త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Heavy Rain Alert | నేడు ఈ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు.. ఎల్లో అల‌ర్ట్ జారీ

Heavy Rain Alert | అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురవనున్నాయి. ఉత్త‌ర‌, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురిసే (Heavy Rain Alert) అవ‌కాశాలు ఉన్నాయ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ (IMD Hyderabad) వెల్ల‌డించింది.

G

Telangana | Published On Aug 24, 2026, 9.46 am IST

Heavy Rain Alert | నేడు ఈ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు.. ఎల్లో అల‌ర్ట్ జారీ
Advertisement

Rain Alert | త్రినేత్ర‌.న్యూస్‌: అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురవనున్నాయి. ఉత్త‌ర‌, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురిసే (Heavy Rain Alert) అవ‌కాశాలు ఉన్నాయ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ (IMD Hyderabad) వెల్ల‌డించింది. ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, క‌రీంన‌గ‌ర్‌, పెద్ద‌ప‌ల్లి, భూపాల‌ప‌ల్లి జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ భారీ వాన‌లు కురుస్తాయ‌ని తెలిపింది. ఈ జిల్లాల‌కు ఎల్లో అల‌ర్ట్ (Yellow Alert)జారీచేసింది.

వీటితోపాటు నిర్మ‌ల్‌, నిజామాబాద్‌, జ‌గిత్యాల‌, సిరిసిల్ల‌, ములుగు, కొత్త‌గూడెం, ఖ‌మ్మం, మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్‌, హ‌నుమ‌కొండ‌, రంగారెడ్డి, హైద‌రాబాద్‌, మేడ్చ‌ల్‌, వికారాబాద్‌, రంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో ఈదురు గాలుల‌తో కూడిన వ‌ర్షం కురుస్తుంద‌ని చెప్పింది. గంట‌కు 30 నుంచి 40 కిలోమీట‌ర్ల వేగంతో గాలులు వీస్తాయ‌ని పేర్కొంది. మిగిలిని జిల్లాల్లో తేలిక‌పాటి నుంచి మోస్తారు వ‌ర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది. ఇక హైద‌రాబాద్‌లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు సూచనలున్నాయని వెల్ల‌డించింది. ఆకాశం మేఘావృత‌మై ఉంటుంద‌ని చెప్పింది.

Advertisement
Advertisement