త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Suicide Attempt | హుస్సేన్‌సాగర్‌లో దూకి సూడాన్ దేశీయుడి ఆత్మహత్యాయత్నం

Suicide Attempt | హైద‌రాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో దూకి ఓ విదేశీయుడు ఆత్మహత్యాయత్నం (Suicide Attempt) చేశాడు. గ‌మ‌నించిన పోలీసులు అత‌డిని ర‌క్షించారు.

G

Hyderabad | Published On Aug 26, 2026, 12.12 pm IST

Suicide Attempt | హుస్సేన్‌సాగర్‌లో దూకి సూడాన్ దేశీయుడి ఆత్మహత్యాయత్నం
Advertisement

Suicide Attempt | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో దూకి ఓ విదేశీయుడు ఆత్మహత్యాయత్నం (Suicide Attempt) చేశాడు. గ‌మ‌నించిన పోలీసులు అత‌డిని ర‌క్షించారు. సూడాన్‌కు చెందిన (Sudanese National) న‌జ‌ర్ ఆడ‌మ్ బ‌డా వే (25) అనే యువ‌కుడు టోలీచౌకీ పారామౌంట్ కాల‌నీలో నివ‌సిస్తున్నాడు.

బుధ‌వారం తెల్ల‌వారుజామున స‌చివాల‌యం (Secretariat) వ‌ద్ద‌కు చేరుకున్న అత‌డు.. హుస్సేన్‌సాగ‌ర్‌లో (Hussain Sagar) దూకి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశాడు. అయితే అక్క‌డే విధులు నిర్వ‌హిస్తున్న సైఫాబాద్ పోలీసులు అత‌డిని గ‌మ‌నించారు. తాడు సాయంతో అత‌డిని ర‌క్షించారు. అనంత‌రం లేక్ పోలీసుల‌కు (Lake Police) అప్ప‌గించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసిన లేక్ పోలీసులు.. ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి గ‌ల కార‌ణాల‌పై ఆరా తీస్తున్నారు.

Advertisement
Advertisement