త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indian Railways | భార‌తీయ రైల్వేలో 6777 టెక్నీషియ‌న్ అప్రెంటిస్‌లు.. ఐటీఐ, ఇంట‌ర్ అర్హ‌త‌

Indian Railways | ఐటీఐ, ఇంట‌ర్ పూర్తిచేసిన వారికి భార‌తీయ రైల్వే (Indian Railways) గుడ్‌న్యూస్ అందించింది. నార్త‌ర్న్ ఫ్రాంటియ‌ర్ రైల్వేలో టెక్నీషియ‌న్ అప్రెంటిస్‌ల (Technician Apprentice) కోసం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. మొత్తం 6777 టెక్నీషియ‌న్ అప్రెంటిస్‌ల‌కు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నది.

G

National | Published On Jul 16, 2026, 9.19 am IST

Indian Railways | భార‌తీయ రైల్వేలో 6777 టెక్నీషియ‌న్ అప్రెంటిస్‌లు.. ఐటీఐ, ఇంట‌ర్ అర్హ‌త‌
Advertisement

Indian Railways | త్రినేత్ర‌.న్యూస్‌: ఐటీఐ, ఇంట‌ర్ పూర్తిచేసిన వారికి భార‌తీయ రైల్వే (Indian Railways) గుడ్‌న్యూస్ అందించింది. నార్త‌ర్న్ ఫ్రాంటియ‌ర్ రైల్వేలో టెక్నీషియ‌న్ అప్రెంటిస్‌ల (Technician Apprentice) కోసం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. మొత్తం 6777 టెక్నీషియ‌న్ అప్రెంటిస్‌ల‌కు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆన్‌లైన్ ద‌రఖాస్తులు ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఆగ‌స్టు 19 వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. మూడేండ్ల‌పాటు శిక్ష‌ణ కొన‌సాగుతుంది. మొద‌టి ఏడాది రూ.9600, రెండో సంవ‌త్స‌రం రూ.10,560, మూడో ఏడాది రూ.11,040 ప్ర‌తినెల స్టెయిఫండ్ ఇస్తారు.

పోస్టుపేరు: టెక్నీషియ‌న్ అప్రెంటిస్‌
మొత్తం ఖాళీలు: 6777
జ‌న‌ర‌ల్ 2686, ఓబీసీ 1832, ఎస్సీ 1056, ఎస్టీ 515, ఈడ‌బ్ల్యూఎస్ 688, ఈఎస్ఎం అభ్య‌ర్థుల‌కు 677 చొప్పున కేటాయించారు.

అర్హ‌త‌లు: 50 శాతం మార్కుల‌తో ప‌దో త‌ర‌గ‌తితోపాటు ఐటీఐ పూర్తి చేయాలి. మెడిక‌ల్ ల్యాబొరేట‌రీ టెక్నీషియ‌న్ (పాథాల‌జీ), మెడిక‌ల్ ల్యాబొరేట‌రీ టెక్నీషియ‌న్ (రేడియాల‌జీ) ఖాళీల‌కు 10+2 విధానంలో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బ‌యాల‌జీ చ‌దివి ఉండాలి. 2026 ఆగ‌స్టు 19 నాటికి అభ్య‌ర్థులు 15 నుంచి 24 ఏండ్ల మ‌ధ్య వ‌య‌స్కుల‌వ్వాలి.

ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మార్కుల ఆధారంగా

ద‌ర‌ఖాస్తులు: ఆన్‌లైన్‌లో
అప్లికేష‌న్ ఫీజు: రూ.100, ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ, ఈబీసీ, మ‌హిళా అభ్య‌ర్థుల‌కు ఫీజు లేదు.
వెబ్‌సైట్‌: www.nfr.indianrailways.gov.in

Advertisement
Advertisement