FIFA 2026 | ఫైనల్లో మెస్సీ సేన
FIFA 2026 | ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై చాంపియన్ అర్జెంటీనా 2-1 తేడాతో గెలిచి ఫైనల్‌లోకి ప్రవేశించింది. తొలిభాగంలో మ్యాచ్‌ను తన అదుపులోను ఉంచుకున్న ఇంగ్లండ్.. అర్జెంటీనాను కట్టడి చేయడంలో సఫలమైందని భావించింది. లియోనెల్ మెస్సీకి అడ్డుకట్ట వేయడంతో పాటు కోచ్ థామస్ టూచెల్ రూపొందించిన వ్యూహం ఫలించింది.
- ఉత్కంఠపోరులో ఇంగ్లండ్‌పై ఘన విజయం
- 2-1 తేడాతో అర్జెంటీనా గెలుపు
- తృటిలో ఓటమికి కొనితెచ్చుకున్న బ్రిటీష్ జట్టు
- కీలక సమయంలో డిఫెన్స్‌కే పెద్దపీట
- చాంపియన్స్ సత్తా ఏంటో సాటి చెప్పిన సల్కోని టీమ్
- గోల్స్ చేయలేకపోయినా జట్టును నడిపించిన కెప్టెన్
- బ్రెజిల్ రికార్డుపై కన్నేసిన లా స్కాలోనిటా టీమ్
FIFA 2026 | ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై చాంపియన్ అర్జెంటీనా 2-1 తేడాతో గెలిచి ఫైనల్‌లోకి ప్రవేశించింది. తొలిభాగంలో మ్యాచ్‌ను తన అదుపులోను ఉంచుకున్న ఇంగ్లండ్.. అర్జెంటీనాను కట్టడి చేయడంలో సఫలమైందని భావించింది. లియోనెల్ మెస్సీకి అడ్డుకట్ట వేయడంతో పాటు కోచ్ థామస్ టూచెల్ రూపొందించిన వ్యూహం ఫలించింది. కానీ, ద్వితీయార్థంలో ఆంథోని గోర్డన్ చేసిన గోల్‌తో 1966 తర్వాత తొలిసారిగా ప్రపంచకప్ ఫైనల్ దిశగా ఇంగ్లండ్ అడుగులు వేస్తున్నట్లుగానే కనిపించింది. అయితే, ఛాంపియన్లను అంత సులభంగా అడ్డుకోవడం సాధ్యం కాదని అర్జెంటీనా మరోసారి నిరూపించింది. మెస్సీ ఈసారి గోల్స్ చేయకపోయినా.. మిడ్‌ఫీల్డ్ నుంచి జట్టును అద్భుతంగా నడిపిస్తూ సహచరులకు అవకాశాలు కల్పించాడు. ఎన్జో, లౌటారో మార్టినెజ్ గోల్స్‌తో అర్జెంటీనా మ్యాచ్‌ను తారుమారు చేసి 2-1తో విజయాన్ని అందుకుంది. దీంతో వరుసగా రెండోసారి ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది. 1962లో బ్రెజిల్ తర్వాత ప్రపంచకప్ టైటిల్‌ను విజయవంతంగా నిలబెట్టుకున్న తొలి జట్టుగా నిలిచే అవకాశాలను సజీవంగా ఉంచుకున్నది.
గంటపాటు ఇంగ్లండ్‌దే ఆధిపత్యం
మ్యాచ్ ప్రారంభం నుంచే మెస్సీకి స్వేచ్ఛ ఇవ్వకుండా ఇంగ్లండ్ వ్యూహాత్మకంగా ఆడింది. మెస్సీ మిడ్‌ఫీల్డ్‌లోకి వచ్చిన ప్రతిసారి ఇంగ్లండ్ ఆటగాళ్లు అతడిని వెంటాడారు. డెక్లాన్ రైస్ డిఫెన్స్ శ్రేణికి అండగా నిలవగా.. జూడ్ బెల్లింగ్‌హామ్ ప్రత్యర్థి తీవ్రతకు ఏమాత్రం తగ్గకుండా పోరాడాడు. ఎలియట్ అండర్సన్ పరుగులు తీస్తూ మెస్సీకి అవకాశం ఇవ్వలేదు. బంతిపై ఆధిపత్యం అర్జెంటీనాదే అయినా ఎటాకింగ్‌లో పదును కనిపించలేదు. జూలియన్ అల్వరెజ్‌కు ఇంగ్లండ్ డిఫెన్స్‌లో ఎక్కడా ఖాళీ దొరకలేదు. దీంతో మెస్సీ సైతం తరచూ వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. మరోవైపు ఇంగ్లండ్ ఎటాకింగ్ ప్రమాదకరంగా కనిపించింది. మోర్గాన్ రోజర్స్ చాకచక్యంతో పలు అవకాశాలు కల్పించాడు. హ్యారీ కేన్ సమన్వయంతో గోర్డన్ తన వేగంతో అర్జెంటీనా డిఫెన్స్‌ను ఇబ్బంది పెట్టాడు. ద్వితీయార్థం ప్రారంభమైన పది నిమిషాలకే ఇంగ్లండ్‌కు తొలి ఛాన్స్ దక్కింది. రోజర్స్ ఇచ్చిన అద్భుతమైన పాస్‌ను గోర్డన్ గోల్‌గా మలిచి జట్టుకు ఆధిక్యం అందించాడు.
పుంజుకున్న అర్జెంటీనా
ఆధిక్యంలోకి వెళ్లిన తర్వాత రెండో గోల్ కోసం ప్రయత్నించకుండా ఇంగ్లండ్ క్రమంగా డిఫెన్స్‌కే ప్రాధాన్యం ఇచ్చింది. ఒత్తిడి తగ్గిపోవడంతో పాటు డిఫెన్స్ మరింత వెనక్కి చేరింది. బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపడం కంటే.. ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో కాపాడుకోవడంపైనే దృష్టి సారించింది. ఈ చిన్న అవకాశాన్ని అర్జెంటీనా అందిపుచ్చుకున్నది. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఎటాకింగ్‌కు దిగింది. రోడ్రిగో డి పాల్ మిడ్‌ఫీల్డ్‌పై ఆధిపత్యం సాధించగా.. అలెక్సిస్ మాక్ అలిస్టర్‌కు ఖాళీలు దొరికాయి. అల్వరెజ్ చాకచక్యంగా కదులుతూ ఇంగ్లండ్ డిఫెన్స్‌ను చీల్చేశాడు. గంటపాటు తమ ఆధీనంలో ఉన్న మ్యాచ్‌ను ఇంగ్లండ్ చేజార్చుకుంటూ వచ్చింది. 39 ఏళ్ల వయసులో మెస్సీ ఆట తీరులో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. డ్రిబ్లింగ్, వ్యక్తిగత ప్రతిభతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిన మెస్సీ.. ప్రస్తుతం తన తెలివితేటలతో పాస్‌లు, సరైన నిర్ణయాలు తీసుకుంటూ ఆటను శాసించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతి టచ్‌తో మ్యాచ్ రిథమ్‌ను మార్చాడు. ప్రతి పాస్‌తో ఇంగ్లండ్ డిఫెన్స్‌ను కదిలించాడు. సహచరులకు అవకాశాలు కల్పిస్తూ కీలక పాత్ర పోషించాడు. దాని ఫలితంగా ఎన్జో ఫెర్నాండెజ్ కీలక గోల్ సాధించి స్కోర్‌ను సమం చేశాడు. ఆ తర్వాత ఏడు నిమిషాల వ్యవధిలోనే మరోసారి మెస్సీ అద్భుతమైన పాస్‌తో లౌటారో మార్టినెజ్‌కు అవకాశం లభించగా.. అతడు దాన్ని గోల్‌గా మలిచి అర్జెంటీనాకు విజయాన్ని అందించాడు. మెస్సీ ఖాతాలో గోల్ లేకపోయినా రెండు అసిస్టులు నమోదు అయ్యాయి.
ఛాంపియన్ల అసలు బలం అదే
ప్రపంచకప్‌లో ఇప్పటికే కేప్ వెర్డే, ఈజిప్ట్, స్విట్జర్లాండ్‌లాంటి జట్లు అర్జెంటీనాకు గట్టి పోటీ ఇచ్చినా.. ప్రతిసారీ క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడుతూ స్కలోనీ సేన ముందుకు సాగింది. అట్లాంటాలోనూ అదే సీన్ పునరావృతమైంది. గంటకుపైగా అద్భుతంగా ఆడిన ఇంగ్లండ్ చివరి వరకు అదే ప్రభావాన్ని కొనసాగించలేకపోయింది. అర్జెంటీనా మాత్రం సరైన అవకాశానికి ఓపికగా ఎదురుచూసి, ప్రత్యర్థి చేసిన చిన్న తప్పిదాన్ని కూడా వదల్లేదు. అదే రెండు జట్ల మధ్య అసలు తేడాగా నిలిచింది. వరుసగా రెండో ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన అర్జెంటీనా ఇప్పుడు చరిత్ర సృష్టించేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. 1962లో బ్రెజిల్ తర్వాత ప్రపంచకప్ టైటిల్‌ను వరుసగా రెండుసార్లు గెలిచిన జట్టు ఇప్పటివరకు లేదు. ఫైనల్లో స్కలోనీ సేనకు అజేయంగా దూసుకొస్తున్న స్పెయిన్ నుంచి గట్టి సవాల్ ఎదురుకానుంది. మెస్సీతో పాటు బాధ్యతను పంచుకుంటున్న సమష్టి జట్టుగా అర్జెంటీనా మరోసారి తన సత్తా చాటుతుందనే నమ్మకంతో ఫైనల్ బరిలోకి దిగుతోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sotheby | రూ.482 కోట్లకు అమ్ముడైన డైనోసర్ అస్థిపంజరం.. ప్రపంచ రికార్డు సృష్టించిన గస్..!
జులై 15, 2026

ICC ODI World Cup | వన్డే వరల్డ్ కప్ 2027 ఫార్మాట్లో భారీ మార్పులు.. సూపర్ సిరీస్, సూపర్-7కి ఐసీసీ శ్రీకారం
జులై 15, 2026

Priyanka Chopra | ‘వారణాసి’పై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు.. 14 నెలలుగా అదే పనిలో ఉన్నానంటూ..!
జులై 15, 2026
తాజావార్తలు
- ●Puri Rath Yatra 2026 vs Telangana Bonalu 2026 | భక్తుల కోసం గడప దాటొచ్చిన దేవుళ్లు: ఒకే రోజున పూరీ జగన్నాథ రథయాత్ర, తెలంగాణ బోనాలు.. ఈ విశేషాలు మీకు తెలుసా?
- ●Traffic Restrictions | ఆషాఢ బోనాలు.. జగన్నాథుని రథయాత్ర.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
- ●Electricity Consumption | రాష్ట్రంలో రికార్డు స్థాయికి విద్యుత్ వినియోగం..
- ●MBBS Seats | ప్రైవేట్‌లో 700, గవర్నమెంట్లో 110.. రాష్ట్రంలో భారీగా పెరిగిన ఎంబీబీఎస్ సీట్లు
- ●Horoscope | జూలై 16 రాశి ఫలాలు.. ఈ రాశివారిలో నూతనోత్సాహం వెల్లివిరుస్తుంది!
- ●Pawan Kalyan letter to Revanth Reddy | షాబాద్ ఘోరం పూర్తిగా పోలీసుల వైఫల్యమే : పవన్ కళ్యాణ్

Puri Rath Yatra 2026 vs Telangana Bonalu 2026 | భక్తుల కోసం గడప దాటొచ్చిన దేవుళ్లు: ఒకే రోజున పూరీ జగన్నాథ రథయాత్ర, తెలంగాణ బోనాలు.. ఈ విశేషాలు మీకు తెలుసా?

Traffic Restrictions | ఆషాఢ బోనాలు.. జగన్నాథుని రథయాత్ర.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

Electricity Consumption | రాష్ట్రంలో రికార్డు స్థాయికి విద్యుత్ వినియోగం..

MBBS Seats | ప్రైవేట్‌లో 700, గవర్నమెంట్లో 110.. రాష్ట్రంలో భారీగా పెరిగిన ఎంబీబీఎస్ సీట్లు



