త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Malayalam OTT | ఓటీటీలోకి క‌య‌దు లోహ‌ర్ మ‌ల‌యాళం యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ – తెలుగులో రిలీజ్‌

క‌య‌దు లోహ‌ర్ హీరోయిన్‌గా న‌టించిన మ‌ల‌యాళం మూవీ ప‌ళ్లిచ‌ట్టంబి ఓటీటీ రిలీజ్ డేట్ ఎట్ట‌కేల‌కు క‌న్ఫామ్ అయ్యింది. థియేట‌ర్ల‌లో రిలీజైన మూడు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి రాబోతుంది. టోవినో థామ‌స్ హీరోగా న‌టించిన ఈ పీరియాడిక‌ల్ యాక్ష‌న్ మూవీ జూలై 24 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.

N

Entertainment | Published On Jul 16, 2026, 10.14 am IST

Malayalam OTT | ఓటీటీలోకి క‌య‌దు లోహ‌ర్ మ‌ల‌యాళం యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ – తెలుగులో రిలీజ్‌
Advertisement

Malayalam OTT |  టోవినో థామ‌స్‌, క‌య‌దు లోహ‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టించిన మ‌ల‌యాళం మూవీ ప‌ళ్లిచ‌ట్టంబి భారీ అంచ‌నాలు న‌డుమ రిలీజై బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. డిజో జోస్ ఆంటోనీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో మ‌ల‌యాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ అతిథి పాత్ర‌లో న‌టించాడు. దాదాపు యాభై కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ప‌ళ్లిచ‌ట్టంటి థియేట‌ర్ల‌లో ఇర‌వై కోట్ల లోపే వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. ఈ ఏడాది మ‌ల‌యాళంలోనే బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్స్‌లో ఒక‌టిగా నిలిచింది.

మూడు నెల‌ల త‌ర్వాత‌...

థియేట‌ర్ల‌లో రిలీజైన మూడు నెల‌ల త‌ర్వాత ప‌ళ్లి చ‌ట్టంబి ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. జూలై 24 నుంచి సోనీలివ్ ఓటీటీలో ఈ యాక్ష‌న్‌ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. మ‌ల‌యాళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ అవుతోంది. థియేట‌ర్ల‌లో సినిమా డిజాస్ట‌ర్ కావ‌డంతోనే ఓటీటీ రిలీజ్ ఆల‌స్య‌మైన‌ట్లు ప్ర‌చారంజ‌రుగుతోంది.

ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్‌...

టోవినో థామ‌స్ కెరీర్‌లోనే మోస్ట్ ప్రెస్టిజీయ‌స్ మూవీగా ప‌ళ్లిచ‌ట్టంబి రూపొందింది. క‌థ క‌న్ఫ్యూజింగ్‌గా సాగ‌డం, క్లైమాక్స్ స‌రిగ్గా లేక‌పోవ‌డంతో పాటు ట్విస్ట్‌లు అనుకున్నంతగా ఆక‌ట్టుకోలేక‌పోవ‌డంంతో సినిమా ఫెయిల్యూర్‌గా నిలిచింది. టోవినో థామ‌స్ ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్‌, మాస్ యాక్టింగ్ మాత్రం అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి. టోవినో థామ‌స్‌, క‌య‌దు లోహ‌ర్ కాంబినేష‌న్ సీన్స్ బాగున్నాయంటూ కామెంట్స్ వ‌చ్చాయి.

సీక్వెల్‌....

ప‌ళ్లి చ‌ట్టంబి మూవీకి జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించాడు. శ‌త్రు, విజ‌య రాఘ‌వ‌న్‌, బాబు రాజ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. థియేట‌ర్ల‌లో మ‌ల‌యాళంతో పాటు తెలుగులోనూ రిలీజైంది. ఇక్క‌డ కూడా సేమ్ రిజ‌ల్ట్ వ‌చ్చింది. ప‌ళ్లిచ‌ట్టంబికి సీక్వెల్ తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ అనౌన్స్‌చేశారు. ఫ‌స్ట్ పార్ట్ డిజాస్ట‌ర్‌తో సీక్వెల్ రావ‌డం అనుమానంగా మారింది.

పోత‌న్ క్రిస్టోఫ‌ర్‌...

1950 ద‌శ‌కంలో కేర‌ళ ప్ర‌భుత్వం భూ సంస్క‌ర‌ణ‌ల బిల్లును ప్ర‌వేశ‌ప‌డుతుంది. చ‌ర్చి భూముల ర‌క్ష‌ణ‌ను పోత‌న్ క్రిస్టోఫ‌ర్ చేప‌డ‌తాడు. హిందువు అయిన కృష్ణ పిళ్లై....పోత‌న్ క్రిస్టోఫ‌ర్‌గా ఎలా మారాడు? రెబెక్కాతో అత‌డి ప్రేమాయ‌ణంలో ఎలాంటి అడ్డంకులు ఎదుర‌య్య‌యి? ప‌టేల‌న్ కుంజ‌ప్ప కుట్ర‌ల‌ను కృష్ణ పిళ్లై ఎలా ఎదుర్కొన్నాడు? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

 

Advertisement
Advertisement