త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sanjay | నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే: జ‌గిత్యాల ఎమ్మెల్యే సంజ‌య్‌

Sanjay | తాను బీఆర్ఎస్ (BRS) పార్టీ నుంచి గెలిచాన‌ని, ఈనాటికీ తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేన‌ని జ‌గిత్యాల ఎమ్మెల్యే సంజ‌య్ (Sanjay) స్ప‌ష్టం చేశారు. జ‌గిత్యాల (Jagtial) అభివృద్ధి కోసం ప్ర‌భుత్వంతో క‌లిసి ప‌నిచేస్తున్నాన‌ని చెప్పారు. తాను కాంగ్రెస్‌లో చేరేందుకు వెళ్ల‌లేద‌ని, జ‌గిత్యాల అభివృద్ధి కోసం సీఎంను క‌లిశాన‌ని పేర్కొన్నారు.

A

Telangana | Published On Feb 4, 2026, 3.13 pm IST

Sanjay | నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే: జ‌గిత్యాల ఎమ్మెల్యే సంజ‌య్‌
Advertisement

Sanjay | త్రినేత్ర‌.న్యూస్‌ : తాను బీఆర్ఎస్ (BRS) పార్టీ నుంచి గెలిచాన‌ని, ఈనాటికీ తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేన‌ని జ‌గిత్యాల ఎమ్మెల్యే సంజ‌య్ (Sanjay) స్ప‌ష్టం చేశారు. జ‌గిత్యాల (Jagtial) అభివృద్ధి కోసం ప్ర‌భుత్వంతో క‌లిసి ప‌నిచేస్తున్నాన‌ని చెప్పారు. సంజ‌య్ అన‌ర్హ‌త పిటిష‌న్‌ను కొట్టివేస్తూ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ నిర్ణ‌యం వెలువ‌రించిన అనంత‌రం జ‌గిత్యాల‌లో నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ తాను కాంగ్రెస్‌లో చేరేందుకు వెళ్ల‌లేద‌ని, జ‌గిత్యాల అభివృద్ధి కోసం సీఎంను క‌లిశాన‌ని పేర్కొన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా మీడియా ప్ర‌చారం ద్వారా తాను పార్టీ మారిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింద‌ని చెప్పారు. పార్టీ మారిన‌ట్లు తాను కానీ, ముఖ్య‌మంత్రి, మంత్రులు ఎవ‌రూ స్టేట్‌మెంట్ ఇవ్వ‌లేద‌ని గుర్తు చేశారు.

క‌లిసి ప‌నిచేస్తామ‌ని వెళ్లి తాను శాలువా క‌ప్ప‌తే, త‌న‌కు కండువా క‌ప్పార‌ని పేర్కొన్నారు. దాంతో కాంగ్రెస్ పార్టీలో చేరాన‌ని త‌న ఆస్ప‌త్రిపై దాడి చేయ‌డంతో పాటు త‌న దిష్టిబొమ్మ‌ను ద‌హ‌నం చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌న‌కు వివ‌రణ ఇచ్చేందుకు అవ‌కాశం కూడా ఇవ్వ‌లేద‌ని, నోటీసు ఇవ్వ‌లేద‌ని అన్నారు. జాగృతి అధినేత్రి క‌విత సైతం ఇదే ప్ర‌శ్నిస్తోంద‌ని చెప్పారు. సీఎంను క‌ల‌వ‌గానే త‌న‌పై అన‌ర్హ‌త వేటు వేయాల్సిందిగా స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేశార‌ని పేర్కొన్నారు. అయినా స‌రే ఆరోజు నుంచి గ‌తేడాది మార్చ్ నెల‌వ‌ర‌కు త‌న వేత‌నం నుంచి బీఆర్ఎస్ శాస‌న‌స‌భాప‌క్షానికి నెల‌కు రూ.అయిదు వేలు క‌ట్ అయింద‌ని, మార్చ్ నెల‌లో వాళ్లంత‌ట వాళ్లే ఆపేవ‌ర‌కు అది కొన‌సాగింద‌ని వివ‌రించారు. తాను బీఆర్ఎస్ శాస‌న‌స‌భాప‌క్ష స‌భ్యుడిన‌నే అభ్యంత‌రం తెల‌ప‌లేద‌ని చెప్పారు.

Advertisement
Advertisement