

Coldest October Day | అక్టోబ‌ర్‌లో అత్యంత చ‌ల్ల‌ని రోజుగా శుక్ర‌వారం.. 75 ఏండ్ల‌లో తొలిసారి..
Advertisement

Coldest October Day | త్రినేత్ర న్యూస్‌: దేశ రాజ‌ధాని ఢిల్లీలో (Delhi) గ‌త రెండు రోజులుగా ఎడ‌తెర‌పి లేకుండా వ‌ర్షాలు కురుస్తున్నాయి. వాతావ‌రణ‌ చ‌ల్లబ‌డిపోవ‌డంతో ఉష్ణోగ్ర‌త‌లు ఒక్క‌సారిగా 20.7 డిగ్రీల‌కు ప‌డిపోయాయి. దీంతో అక్టోబ‌ర్ నెల‌లో అత్యంత చ‌ల్ల‌ని రోజుగా (Coldest October Day) శుక్ర‌వారం (అక్టోబ‌ర్ 30) నిలిచింది. గ‌త 75 ఏండ్ల‌లో అక్టోబ‌ర్‌లో అతి త‌క్కువ ప‌గటి ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదుకావ‌డం ఇదే మొద‌టిసారి. అదేవిధంగా గత నాలుగేండ్ల‌లో అత్యధిక వర్షపాతం నమోదైన అక్టోబర్ రోజుగా, అత్యంత స్వచ్ఛమైన గాలి నమోదైన రోజుగా (Cleanest October) కూడా శుక్రవారం నిలిచింది. ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 60గా నమోదైంది. 2022 అక్టోబర్ 10న అది 44గా నమోదైన తర్వాత ఇంత తక్కువ స్థాయిలో నమోదు కావడం ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం.

వాతావరణ శాఖ (IMD) వివరాల ప్రకారం.. ఢిల్లీ ప్రధాన వాతావరణ కేంద్రమైన సఫ్దర్‌జంగ్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 20.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణం కంటే 10.3 డిగ్రీలు తక్కువ. 1951 తర్వాత అక్టోబర్ నెలలో ఈ కేంద్రంలో నమోదైన అత్యంత తక్కువ గరిష్ట ఉష్ణోగ్రత ఇదే. అలాగే పాలంలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 11.1 డిగ్రీలు తక్కువగా 20.5 డిగ్రీల సెల్సియస్, లోధి రోడ్‌లో సాధారణం కంటే 10.4 డిగ్రీలు తక్కువగా 20.6 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.

రాజ‌ధానిలో శుక్ర‌వారం రోజంతా వ‌ర్షం కురుస్తూనే ఉంది. ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5.30 గంటల మధ్య సఫ్దర్‌జంగ్‌లో 4.2 మి.మీ, పాలంలో 3 మి.మీ, లోధి రోడ్‌లో 4 మి.మీ, ది రిడ్జ్‌లో 1.9 మి.మీ, ఆయానగర్‌లో 2.1 మి.మీ వర్షపాతం నమోదైంది. గ‌త నాలుగేండ్ల‌లో అక్టోబ‌ర్‌లో (October) ఇంత భారీ వ‌ర్షం కురుసిన రోజుగా, 1951 నుంచి ఆరో అత్యధిక వర్షపాతం నమోదైన అక్టోబర్ రోజుగా శుక్రవారం నిలిచింది. గ‌తంలో 2022 అక్టోబర్ 9న ఢిల్లీలో 74 మి.మీల భారీ వర్షపాతం నమోదైంది.

ట్యాగ్స్:

AqiCleanest OctoberColdest October DayDelhiHeavy RainIMDOctoberTemperatures
Advertisement
Advertisement