Kalvakuntla Kavitha | పంటలు వేయొద్దన్న ముఖ్యమంత్రి అధికారంలో ఉండొద్దు
Kalvakuntla Kavitha | విప్లవానికే వన్నె తెచ్చిన ఇంద్రవెల్లి పుణ్యభూమికి పాదాభివందనం.. స్వాతంత్రం కోసం పోరాటం చేసిన ఈ ప్రాంత మహానీయులు రామ్ జీ గొండు, వన్నెల ఎల్లన్న, వెడమ రాము గార్లను గుర్తు చేసుకుంటూ మనస్ఫూర్తిగా వారికి నివాళులు అర్పిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర సమితి చీఫ్ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఎకరం నీళ్లు ఇవ్వని బీఆర్ఎస్..
ఏ ముఖం పెట్టుకోని ఇక్కడ గర్జన సభ పెడుతుంది?
చనఖా - కొరటా ప్రాజెక్ట్‌ను 368 కోట్ల నుంచి
రూ. 2100 కోట్ల పెంచి భారీ అవినీతి చేశారు
ఈ సొమ్ము గుంటనక్క మింగిందా?
బీఆర్ఎస్ ఖాతాలో చేరిందా సమాధానం చెప్పాలి
సామాజిక న్యాయమని మాట్లాడటం కాదు..
చేతల్లో చేసి చూపిస్తున్నాం
రెండు ఎమ్మెల్సీ సీట్లకు బీసీలనే అభ్యర్థులుగా ప్రకటించాం
ఆదిలాబాద్ పాంచజన్య సంకల్ప సభలో కల్వకుంట్ల కవిత
Kalvakuntla Kavitha | త్రినేత్ర న్యూస్ : విప్లవానికే వన్నె తెచ్చిన ఇంద్రవెల్లి పుణ్యభూమికి పాదాభివందనం.. స్వాతంత్రం కోసం పోరాటం చేసిన ఈ ప్రాంత మహానీయులు రామ్ జీ గొండు, వన్నెల ఎల్లన్న, వెడమ రాము గార్లను గుర్తు చేసుకుంటూ మనస్ఫూర్తిగా వారికి నివాళులు అర్పిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర సమితి చీఫ్ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.
జల్, జమీన్, జంగల్ అంటూ పోరాటం చేసి కొమురం భీమ్ గారిని తలుచుకుంటూ నివాళులు అర్పిస్తున్నాం. శిడెం శింబు, కొమురం సూరుని కూడా గుర్తు చేసుకుంటూ నివాళి అర్పిస్తున్నాం. ఆనాడు తమ పంటను దోచుకుంటున్న వాళ్ల నుంచి కాపాడుకునేందుకు ఆదివాసీలు మీటింగ్ పెట్టుకోవాలని చూస్తే మీటింగ్ వచ్చే వారిని పొట్టన బెట్టుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆదివాసీలను పిట్టలను కాల్చినట్లు కాల్చిన పాపం కాంగ్రెస్ దే. ఆ దుఃఖానికి సంబంధించి స్థూపం ఇక్కడే ఉంది. అయినా సరే కాంగ్రెస్ వాళ్లు ఇక్కడకు వచ్చి క్షమాపణ అడిగితే నాలుగు సీట్లు ఇచ్చిన గొప్ప మనసు ఇక్కడి ఆదివాసులది. అధికారంలోకి రాగానే ఇంద్రవెల్లి వీరులకు రూ. 25 లక్షలు ఇస్తామన్న రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వారిని పట్టించుకోలేదు. కేవలం రూ. 5 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇంద్రవెల్లి అంటేనే హక్కుల కోసం వీరోచితంగా పోరాడిన వీరులు గుర్తుకు వస్తరు. వారిని ఆదర్శంగా తీసుకోని మనం ఏ పోరాటమైనా చేస్తాం. అలాంటి ఆదివాసీ బిడ్డలను ఈ ముఖ్యమంత్రి మోసం చేశారు. నాగోబా తల్లి దయతో మా పార్టీ తొలి జెండా ఇక్కడ నుంచే ఎగురుతుందని గట్టిగా నమ్ముతున్నా. ఆదిలాబాద్ అంటేనే ఆదివాసులు, అడవులు, సహజ సంపద ఉన్న జిల్లా. ప్రకృతి ఈ జిల్లాకు అన్ని ఇచ్చినప్పటికీ నాయకులకు మాత్రం అభివృద్ధి చేసే మనసు రావటం లేదు. ఇప్పటికీ కూడా ఇక్కడ చాలా పేదరికం ఉంది. 750 ఊళ్లకు కనీసం స్కూల్ లేదంటే ఎంత బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి మూడేళ్లలో రెండుసార్లు మాత్రమే వచ్చాడు
రంగారెడ్డి లో తలసరి ఆదాయం 11 లక్షలు ఉంటే ఉమ్మడి ఆదిలాబాద్ లో 2 లక్షలు కూడా లేదు. అంటే ఎంత వ్యత్యాసం. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువ ఆదాయం ఆదిలాబాద్ జిల్లా నుంచే వచ్చేది. కానీ ఇప్పుడు 27 వ స్థానంలో ఉంది. అధికారంలోకి వచ్చాక రెండు నెలలకు ఒక్కసారి జిల్లాకు వస్తానన్న ముఖ్యమంత్రి మూడేళ్లలో రెండుసార్లు మాత్రమే వచ్చాడు. ఆయన ఈ జిల్లా ప్రజలకు ఇచ్చిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు. అందుకే మేము వారిని ప్రశ్నించి, ప్రజలు మేలు చేసేందుకు కొత్త రాజకీయ శక్తిగా వచ్చాం. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మనం ఆశించినంత అభివృద్ధి జరగలేదు అని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి మరి పదవిని వదిలేస్తాడా?
కాగజ్ నగర్ లో లక్షా 5 వేల ఎకరాలకు నీళ్లు రావాల్సి ఉంటే 6 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారు. కేపీ రావు, జగన్నాథ ప్రాజెక్టులు ఏళ్లకు ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. 12 ఏళ్లుగా తుమ్మిడి హెట్టి పేరు చెప్పి బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజలను మురిపిస్తున్నాయే తప్ప ఆ ప్రాజెక్ట్ కట్టలేదు. తుమ్మిడి హెట్టిని పూర్తి చేసి ఉంటే ఈ జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి. కరువు వచ్చిందని చెబితే ఇళ్లు అంటుకున్న తర్వాత బాయి తవ్వినట్లు ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడు. తుమ్మిడిహెట్టి కోసం ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్తున్నాడు? ఇన్నాళ్లు ఏం చేసినట్లు? ముందు మీరు 152 మీటర్లకు ప్రాజెక్ట్ కట్టి, ఒప్పందం ప్రకారం 148 మీటర్లకే నీళ్లను నిల్వ చేయండి. చరిత్రలో రైతులను పంటవేయవద్దని చెప్పిన మొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వ్యవసాయం తప్ప వేరే పని తెలియని రైతులను పంట వేయవద్దంటే వారిని ఏ విధంగా ఆదుకుంటారో చెప్పాలి కదా? రైతులను పంటలు వేయవద్దన్న ముఖ్యమంత్రి మరి పదవిని వదిలేస్తాడా? కరువు వస్తది అని తెలిసి కూడా ఈ ముఖ్యమంత్రి ఇన్ని రోజులు ఏమీ పట్టించుకోలేదు. అనేక కుట్రలు, మోసాలు చేస్తూ ప్రజలను వంచిస్తున్నారు. వారి మోసాలను, కుట్రలను ప్రజలకు తెలియజేసేందుకే మేము మీ ముందుకు వచ్చామని కవిత పేర్కొన్నారు.

1972లో ఆస్తులు కొనుక్కున్న ఆదివాసీలకు న్యాయం జరగాలి
ఐటీడీఏలో జీవో 57 తో సహా 27 జీవోలను మళ్లీ అమలు చేయాలి. 1972లో ఆస్తులు కొనుక్కున్న ఆదివాసీలకు న్యాయం జరగాలి. ఆదివాసీ మహిళలు రక్త హీనతం బాధపడుతున్నారు. ఐటీడీఏ నుంచి పోషకాహారం పెడతామని పెట్టటం లేదు. రిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉన్న హెల్త్ సెంటర్లు చాలా ఆధ్వాన్నంగా ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గర్జన సభ పెడుతుందంట. వాళ్ల గర్జన కాదు తర్జన భర్జన. సిద్దిపేట బాబు సభ పెట్టుకోని సిరిసిల్ల బాబు పిలవలేదంట. అందుకే సిరిసిల్ల బాబు ఆదిలాబాద్ గర్జనకు సిద్దిపేట బాబును పిలవటం లేదు. సిరిసిల్ల, సిద్దిపేట బాబుల పంచాయితీలో ఆ పార్టీ కార్యకర్తలు ఆగమవుతున్నారు. రైతు గర్జన పేరుతో ఆదిలాబాద్‌కు వస్తున్న కేటీఆర్‌ను నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్న. అధికారంలోకి వస్తే ఆదిలాబాద్ కు యూనివర్సిటీ ఇస్తామని కేసీఆర్ చెప్పినప్పటికీ ఎందుకు ఇవ్వలేదు? ఈ ప్రాంతానికి పదేళ్లలో ఒక్క యూనివర్సిటీ, ఇంజినీరింగ్ కాలేజ్ ఇవ్వలేదు. సిర్పూర్ కాగజ్ నగర్ మిల్లు కోసం ప్రైవేట్ వ్యక్తులకు వెయ్యి కోట్లు ఇచ్చారు. కానీ కార్మికులకు మాత్రం ఏమాత్రం మంచి చేయలేదు. పదేళ్లలో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను, నిజామాబాద్‌లో షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు తెరిపించలేదు. సీసీఐని మీరు కాపాడి ఉంటే ఇవ్వాళ పరిస్థితి వచ్చేది కాదు. సీసీఐని తెరిపించకుండా మోసం చేసిన పాపంలో బీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉంటే కాంగ్రెస్ రెండో స్థానంలో, బీజేపీ మూడో స్థానంలో ఉంటుంది అని కవిత పేర్కొన్నారు.

ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదు
గోదావరి, ప్రాణహిత నదులు ఉన్నప్పటికీ ఎందుకు ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదు. తుమ్మిడిహెట్టి కట్టి ఉంటే రెండున్నర లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి. మొత్తంగా జిల్లాలో ఏడున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సి ఉన్న ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు. రైతులకు నీళ్లు ఇవ్వని మీరు రైతు గర్జన పేరుతో ఏ మొఖం పెట్టుకోని వస్తున్నారు. చనఖా కొరటా ప్రాజెక్ట్ రూ. 368 కోట్లు ఉంటే దాన్ని వ్యయాన్ని ఏకంగా 2100 కోట్లకు పెంచారు. రా మెటీరియల్ ధర ఎంత పెరిగిన సరే ప్రాజెక్ట్ కాస్ట్ 2100 కోట్లకు పోతుందా? యువత ఆలోచించాలి. ఈ అవినీతి సొమ్ములు మాజీ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న ఇళ్లకు పోయాయా? లేదంటే గుంటనక్క మింగేసిందా? లేక బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లోకి పోయాయా చెప్పాలి? ఈ జిల్లాలో ఉన్న పాయల్ శంకర్, పాల్వాయి హరీష్ బీజేపీ ఎమ్మెల్యేలుగా ఉండి రేవంత్ రెడ్డిపై ఈగ వాలనివ్వటం లేదు. ఆదిలాబాద్ లో 80 లక్షల క్వింటాళ్ల పత్తి పండుతుంది. పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ కనీసం ఇక్కడ టెక్స్ టైల్ పార్క్‌ను కూడా ఎందుకు ఏర్పాటు చేయలేదు? మేము అడిగే ప్రశ్నలకు ముందు సమాధానం చెప్పిన తర్వాత మీరు ఏ సభ అయిన పెట్టుకోండి అని కవిత పేర్కొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Gold Prices | బంగారం ధరలు ఢమాల్.. అంచనాలకు మించి అమెరికా వృద్ధి..
- ●Manisha Bhanwala | చరిత్ర సృష్టించిన మనీషా.. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం
- ●Helicopter Accident | హెలికాప్టర్ కూలిన ఘటనలో ఆరుగురి మృతి
- ●Aditi Shankar | మణిరత్నం కల్ట్ క్లాసిక్ టైటిల్ కొట్టేసిన శంకర్ కూతురు
- ●Rafale | ఐఎన్ఎస్ విక్రాంత్‌పై ల్యాండైన రాఫెల్
- ●Harish Rao | మియాపూర్ 550 ఎకరాల భూమిని కాపాడింది బీఆర్ఎస్ ప్రభుత్వమే

Gold Prices | బంగారం ధరలు ఢమాల్.. అంచనాలకు మించి అమెరికా వృద్ధి..

Manisha Bhanwala | చరిత్ర సృష్టించిన మనీషా.. ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం

Helicopter Accident | హెలికాప్టర్ కూలిన ఘటనలో ఆరుగురి మృతి

Aditi Shankar | మణిరత్నం కల్ట్ క్లాసిక్ టైటిల్ కొట్టేసిన శంకర్ కూతురు






