త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bus Accident | ఆగిఉన్న కంటైన‌ర్‌ను ఢీకొట్టిన ట్రావెల్స్ బ‌స్సు.. ఆరుగురు దుర్మ‌ర‌ణం

Bus Accident | సూర్యాపేట జిల్లా కోదాడ మండ‌లం దొర‌కుంట (Dorakunta) శివారులో ఘోర రోడ్డు ప్ర‌మాదం (Bus Accident) జ‌రిగింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై దొర‌కుంట వ‌ద్ద వేగంగా దూసుకొచ్చిన ప్రైవేటు ట్రావెల్స్ బ‌స్సు (Travels Bus).. రోడ్డు ప‌క్క‌న ఆగి ఉన్న కంటైన‌ర్ లారీని ఈకొట్టింది.

G

Telangana | Published On Aug 26, 2026, 7.05 am IST

Bus Accident | ఆగిఉన్న కంటైన‌ర్‌ను ఢీకొట్టిన ట్రావెల్స్ బ‌స్సు.. ఆరుగురు దుర్మ‌ర‌ణం
Advertisement

Bus Accident | త్రినేత్ర‌.న్యూస్‌: సూర్యాపేట జిల్లా కోదాడ మండ‌లం దొర‌కుంట (Dorakunta) శివారులో ఘోర రోడ్డు ప్ర‌మాదం (Bus Accident) జ‌రిగింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై దొర‌కుంట వ‌ద్ద వేగంగా దూసుకొచ్చిన ప్రైవేటు ట్రావెల్స్ బ‌స్సు (Travels Bus).. రోడ్డు ప‌క్క‌న ఆగి ఉన్న కంటైన‌ర్ లారీని ఈకొట్టింది. దీంతో ఆరుగురు అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. మ‌రో 23 మంది గాయ‌ప‌డ్డారు.

ఫ్రెష్‌బ‌స్ ట్రావెల్స్‌కు చెందిన ఎల‌క్ట్రిక్ బ‌స్సు హైద‌రాబాద్ (Hyderabad) నుంచి ఏలూరు వెళ్తున్న‌ది. ఈక్ర‌మంలో బుధ‌వారం వేకువ‌జామున కోదాడ (Kodada) మండ‌లం దొర‌కుంట శివారులో రోడ్డు ప‌క్క‌న ఆగిఉన్న కంటైన‌ర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో నిద్ర‌లో ఉన్న ప్ర‌యాణికులు ఆరుగురు ఘ‌ట‌నా స్థ‌లంలోనే మ‌ర‌ణించారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.

గాయ‌ప‌డిన‌వారిని కోదాడ ప్రభుత్వ ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. వారిలో కొంద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం. ప్ర‌మాద స‌మ‌యంలో బ‌స్సులో 42 మంది ప్ర‌యాణికులు ఉన్న‌ట్లు స‌మాచారం. ప్రమాదంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో పోలీసులు ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివ‌రాలు తెలియాల్సి ఉన్న‌ది.

Advertisement
Advertisement