MLA Kadiyam Srihari | నేను నీళ్లిచ్చే పరిస్థితుల్లో లేను.. మాటిచ్చి ఇయ్యకుంటే శాపనార్థాలు పెడుతరు
MLA Kadiyam Srihari | ప్రస్తుతం నేను వానాకాలం పంటలకు నీళ్లు ఇచ్చే పరిస్థితుల్లో లేనని స్టేషన్‌గన్‌పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఇస్తా అని చెప్పి ఇయ్యకపోతే రైతులు శాపనార్థాలు పెడతారని వ్యాఖ్యానించారు. మిగతావాళ్లలెక్క మాటలు చెప్పి మోసం చేయడం నాకు నచ్చదని పేర్కొన్నారు.
- వరి బదులు మొక్కజొన్ననో, పెసర్లో, కందులో వేసుకోండి
- అదృష్టం బాగుండి వానలు పడితే వరి వేసుకోండి
- ఎమ్మెల్యే కడియం శ్రీహరి
MLA Kadiyam Srihari | త్రినేత్ర.న్యూస్: ప్రస్తుతం నేను వానాకాలం పంటలకు నీళ్లు ఇచ్చే పరిస్థితుల్లో లేనని స్టేషన్‌గన్‌పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఇస్తా అని చెప్పి ఇయ్యకపోతే రైతులు శాపనార్థాలు పెడతారని వ్యాఖ్యానించారు. మిగతావాళ్లలెక్క మాటలు చెప్పి మోసం చేయడం నాకు నచ్చదని పేర్కొన్నారు. గురువారం ఆయన నియోజకవర్గంలో మాట్లాడుతూ రైతులకు పలు సూచనలు చేశారు.
నేను మీకు నీళ్లిస్తనని హామీ ఇస్తే.. నా హామీ మీద మీరు పొలం వేసుకుంటే.. ఒక నెల తర్వాతనో, రెండు నెలల తర్వాతనో నీళ్లు రాకపోతే పొలాలు ఎండిపోతయ్. దాంతోటి శాపనార్థాలు పెడుతరు. నేను చెప్పేదేంటంటే సాధ్యమైనంత వరకు ఏవైనా ఆరుతడి పంటలు వేసుకోండి. మొక్కజొన్ననో, పెసర్లో, ఇన్ని కందులో, ఇంత సజ్జనో లేకపోతే పొద్దుతిరుగుడో ఏదో ఒకటి వేసుకోండి.
దేవాదుల నుంచి నీళ్లు తీసుకొస్తున్నా..
లేదు వరే వేసుకోవాలనుకుంటే ఇంకో వారం పది రోజులు టైం ఉంది. మన అదృష్టం కలిసొచ్చి వర్షాలు బాగా పడితే మంచిదే. అప్పుడు వరి వేసుకుంటే వేసుకోండి. కానీ తొందరపడి ఆగం కావొద్దు. నాప్రయత్నం అంతా చేస్తున్నా.. నేను నీళ్లు ఇచ్చే పరిస్థితుల్లో లేను. దేవాదుల నుంచి నీళ్లు తీసుకొస్తున్నా. గండి రామారం నుంచి పనులు కూడా వేగంగా చేయిస్తున్నా. కాకపోతే ఈ సీజన్‌కు అది అందే పరిస్థితి లేదు.
మిగతావాళ్లలెక్క మాటలు చెప్పి ఏం కాదు వేసుకోండి నేన్ నీళ్లు తెస్తా అని చెప్పి పోతే మీరు ఆగమైతరు. అందుకే మిమ్మల్ని ఆగం చేయడం నా ఉద్దేశం కాదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఏదిఏమైనా కూడా ఎంతమేరకు అవసరముంటే అంత నీరందించే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా ఆలోచించి పంట వేసుకోండి అని కడియం కోరారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం






