Balmoor Venkat | వీక్లీ సీరియల్‌లా కేటీఆర్ బాగోతాలు బయటేస్తా
Balmoor Venkat | ఇక నుంచి వీక్లీ సీరియల్‌లా కేటీఆర్ (KTR) బాగోతాలు బయటేస్తూనే ఉంటానని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వ్యాఖ్యానించారు. మమ్మల్ని గోకకున్నా నేన్ మాత్రం గోక్తనే ఉంటానన్నారు.
- కేటీఆర్ మమ్మల్ని గోకకున్నా.. నేన్ గోక్తనే ఉంటా
- వాళ్లింటికీ, ఆఫీస్‌కు గోకుడు మందు పంపిస్తున్న
- డ్రగ్స్‌కు బ్రాండ్‌గా మారుతున్నడు
- ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫైర్
Balmoor Venkat | త్రినేత్ర న్యూస్: ఇక నుంచి వీక్లీ సీరియల్‌లా కేటీఆర్ (KTR) బాగోతాలు బయటేస్తూనే ఉంటానని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వ్యాఖ్యానించారు. మమ్మల్ని గోకకున్నా నేన్ మాత్రం గోక్తనే ఉంటానన్నారు. వాళ్ల ఇంటికి, ఆఫీస్‌కు గోకుడు మందు ఇచ్‌గార్డ్ పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏ విచారణకైనా సిద్ధమని చెప్పే కేటీఆర్.. ఆయన పాస్‌పోర్ట్ సీజ్ చేయాలన్నా పోలీసులపై కోర్టును ఎందుకు ఆశ్రయించారని ప్రశ్నించారు. కేటీఆర్ హోటల్ బిజినెస్ సీక్రెట్స్ ఏంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టులో పలు ప్రశ్నలు సంధించారు. 2019 నుంచి 2022 మధ్య ఓ సినీ నటితో సోషల్ మీడియాలో చేసిన సంభాషణ కేటీఆర్ ఎందుకు డిలీట్ చేశారన్నారు.
రూ.175 కోట్లకు ఎలా పెరిగింది?
మొన్నటి దాకా వాళ్ల బాగోతాలు బయటపెడితే.. వాళ్ల పార్టీ వాళ్లతోటి మా ముఖ్యమంత్రిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టించారు. 2015లో డెక్కన్ సెరాయ్ షేర్ విలువ కేవలం రూ.5 కోట్లు, పదేళ్లలో రూ. 175 కోట్లకు ఎలా పెరిగింది? ఈ అంశాలపై సంబంధిత అధికారులు విచారణ చేయాలి. మేం ఫిర్యాదు చేస్తాం. ఈ హోటల్ నుంచి ఎక్కడెక్కడికి పార్సిల్ లు వెళ్తాయో, ఎవరెవరికి వెళతాయో తెలుసు. కేటీఆర్ చెప్పేవి నీతి మాటలు, చేసేవి అవినీతి పనులు.
కేటీఆర్‌తో కేసీఆర్ మాట్లాడ్తలే..
తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ ను అరికట్టేందుకు చర్యలు చేపడుతుంటే.. కేటీఆర్ డ్రగ్స్ కు బ్రాండ్ గా మారుతున్నారు. నేను చెప్పేవన్నీ అబద్ధాలైతే కేటీఆర్ లైవ్‌లోకి వచ్చి, ఏం జరిగిందో వాస్తవాలు చెప్పాలి. బీఆర్ఎస్ మిత్రులు కూడా ఆలోచన చేయాలి. కేటీఆర్ ఎందుకు ఎవరితో కలవడం లేదో? ఇప్పుడు కేసీఆర్ కూడా కేటీఆర్‌తో మాట్లాడటం లేదు. ఇద్దరి మధ్య పంచాయతీ తేల్చడానికి నవీన్ రావు తండ్రి కొండల్ రావు ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్పేవన్నీ అబద్ధాలంటే ఇప్పటికైనా కేటీఆర్ డ్రగ్ టెస్టుకు సిద్ధమని చెప్పాలి అని బల్మూరి వెంకట్ సవాల్ విసిరారు.
తాజావార్తలు
- ●CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి
- ●KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్
- ●Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్‌డౌన్!
- ●OU Degree Exam Fee | ఓయూ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ
- ●Song Lyrics | సద్ది గట్టి...సెలకల తొవ్వ బట్టి - తెలంగాణ పల్లె పదాలతో చంద్రబోస్ మ్యాజిక్ - ‘ఏగిలివారంగ’ సాంగ్ లిరిక్స్ ఇవిగో...
- ●K Kavitha | చిత్రపురి అక్రమాలపై సీబీఐ, ఈడీ విచారణ జరిపించాలి : కల్వకుంట్ల కవిత

CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి

KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్

Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్‌డౌన్!

OU Degree Exam Fee | ఓయూ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ





