త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BJP Ramchandar Rao | మ‌మ్మ‌ల్ని ఆపితే రైతుల‌ ఉద్య‌మం ఆగ‌దు

BJP Ramchandar Rao | మమ్మ‌ల్ని ఆపితే రైతుల ఉద్య‌మం ఆగ‌ద‌ని.. జూరాల పోకుండా అడ్డుకోవ‌డం దుర్మార్గ‌మ‌మ‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు మండిప‌డ్డారు. నారాయ‌ణ‌పేట‌, ఆల్మ‌ట్టి ప్రాజెక్టుల నుంచి సాగు నీటిని తీసుకొచ్చి పంట‌ల‌కు ఇవ్వాల‌న్నారు.

S

Telangana | Published On Sep 22, 2026, 1.51 pm IST

BJP Ramchandar Rao | మ‌మ్మ‌ల్ని ఆపితే రైతుల‌ ఉద్య‌మం ఆగ‌దు
Advertisement
  • పైన నిండు కుండ‌లున్న‌య్‌.. నీళ్లు తీసుకురండి
  • ఇది రేవంత్ జిల్లా.. నాకంటే ఆయ‌న‌కే ఎక్కువ బాధ్య‌త ఉంట‌ది
  • జ‌డ్చ‌ర్ల‌లో మీడియాతో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు

BJP Ramchandar Rao | త్రినేత్ర‌.న్యూస్‌: మమ్మ‌ల్ని ఆపితే రైతుల ఉద్య‌మం ఆగ‌ద‌ని.. జూరాల పోకుండా అడ్డుకోవ‌డం దుర్మార్గ‌మ‌మ‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు మండిప‌డ్డారు. నారాయ‌ణ‌పేట‌, ఆల్మ‌ట్టి ప్రాజెక్టుల నుంచి సాగు నీటిని తీసుకొచ్చి పంట‌ల‌కు ఇవ్వాల‌న్నారు. పంట‌లు మొలిచాక నీరివ్వ‌క‌పోవ‌డం చాలా దుర్మార్గ‌మం అని ఫైర‌య్యారు. మంగ‌ళ‌వారం జూరాల రైతుల‌ను క‌లిసేందుకు వెళ్తుండ‌గా జ‌డ్చ‌ర్ల‌లోనే ఆయ‌న్ను అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

ఈరోజు నిర్బంధం చేశారు. రాష్ట్రంలో ఏ కార్య‌క్ర‌మం చేసినా మమ్మ‌ల్ని అరెస్టులే చేస్తున్నారు త‌ప్పా స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దొర‌క‌డం లేదు. మొన్నటి విద్యార్థుల స‌మ‌స్య మా దృష్టిలో ఉన్న‌ది. దాన్ని కొన‌సాగిస్తం. ఈమ‌ధ్య రైతులు జూరాల కింద‌నే కాకుండా గోదావ‌రి ప‌రివాహ‌క ప్రాంతంతో పాటు రాష్ట్రంలో ఎక్క‌డ చూసినా రైతుల స‌మ‌స్య ఉంది. పంట‌ల‌కు నీరెంత అవ‌స‌ర‌మో ప్ర‌భుత్వానికి తెలుసు. కానీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి మాట్లాడ‌రు.. నీటి పారుద‌ల శాఖ మంత్రి మాట్లాడ‌రు.

నారాయ‌ణ పేట, ఆల్మ‌ట్టి నుంచి తేండి..

తాగునీళ్ల కోసం నీళ్లు దాచిపెడుతున్నం అని ఓ మంత్రి అంటుండు. పైన నారాయ‌ణ‌పేట‌, ఆల్మ‌ట్టి ప్రాజెక్టుల‌ళ్ల నిండ నీళ్లు ఉన్న‌య్. నిండు కుండ‌లా ఉన్న‌య్. అక్క‌డి నుంచి తెచ్చుకోవ‌చ్చు క‌దా. రైతులను ఆదుకోవ‌డం రాజ‌కీయం కాదు. రైతులు మమ్మ‌ల్ని పిలిచారు. అందుకే పోతున్నం.

ఎక్క‌డ చూసినా రైతుల స‌మ‌స్య‌లే..

పంట‌లు వేసి మొలిచాక ఇప్పుడు నీరు ఇయ్య‌కుంటే ఇంత‌క‌న్నా అన్యాయం ఉండ‌దు. ఇది చాలా దుర్మార్గం. మ‌మ్మ‌ల్ని ఆపితే రైతు ఉద్య‌మం ఆగ‌దు. జూరాల‌, నాగార్జున సాగ‌ర్ కింద. గోదావ‌రి ప్రాంతంలో ప‌సుపు ద‌గ్గ‌రి నుంచి పత్తి దాకా రైతులు ఇబ్బంది ప‌డుతున్న‌రు. అందుకే వారు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఉన్న‌రు. వ‌రంగ‌ల్‌లో రైతు డిక్ల‌రేష‌న్ ప్ర‌క‌టించి మాట త‌ప్పారు. ఫ‌స‌ల్ బీమా క‌న్నా మంచి బీమా తెస్తున్న‌మ‌ని చెప్పారు. మూడేండ్లు దాటినా దానిమీద ఉనికి లేదు. ఫ‌స‌ల్‌బీమా అమ‌లు చేయ‌కుంటే కొత్త బీమా అమ‌లు చేయండి.

రైతుల‌కు పెట్టింది పెట్టుబ‌డే అయిత‌ది..

ఇటువంటి స‌మ‌యంలోనే బీమా ప‌థ‌కం ప‌నికొస్త‌ది. ఇది రేవంత్ ఉమ్మ‌డి జిల్లా. ఇంత‌కుముందు నేన్ కూడా ఇక్క‌డ ఎమ్మెల్సీ ఉండే. నాకంటే నీకే ఎక్కువ బాధ్య‌త ఉంది. ఈ జిల్లా రైతుల‌ను కాపాడండి. క‌ల్వ‌కుర్తి లిఫ్ట్ ఇరిగేషన్‌లో భూములు పోయిన రైతుల‌కు ఇంకా ప‌రిహారం ఇవ్వ‌లేదు. ద‌య‌చేసి అది కూడా ఇప్పియ్యండి. బీజేపీ రైతుల ప‌క్షాన ఉంటుంది. రైతుకు ఎంత పెట్టినా పెట్టుబ‌డి అయిత‌ది. కానీ ఖ‌ర్చు కాదు. ప్ర‌భుత్వం ఖ‌ర్చు అనుకుంటుంది. ఎరువుల కొర‌త ఉంది. యాప్ తెచ్చారు. ఎరువుల ప‌ని మొత్తం రాష్ట్రానిదే. కానీ కేంద్రం మీద నెడుతున్న‌రు. రైతుల ద‌గ్గ‌ర‌కెళ్తే లాఠీచార్జీలు చేస్తున్న‌రు.

రిమ్స్ ఘ‌ట‌న‌పై సంతాపం..

ఆదిలాబాద్ రిమ్స్ ఘ‌ట‌న‌పై తీవ్ర సంతాపం తెలుపుతున్నా. ఆస్ప‌త్రిలో ఉన్న పరిక‌రాల‌ను చెక్ చేయాలి. వెంట‌నే దీనిపై విచార‌ణ జ‌ర‌పాలి. ఇందులో మాన‌వ త‌ప్పిదం ఉంటే వారిని వెంట‌నే శిక్షించాలి.

Advertisement
Advertisement