త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Apple Foldable | ఆపిల్‌ ఫోల్డబుల్‌ ఐఫోన్ వ‌చ్చేస్తోంది.. టచ్‌ఐడీతో సరికొత్తగా..!

Apple Foldable | స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో ఆపిల్‌ మరో కీలక మార్పునకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నాళ్లుగానో ప్రచారంలో ఉన్న ఫోల్డబుల్‌ ఐఫోన్‌పై కంపెనీ ఇంట‌ర్న‌ల్ టెస్ట్ ప్రారంభించిన‌ట్లు స‌మాచారం. ‘ఐఫోన్‌ అల్ట్రా’ పేరుతో దీన్ని ప్రస్తుతం పరీక్షిస్తున్నట్లు టెక్‌ విశ్లేషకుడు మార్క్‌ గుర్మన్‌ వెల్లడించారు. వచ్చే నెలలోనే ఈ ఫోన్‌ను విడుదల చేసే అవకాశం ఉంద‌ని అంచ‌నాలున్నాయి.

P

Business | Published On Aug 26, 2026, 1.31 pm IST

Apple Foldable | ఆపిల్‌ ఫోల్డబుల్‌ ఐఫోన్ వ‌చ్చేస్తోంది.. టచ్‌ఐడీతో సరికొత్తగా..!
Advertisement

Apple Foldable | స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో ఆపిల్‌ మరో కీలక మార్పునకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నాళ్లుగానో ప్రచారంలో ఉన్న ఫోల్డబుల్‌ ఐఫోన్‌పై కంపెనీ ఇంట‌ర్న‌ల్ టెస్ట్ ప్రారంభించిన‌ట్లు స‌మాచారం. ‘ఐఫోన్‌ అల్ట్రా’ పేరుతో దీన్ని ప్రస్తుతం పరీక్షిస్తున్నట్లు టెక్‌ విశ్లేషకుడు మార్క్‌ గుర్మన్‌ వెల్లడించారు. వచ్చే నెలలోనే ఈ ఫోన్‌ను విడుదల చేసే అవకాశం ఉంద‌ని అంచ‌నాలున్నాయి.

7.8 ఇంచెస్ బిగ్ స్క్రీన్‌..

ఫోల్డ‌బుల్ ఫోన్‌ పుస్తకంలా తెరుచుకునే విధంగా ఉంటుందని సమాచారం. బయట 5.5 అంగుళాల స్క్రీన్‌, ఫోన్‌ను విప్పిన తర్వాత 7.8 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంద‌ని తెలుస్తోంది. బిగ్ స్క్రీన్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా ఐప్యాడ్‌ తరహా యాప్‌ లేఅవుట్‌ను అందించనున్నట్లు సమాచారం. దీంతో ఒకేసారి పలు పనులు చేసుకునే వీలు కలగనుంది. ప్రాథమికంగా ఈ ఫోన్‌ను పరీక్షించిన వారు దాని ఫోల్డ‌బుల్ కీస్‌, డిజైన్‌, సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియ‌న్స్‌పై సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

ఫేస్‌ఐడీకి బదులు టచ్‌ఐడీ

ఫోల్డ‌బుల్ డిజైన్‌ కారణంగా ఫోన్‌ను సన్నగా, సౌకర్యవంతంగా ఉంచేందుకు ఆపిల్‌ కొన్ని సాంకేతిక మార్పులు చేసినట్లు సమాచారం. ఇందులో ఫేస్‌ఐడీకి బదులుగా టచ్‌ఐడీని తీసుకురానున్నట్లు తెలుస్తోంది. స్పేస్ ప‌రిమితి కార‌ణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కెమెరాల విషయంలోనూ కొన్ని మార్పులు ఉండనున్నాయి. ఈ మోడల్‌లో టెలిఫొటో లెన్స్‌ ఉండకపోవచ్చని అంచనా. అయితే మెయిన్ కెమెరా మాత్రం హైక్వాలిటీ ఫొటోలు తీసే సామర్థ్యంతో ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఐఫోన్‌ 18 సిరీస్‌తోనే లాంచ్‌?

ఆపిల్‌ తన ఫోల్డ‌బుల్ ఫోన్‌ను సెప్టెంబర్‌లో ఐఫోన్‌ 18 ప్రో, ఐఫోన్‌ 18 ప్రో మ్యాక్స్‌తో పాటు ఆవిష్క‌రించే అవ‌కాశం ఉన్న‌ట్లు టెక్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. అదే ఫోల్డ‌బుల్ ఫోన్‌ విభాగంలో ఆపిల్‌ తొలిసారిగా నేరుగా పోటీకి దిగినట్లవుతుంది. ఇప్పటికే ఈ విభాగంలో పలు సంస్థలు తమ మోడళ్లను విడుదల చేసిన నేపథ్యంలో.. ఆపిల్ మొట్ట‌మొద‌టిసారిగా తీసుకువ‌స్తున్న ఫోన్‌ మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement
Advertisement