త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Group-1 GRL | గ్రూప్‌-1 జ‌న‌ర‌ల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇవ్వ‌కుంటే 500 మందితో ఆమ‌ర‌ణ దీక్ష‌

Group-1 GRL | గ్రూప్‌-1 జ‌న‌ర‌ల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇవ్వ‌కుంటే 500 మందితో ఆమ‌ర‌ణ దీక్ష‌కు పూనుకుంటామ‌ని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర నేత కొడంగల్ రవికుమార్ తేల్చి చెప్పారు.

S

Telangana | Published On Oct 9, 2026, 5.36 pm IST

Group-1 GRL | గ్రూప్‌-1 జ‌న‌ర‌ల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇవ్వ‌కుంటే 500 మందితో ఆమ‌ర‌ణ దీక్ష‌
Advertisement
  • పార‌ద‌ర్శ‌క‌త పాటించని టీజీపీఎస్‌సీ చైర్మన్ రాజీనామా చేయాలి
  • నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర నేత కొడంగల్ రవి డిమాండ్

Group-1 GRL | త్రినేత్ర న్యూస్‌: గ్రూప్‌-1 జ‌న‌ర‌ల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇవ్వ‌కుంటే 500 మందితో ఆమ‌ర‌ణ దీక్ష‌కు పూనుకుంటామ‌ని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర నేత కొడంగల్ రవికుమార్ తేల్చి చెప్పారు. టీజీపీఎస్‌సీ రాత‌పూర్వ‌కంగా ఇచ్చిన హామీల‌ను నిల‌బెట్టుకోవాల‌ని డిమాండ్ చేశారు. రెండు సంవత్సరాలు దాటినా పారదర్శకతపై ప‌ట్టింపులేని చైర్మన్ రాజీనామా చేయాల‌న్నారు. నాంపల్లిలోని ప్రతిభా భవన్‌లో కమిషన్ ఛైర్మన్‌కు గ్రూప్‌-1 అభ్య‌ర్థుల‌తో క‌లిసి శుక్ర‌వారం విన‌తిప‌త్రం స‌మ‌ర్పించిన అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప‌రీక్ష ఫ‌లితాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ దానికి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని, వెరిఫికేషన్ మెట్రిక్స్‌ను కమిషన్ గోప్యంగా ఉంచడం స‌రికాద‌న్నారు.

టీజీపీఎస్‌సీ గ్రూప్-1 (నోటిఫికేషన్ నంబర్ 2/2024) ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో పూర్తి పారదర్శకతను పాటించాలి. కమిషన్ వెంటనే స్పందించి ఈ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి, లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థుల నమ్మకాన్ని, నియామక వ్యవస్థ విశ్వసనీయతను కాపాడాలి. ముఖ్యంగా గతంలో 7/7/2024 నాటి అధికారిక ప్రకటనలో కమిషన్ స్వయంగా ఇచ్చిన లిఖితపూర్వక హామీని గుర్తు చేస్తున్నాం. ప్రిలిమ్స్ స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ రాత పరీక్షలకు సంబంధించిన కమ్యూనిటీ, కేటగిరీ, జెండర్, మల్టీ-జోన్ల వారీ అధికారిక కటాఫ్ మార్కులను తక్షణమే విడుదల చేయాలి. కటాఫ్ మార్కులు ప్రకటించకపోడం వల్ల 1:50 నిష్పత్తి ఎంపిక నిబంధనల ప్రకారం సక్రమంగా జరిగిందా లేదా అనేది అభ్యర్థులు స్వయంగా ధృవీకరించుకునే అవకాశం లేకుండా పోయింది. దీనితో పాటు, ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్ నంబర్లను మెయిన్స్ హాల్ టికెట్ నంబర్లతో నేరుగా అనుసంధానించే (Mapping Sheet) ప్రక్రియను నిరాకరించడంపై అనుమానాలు ఉన్నాయి.

అభ్యర్థుల పేరు, రోల్ నంబర్, రెండు దశల మార్కులు, వారికి చివరగా కేటాయించిన ఉద్యోగాల (డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, సీటీవో వంటివి) వివరాలతో కూడిన ఒక సంయుక్త 'ఇంటిగ్రేటెడ్ మాస్టర్ మ్యాట్రిక్స్' ను బహిరంగంగా వెబ్‌సైట్‌లో ప్రచురించాలి. ఈ కీలక సమాచారాన్ని నిలిపివేయడం వల్ల ప్రజా విశ్వాస సూత్రానికి (Doctrine of Public Trust) భంగం కలగడమే కాకుండా, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వపు హక్కు), ఆర్టికల్ 16 (ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు) నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించడమే అవుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక సంస్థ (UPSC), ఇతర పొరుగు రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అనుసరించే అత్యున్నత పారదర్శక ప్రమాణాలను, స్కోర్‌కార్డుల విధానాన్ని టీజీపీఎస్‌సీలోనూ శాశ్వతంగా అమలు చేయాలి అని అభ్య‌ర్థులు కోరారు.

Advertisement
Advertisement