Adluri Laxman | రూ.2000 కోట్ల స్కామ్ నిరూపిస్తే మంత్రి పదవి వదిలేస్తా: హరీశ్‌రావుకు మంత్రి అడ్లూరి సవాల్
Adluri Laxman | స్కూల్ యూనిఫాం, బెడ్షీట్ల టెండర్లలో రూ. 2000 కోట్ల స్కాం జరిగిందనే ఆరోపణలు నిజమని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ఈమేరకు మాజీ మంత్రి హరీశ్‌రావుకు ఆయన సవాల్ విసిరారు. మంత్రులకు తెలియకుండా నిర్ణయాలు తీసుకోవడానికి ఇది కేసీఆర్ ప్రభుత్వం కాదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
- మంత్రులకు తెలియకుండా నిర్ణయాలు తీసుకోవడానికి ఇది కేసీఆర్ ప్రభుత్వం కాదు
- రేవంత్ ప్రభుత్వంలో మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఉంది
- టెండర్లపై ముగ్గురు మంత్రులతో సీఎం సమీక్ష చేశారు
- హరీశ్‌రావు అబద్దాలు మాట్లాడుతున్నారు
- సీఎల్పీ ప్రెస్మీట్లో మంత్రి అడ్లూరి ఫైర్
Adluri Laxman | త్రినేత్ర.న్యూస్: స్కూల్ యూనిఫాం, బెడ్షీట్ల టెండర్లలో రూ. 2000 కోట్ల స్కాం జరిగిందనే ఆరోపణలు నిజమని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ఈమేరకు మాజీ మంత్రి హరీశ్‌రావుకు ఆయన సవాల్ విసిరారు. హరీశ్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానన్నారు. నాకు, పొన్నంకు తెలియకుండా టెండర్లు వచ్చాయనేది అబద్దమని చెప్పారు. నాకు దోచుకోవడం, దాచుకోవడం తెలియదని ఎద్దేవా చేశారు. మంత్రులకు తెలియకుండా నిర్ణయాలు తీసుకోవడానికి ఇది కేసీఆర్ ప్రభుత్వం కాదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈమేరకు మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన ప్రెస్మీట్లో మాట్లాడారు.
రేవంత్ ప్రభుత్వంలో మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఉంది. గత ప్రభుత్వ పాపాలను కడుక్కుంటూ వస్తున్నాం. కేసీఆర్ ప్రభుత్వం పెట్టిన పెండింగ్ బిల్లులు మేం క్లియర్ చేస్తూ వస్తున్నాం. గతంలో కేసీఆర్, హరీశ్, కేటీఆర్‌లకు తప్పా మిగతా మంత్రులకు అధికారమే లేదు. పిల్లల యూనిఫామ్, బెడ్ షీట్లు, ఇతరాల కోసం ఆన్లైన్ టెండర్లు పిలిచాం. టెండర్లు ఇచ్చే ముందు ముగ్గురు మంత్రులతో సీఎం రివ్యూ చేశారు. టెండర్ల గురించి నాకు, పొన్నంకి తెలియదని హరీష్ అబద్ధాలు మాట్లాడుతున్నారు అని మంత్రి మండిపడ్డారు.
విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. స్కూల్ విద్యార్థులను బాగు చేస్తుంటే మాపై ఆరోపణలు చేస్తున్నారు. సొంత పత్రికలో అబద్ధాలను పదే పదే రాయిస్తున్నారు. రూ.2 వేల కోట్ల స్కాం జరిగిందని హరీష్ అబద్ధాలు చెబుతున్నాడు. యూనిఫామ్, ప్లేట్స్, బెడ్ షీట్స్, ఇతరాల కోసం ఆన్లైన్ టెండర్లలో మూడు కంపెనీలు క్వాలిఫై అయ్యాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో అక్టోబర్‌లో యూనిఫామ్ ఇచ్చారు. కేసీఆర్ హయాంలో బుక్స్, బెడ్ షీట్స్, ప్లేట్స్ సెప్టెంబర్‌లో ఇచ్చారు అని మంత్రి అడ్లూరి గుర్తు చేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Thalapathy Vijay | ఆ దర్శకుడి అన్ని సినిమాల్లో హీరో పేరు విజయ్ - ఎవరా డైరెక్టర్ ? తమిళనాడు సీఎంతో లింకేంటి?
- ●Hyderabad Metro | వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే.. మెట్రోపై రేవంత్ రాజకీయ డ్రామాకు తెర లేపారా..?
- ●Sambashiva Rao | హామీలు నెరవేర్చకుంటే కాంగ్రెస్‌పై తిరుగుబాటే
- ●Maheshkumar Goud | దామోదర, జగ్గారెడ్డితో కలిపి నా ఓటు పోయినా ఆశ్చర్యం లేదు
- ●Ira Aery | ఆస్ట్రేలియన్ ఉమెన్స్ క్రికెటర్ అందానికి ఫ్యాన్స్ క్లీన్ బౌల్డ్ - ఎవరీ ఇరా ఏరీ?
- ●DGP CV Anand | వర్షాకాలంలో ప్రజల భద్రతే ప్రాధాన్యం : డీజీపీ సీవీ ఆనంద్

Thalapathy Vijay | ఆ దర్శకుడి అన్ని సినిమాల్లో హీరో పేరు విజయ్ - ఎవరా డైరెక్టర్ ? తమిళనాడు సీఎంతో లింకేంటి?

Hyderabad Metro | వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే.. మెట్రోపై రేవంత్ రాజకీయ డ్రామాకు తెర లేపారా..?

Sambashiva Rao | హామీలు నెరవేర్చకుంటే కాంగ్రెస్‌పై తిరుగుబాటే

Maheshkumar Goud | దామోదర, జగ్గారెడ్డితో కలిపి నా ఓటు పోయినా ఆశ్చర్యం లేదు



