Register Marriage | ఆమె ఐపీఎస్.. అతడు ఐఏఎస్.. సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఆదర్శ వివాహం
Register Marriage | వాళ్లిద్దరు ఉన్నతాధికారులు. ఒకరేమో డీసీపీ. మరొకరు ట్రైనీ ఐఏఎస్ (IAS). ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఉన్నత స్థానాల్లో ఉన్న వారిరువురు అనుకుంటే ధూంధాంగా వివాహ వేడుక జరుపుకోవచ్చు. దానికి భిన్నంగా ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా సింపుల్‌గా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో(Register Marriage) దండలు మార్చుకుని చట్టబంద్ధంగా ఒక్కటయ్యారు.
త్రినేత్ర.న్యూస్: వాళ్లిద్దరు ఉన్నతాధికారులు. ఒకరేమో డీసీపీ. మరొకరు ట్రైనీ ఐఏఎస్ (IAS). ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఉన్నత స్థానాల్లో ఉన్న వారిరువురు అనుకుంటే ధూంధాంగా వివాహ వేడుక జరుపుకోవచ్చు. దానికి భిన్నంగా ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా సింపుల్‌గా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో(Register Marriage) దండలు మార్చుకుని చట్టబంద్ధంగా ఒక్కటయ్యారు. ప్రస్తుత రోజుల్లో మధ్యతరగతి కుటుంబాలు కూడా వివాహ వేడుక కోసం భారీగా డబ్బు ఖర్చుచేస్తున్నారు. అలాంటిది సివిల్ సర్వీసెస్‌లో ఉన్న ఇద్దరు అధికారులు సాదాసీదాగా ఆదర్శ వివాహం చేసుకోవడంపై సోషల్ మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. వారి పెండ్లి ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగారెడ్డిగూడెంకు చెందిన యువ ఐపీఎస్ అధికారిని శేషాద్రిని రెడ్డి.. కుత్బుల్లాపూర్ డీసీపీగా పనిచేస్తున్నారు. కడప జిల్లాకు చెందిన శ్రీకాంత్ రెడ్డి ప్రస్తుతం ఐఏఎస్ ట్రైనింగ్‌లో ఉన్నారు. వీరిరువురు చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎలాంటి ఆడంబరం లేకుండా రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. పెండ్లికి హాజరైన పలువురు ఉన్నతాధికారులు ఆదర్శ జంటను అభినందించారు.
https://x.com/TeluguScribe/status/2014977511139184896?s=20
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






