Amrit Bharat Express | కాగజ్‌నగర్, ఖమ్మం మీదుగా కోయంబత్తూర్ – ధన్‌బాద్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్
Amrit Bharat Express | దక్షిణ మధ్య రైల్వేలో (SCR) మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ (Amrit Bharat Express) అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ మీదుగా జార్ఖండ్‌లోని ధన్‌బాధ్ (Dhanbad) నుంచి తమిళనాడులోని కోయబంత్తూర్‌కి (Coimbatore) అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్లు 22363/22364) సర్వీసులను ప్రారంభించింది.
Amrit Bharat Express | త్రినేత్ర.న్యూస్: దక్షిణ మధ్య రైల్వేలో (SCR) మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ (Amrit Bharat Express) అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ మీదుగా జార్ఖండ్‌లోని ధన్‌బాధ్ (Dhanbad) నుంచి తమిళనాడులోని కోయబంత్తూర్‌కి (Coimbatore) అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్లు 22363/22364) సర్వీసులను ప్రారంభించింది. ఇది ప్రతి శనివారం సాయంత్రం ధన్‌బాద్‌లో బయల్దేరుతుంది. సోమవారం సాయంత్రం కోయంబత్తూర్ చేరుకుంటుంది.
మళ్లీ మంగళవారం ఉదయం కోయంబత్తూర్‌లోకి బయల్దేరి గురువారం వారం మధ్యాహ్నం ధన్‌బాద్ చేరుకుంటుంది. మధ్యలో రాష్ట్రంలోని సిర్పూర్ కాగజ్‌నగర్, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్ (Warangal), మహబూబాబాద్, ఖమ్మంలో ఆగుతుంది. అదేవిధంగా బల్హార్షా, విజయవాడ, తిరుప్పూర్‌లో కూడా దీనికి స్టాపేజీ ఉన్నది. తెలంగాణ (Telangana), ఏపీ మీదుగా సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ సర్వీసు ఎంతో సౌకర్యవంతంగా మారనుంది. మొత్తంగా ఏడు రాష్ట్రాల మీదుగా ఈ రైలు ప్రయాణించనుంది. జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుంచి ప్రయాణిస్తుంది. ఈ రైలులో మొత్తం 22 కోచ్‌లు ఉంటాయి. అందులో 8 స్లీపర్ క్లాస్‌లు, 11 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. అదనంగా 2 లగేజ్ కమ్ బ్రేక్ వ్యాన్‌లు, ఒక ప్యాంట్రీ కార్‌ను ఏర్పాటుచేశారు.
వీక్స్ ఎక్స్‌ప్రెస్ ఇలా..
ధన్‌బాద్ - కోయంబత్తూర్ అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్ 22363 )
ఈ రైలు ప్రతి శనివారం సాయంత్రం 16.10 (4.10) గంటలకు ధన్‌బాద్‌లో బయలుదేరి, సోమవారం సాయంత్రం 18.30 (6.30) గంటలకు కోయంబత్తూర్ చేరుకుంటుంది.
గోమో: శనివారం సాయంత్రం 16.40 / 16.42
బల్హార్షా: ఆదివారం రాత్రి 21.10 / 21.15
సిర్పూర్ కాగజ్‌నగర్: రాత్రి 22.04 / 22.05
మంచిర్యాల: రాత్రి 22.44 / 22.45
పెద్దపల్లి: రాత్రి 23.09 / 23.10
వరంగల్: సోమవారం అర్ధరాత్రి 00.08 / 00.10
మహబూబాబాద్: రాత్రి 01.09 / 01.10
ఖమ్మం: రాత్రి 01.49 / 01.50
విజయవాడ: తెల్లవారుజామున 03.45 / 03.55
తిరుప్పూర్: సోమవారం సాయంత్రం 17.03 / 17.05
కోయంబత్తూర్: సోమవారం సాయంత్రం 18.30 గంటలకు
కోయంబత్తూర్ - ధన్‌బాద్ అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్ 22364)
ఈ రైలు తిరుగు ప్రయాణంలో ఈ రైలు ప్రతి మంగళవారం ఉదయం 07.50 గంటలకు కోయంబత్తూర్‌లో బయలుదేరుతుంది. గురువారం మధ్యాహ్నం 13 (ఒంటి గంట) గంటలకు ధన్‌బాద్ చేరుకుంటుంది.
తిరుప్పూర్: మంగళవారం ఉదయం 08.28 / 08.30
విజయవాడ: మంగళవారం రాత్రి 21:40 / 21.50
ఖమ్మం: రాత్రి 23.39 / 23.40
మహబూబాబాద్: బుధవారం అర్ధరాత్రి 00:09 / 00.10
వరంగల్: రాత్రి 01.18 / 01.20
పెద్దపల్లి: తెల్లవారుజామున 03.59 / 04.00
మంచిర్యాల: ఉదయం 04.49 / 04.50
సిర్పూర్ కాగజ్‌నగర్: ఉదయం 05.19 / 05.20
బల్హార్షా: ఉదయం 07.00 / 07.05
గోమో: గురువారం ఉదయం 11.48 / 11.50
ధన్‌బాద్: గురువారం మధ్యాహ్నం 13.00 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది.
తాజావార్తలు
- ●పాలిటిక్స్ వర్సెస్ ప్రోగ్రెస్: గుజరాత్ వర్సెస్ తెలంగాణ హాట్ డిబేట్! రాజకీయ రగడ రగిలించిన జాతీయ చర్చ!
- ●Horoscope | ఆగస్టు 26 రాశిఫలాలు.. ఈ రాశివారు విశ్లేషణాత్మక శక్తితో వాటిని అధిగమిస్తారు!
- ●Toxic | 'టాక్సిక్' సినిమా చూడండి.. కానీ ఆ దృశ్యాలను చిత్రీకరించకండి..
- ●CM Revanth Reddy | గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీలను అభినందించిన సీఎం రేవంత్
- ●HYDRAA | విద్యార్థుల భద్రతే ముఖ్యం.. ఫేక్ ఫైర్ ఎన్వోసీలపై కాలేజీలకు హైడ్రా దిశానిర్దేశం
- ●Irrigation Projects | భూసేకరణకు రూ.6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ

పాలిటిక్స్ వర్సెస్ ప్రోగ్రెస్: గుజరాత్ వర్సెస్ తెలంగాణ హాట్ డిబేట్! రాజకీయ రగడ రగిలించిన జాతీయ చర్చ!

Horoscope | ఆగస్టు 26 రాశిఫలాలు.. ఈ రాశివారు విశ్లేషణాత్మక శక్తితో వాటిని అధిగమిస్తారు!

Toxic | 'టాక్సిక్' సినిమా చూడండి.. కానీ ఆ దృశ్యాలను చిత్రీకరించకండి..

CM Revanth Reddy | గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీలను అభినందించిన సీఎం రేవంత్





