Charan Koushik Yadav | కాంగ్రెస్ అకౌంట్లో 900 కోట్లుంటే.. బీఆర్ఎస్ అకౌంట్లోకి 1500 కోట్లు ఎట్లొచ్చినయ్
Charan Koushik Yadav | యాభై ఏండ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అకౌంట్లో రూ.900 కోట్లు ఉంటే.. పదేళ్లే తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ అకౌంట్లో రూ.1500 కోట్లు ఎలా వచ్చాయని కార్పొరేషన్ చైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్ ప్రశ్నించారు.
- తెలంగాణ రాజకీయాల్లో బూతులు మొదలువెట్టిందే కేసీఆర్
- బీఆర్ఎస్ నేతలంతా డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలి
- కవిత అడిగే ప్రశ్నలకు జవాబివ్వండి
- కార్పొరేషన్ చైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్ ఫైర్
Charan Koushik Yadav | త్రినేత్ర న్యూస్: యాభై ఏండ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అకౌంట్లో రూ.900 కోట్లు ఉంటే.. పదేళ్లే తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ అకౌంట్లో రూ.1500 కోట్లు ఎలా వచ్చాయని కార్పొరేషన్ చైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్ ప్రశ్నించారు. తెలంగాణ రాజకీయాల్లో బూతులు ప్రారంభించిందే కేసీఆర్ అని విమర్శించారు. దమ్ముంటే కవిత అడిగే ప్రశ్నలకు జవాబివ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులంతా డ్రగ్స్ టెస్ట్ చేసుకోవాలన్నారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బల్మూరి వెంకట్‌పై వ్యక్తిత్వ హసనానికి పాల్పడుతన్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ పార్టీకి అసలు కమిటీలు లేవు. సోషల్ మీడియాను నమ్ముకుని రాష్ట్రంలో ముందుకు పోతుంది. బల్మూరి వెంకట్ పై బీఆర్ఎస్ నేతలు వ్యక్తిత్వ హసనానికి పాల్పడుతున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు? బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్ రూమ్ లు కట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు.
కేటీఆర్ బామ్మర్ది ఫామ్‌హౌస్‌లో..
డ్రగ్స్ టెస్ట్ అంటే కేటీఆర్ ముందుకు రారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ తన కుటుంబానికి పదవులు ఇచ్చుకున్నారు. రేవంత్ రెడ్డి తన సోదరుల్లో ఎవరికి పదవులు ఇవ్వలేదు. కల్వకుంట్ల కవిత అడిగే ప్రశ్నలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పడం లేదు. పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ దొరికాయి. కేటీఆర్ బామ్మర్ది ఫామ్ హౌస్‌లో పార్టీలో పాల్గొన్న వ్యక్తికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. కేదార్ అనే వ్యక్తి దుబాయ్‌లో చనిపోయారు.
తెలంగాణ రాజకీయాల్లో బూతులు ప్రారంభించింది కేసీఆర్. బీఆర్ఎస్ నేతలంతా డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలి. ప్రాజెక్టుల కాంట్రాక్టుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 30 శాతం కమీషన్లు తీసుకున్నారు. తెలంగాణలో భాషను కలుషితం చేసింది బీఆర్ఎస్ అని చరణ్ కౌశిక్ యాదవ్ మండిపడ్డారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jantar Mantar Protest Site | నిరసనలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న జంతర్ మంతర్ కాలం చెల్లిందా?
- ●Nagarigari Preetham | కేటీఆర్! మేం బ్లడ్ శాంపిల్స్ ఇస్తున్నం.. డాక్టర్లను మీ ఇంటికీ పంపుతున్నం
- ●Minister Vivek | హైదరాబాద్ - మియోషి సిస్టర్ సిటీ స్నేహ బంధానికి 20 ఏళ్లు
- ●Mallikarjun Kharge | దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ.. సీజేఐని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా
- ●Errabelli Dayakar Rao | ఆస్తులను లాక్కునే పనిలో సీఎం రేవంత్ ప్రభుత్వం
- ●Preethi Asrani | దీపావళికి థియేటర్లలోకి విజయ్ ఆంటోనీ నాన్న కుట్టి - హీరోయిన్గా హైదరాబాదీ బ్యూటీ

Jantar Mantar Protest Site | నిరసనలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న జంతర్ మంతర్ కాలం చెల్లిందా?

Nagarigari Preetham | కేటీఆర్! మేం బ్లడ్ శాంపిల్స్ ఇస్తున్నం.. డాక్టర్లను మీ ఇంటికీ పంపుతున్నం

Minister Vivek | హైదరాబాద్ - మియోషి సిస్టర్ సిటీ స్నేహ బంధానికి 20 ఏళ్లు

Mallikarjun Kharge | దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ.. సీజేఐని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా



