Palla Rajeshwar Reddy | నేన్ ప్రిపేరై రాలే అధ్యక్షా.. మా ఆదిత్యనాథ్‌దాస్ రాసిచ్చిన పాయింట్సే మాట్లాడ్త
Palla Rajeshwar Reddy | తాను ప్రిపేరయ్యి రాలేదని. తమ అడ్వైజర్ ఆదిత్యానాథ్‌దాస్ రాసిచ్చిన పాయింట్లే మాట్లాడతానని నీటి పారుదల శాఖా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అలియాస్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. తనను ఎంత కన్ఫ్యూస్ చేసినా కన్ఫ్యూస్ అయ్యేటోన్ని కాదన్నారు.
- నన్ను ఎంత కన్ఫ్యూస్ చేసినా కాను
- మేం చంద్రబాబు పైసలతోనే గెలిచినం.. వాళ్లు చెప్పిందే చేస్తం
- మాక్ అసెంబ్లీలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి అలియాస్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఫన్నీ సెటైర్లు
Palla Rajeshwar Reddy | త్రినేత్ర.న్యూస్: తాను ప్రిపేరయ్యి రాలేదని. తమ అడ్వైజర్ ఆదిత్యానాథ్‌దాస్ రాసిచ్చిన పాయింట్లే మాట్లాడతానని నీటి పారుదల శాఖా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అలియాస్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. తనను ఎంత కన్ఫ్యూస్ చేసినా కన్ఫ్యూస్ అయ్యేటోన్ని కాదన్నారు. చంద్రబాబు ఇచ్చిన పైసలతోనే తమ ప్రభుత్వం గెలిచిందని.. అందుకే వాళ్లు చెప్పిందే చేస్తామని పేర్కొన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మాక్ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ నవ్వులు పూయించారు.
నేను ప్రిపేర్ అయ్యి రాలేదు అధ్యక్షా.. నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నరు. మా అడ్వైజర్ ఆదిత్యానాథ్‌దాస్ కొన్ని పాయింట్స్ రాసిచ్చాడు.. అవే మాట్లాడతా. నాకు ప్రిపరేషన్ లేదు కావొచ్చు.. మా ముఖ్యమంత్రికి డెడికేషన్ లేకపోవొచ్చు. కానీ ఆదిత్యనాథ్‌దాస్ ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతా.
డిసిప్లిన్‌గా ఇసుక తవ్వుతున్నం..
నేను మిలటరీలో పని చేసొచ్చిన. కాళేశ్వరం దగ్గర ఎక్కడెక్కడ ఇసుక తవ్వాల్నో మా ముఖ్యమంత్రి చెప్పిండు. మా ముఖ్యమంత్రి చెప్పినట్లు అన్ని రిజర్వాయర్లలో చాలా డిసిప్లిన్‌గా ఇసుక తోడే కార్యక్రమం చేస్తున్నం. మా ప్రభుత్వం వచ్చిందే చంద్రబాబు వల్ల.. వారి పైసలతోనే గెలిచినం. వారి సోషల్ మీడియాతోనే గెలిచాం. అందుకే వాళ్లు చెప్పిందే చేస్తం, డైరెక్షన్‌లోనే పని చేస్తాం.
బ్యాంకు చెక్కులు తప్పా క్యూసెక్కులు తెల్వయ్..
కేసీఆర్ నీటి ప్రవాహం కాదు.. అది మా ముఖ్యమంత్రి గారి బూతుల ప్రవాహం.. కోతుల ప్రవాహం. మేడిగడ్డను రిపేర్ చేయండి అంటున్నరు అధ్యక్ష.. మేమెందుకు చేస్తం అధ్యక్షా? మేడిగడ్డ రిపేర్ చేస్తే కేసీఆర్‌కు పేరొస్తది. క్యూసెక్కులు, టీఎంసీలు అంటున్నరు. నాకు బ్యాంక్ చెక్కులు తప్ప ఈ క్యూసెక్కులు, టీఎంసీలు
నాకు ప్రిపరేషన్ ఉండకపోవొచ్చు.. మా ముఖ్యమంత్రికి డెడికేషన్ ఉండకపోవొచ్చు కానీ ఆదిత్యనాథ్‌దాస్ ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతా.
ఖచ్చితంగా చంద్రబాబు నాయుడ్ డైరెక్షన్‌లోనే పని చేస్తాం.. మా ప్రభుత్వం వచ్చిందే చంద్రబాబు వల్ల.. వారి పైసలతోనే, వారి సోషల్ మీడియాతోనే గెలిచాం.
- తెలంగాణ… pic.twitter.com/Z0dpUvP8z8
— Mission Telangana (@MissionTG) September 12, 2026
కేసీఆర్ నీటి ప్రవాహం కాదు.. అది మా ముఖ్యమంత్రి గారి బూతుల ప్రవాహం.. కోతుల ప్రవాహం.
మేడిగడ్డను రిపేర్ చేయండి అంటున్నారు అధ్యక్ష.. మేమెందుకు చేస్తాం అధ్యక్ష? మేడిగడ్డ రిపేర్ చేస్తే కేసీఆర్‌కు పేరు వస్తుంది.
- తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మాక్ అసెంబ్లీలో నీటిపారుదల శాఖా మంత్రి… pic.twitter.com/gOYMR62918
— Mission Telangana (@MissionTG) September 12, 2026
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Harish Rao vs Revanth Reddy | రేవంత్ రెడ్డిది ప్రజా పాలన కాదు.. ప్రజా పీడన
- ●Xi Jinping | ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్.. నేడు మోదీతో కీలక భేటీ
- ●Prajwal Revanna | ప్రజ్వల్ ఫోన్లో డజన్ల కొద్దీ పోర్న్ వీడియోలు.. ఫోరెన్సిక్ విశ్లేషణలో వెలుగులోకి షాకింగ్ విషయాలు
- ●TTD | శ్రీవారి భక్తులకు అలర్ట్.. డిసెంబర్ నెల దర్శన, వసతి కోటా విడుదల ఎప్పుడంటే?
- ●Loan Prepayment | లోన్‌ను ముందే చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ పెరుగుతుందా.. అసలు నిజం ఇదే..
- ●GHMC Workers Protest | అసెంబ్లీ వద్ద హైటెన్షన్: జీహెచ్ఎంసీ కార్మికుల ముట్టడి.. ప్రైవేటీకరణపై భగ్గుమన్న వైనం

Harish Rao vs Revanth Reddy | రేవంత్ రెడ్డిది ప్రజా పాలన కాదు.. ప్రజా పీడన

Xi Jinping | ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్.. నేడు మోదీతో కీలక భేటీ

Prajwal Revanna | ప్రజ్వల్ ఫోన్లో డజన్ల కొద్దీ పోర్న్ వీడియోలు.. ఫోరెన్సిక్ విశ్లేషణలో వెలుగులోకి షాకింగ్ విషయాలు

TTD | శ్రీవారి భక్తులకు అలర్ట్.. డిసెంబర్ నెల దర్శన, వసతి కోటా విడుదల ఎప్పుడంటే?






