Hyderabad School | కల్కా, సూరహ్ ఫాతిహా చదవాలంటూ.. రెండో తరగతి విద్యార్థికి హోమ్ వర్క్
Hyderabad School | హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో (Hyderabad School) 2వ తరగతి విద్యార్థికి ఇచ్చిన హోమ్ వర్క్ వివాదానికి దారితీసింది. రెండో తరగతి చదవుతున్న హిందూ విద్యార్థికి కల్మా (Kalma), సూరహ్ అల్-ఫాతిహా (Surah Fatiha) చదవాలంటూ టీచర్ హోమ్ వర్క్ ఇచ్చారు.
Hyderabad School | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో (Hyderabad School) 2వ తరగతి విద్యార్థికి ఇచ్చిన హోమ్ వర్క్ వివాదానికి దారితీసింది. రెండో తరగతి చదవుతున్న హిందూ విద్యార్థికి కల్మా (Kalma), సూరహ్ అల్-ఫాతిహా (Surah Fatiha) చదవాలంటూ టీచర్ హోమ్ వర్క్ ఇచ్చారు. అదేవిషయాన్ని డైరీలో రాయడంతో తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు.
పాతబస్తీలోని సైదాబాద్‌లో ఉన్న సక్సెస్ స్కూల్‌లో కృష్ణ అనే హిందూ విద్యార్థి రెండో తరగతి చదువుతున్నాడు. క్లాస్ టీచర్ అతనికి మతపరమైన పద్యాలను హోమ్ వర్క్‌గా ఉచ్చారు. క్లాస్ రూమ్‌లో పఠించాలని కోరారు. డైరీ చెక్‌చేసిన తల్లిదండ్రులు.. స్కూల్ నిర్వాహకులను నిలదీశారు. ఇదేం హోమ్‌వర్క్ అంటూ ప్రశ్నించడంతో.. అది తప్పనిసరి అని చెప్పారని, మళ్లీ అలాంటిదేమీ కాదని టీచర్లు చెప్పారని పేరెంట్స్ తెలిపారు. హిందూ విద్యార్థిని ఇతర మతాలకు చెందిన ప్రార్థనలు జ్ఞాపకం ఉంచమని చెప్పడం అనుచితమని, ఇది తమ మత భావనలకు హాని కలిగిస్తుందని ఆరోపించారు. స్కూల్ యాజమన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
🚨 సైదాబాద్ ప్రైవేట్ స్కూల్‌లో హోమ్‌వర్క్‌పై వివాదం
🔸 హైదరాబాద్‌లోని సైదాబాద్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో క్లాస్–2 విద్యార్థి హోమ్‌వర్క్ డైరీలో కల్మా, సూరహ్ ఫాతిహా రాయాలని, పఠించాలని సూచించినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు.
🔸 ఈ విషయాన్ని గుర్తించిన విద్యార్థి… pic.twitter.com/8XqP78GLSe
— ముచ్చట్లు (@muchatlu_) July 15, 2026
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Malayalam OTT | ఓటీటీలోకి కయదు లోహర్ మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ - తెలుగులో రిలీజ్
- ●Jagannath Rath Yatra 2026 | అద్భుతాల నిలయం.. జగన్నాథుడి ఆలయం
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు ఐటీ షేర్ల జోష్.. లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ..
- ●Drugs | డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఎమ్మెల్సీ కుమారుడు.. కేసు ఫైల్ చేయొద్దంటూ పోలీసులపై ప్రముఖ మంత్రి ఒత్తిడి!
- ●Indian Railways | భారతీయ రైల్వేలో 6777 టెక్నీషియన్ అప్రెంటిస్‌లు.. ఐటీఐ, ఇంటర్ అర్హత
- ●FIFA 2026 | ఫైనల్లో మెస్సీ సేన

Malayalam OTT | ఓటీటీలోకి కయదు లోహర్ మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ - తెలుగులో రిలీజ్

Jagannath Rath Yatra 2026 | అద్భుతాల నిలయం.. జగన్నాథుడి ఆలయం

Stock Markets | స్టాక్ మార్కెట్లకు ఐటీ షేర్ల జోష్.. లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ..

Drugs | డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఎమ్మెల్సీ కుమారుడు.. కేసు ఫైల్ చేయొద్దంటూ పోలీసులపై ప్రముఖ మంత్రి ఒత్తిడి!






