Traffic Advisory | సంక్రాంతికి ఊర్లకు పోతున్నారా.. ఈ రూట్లలో వెళ్లేవారు జర జాగ్రత్త..
రాష్ట్రంలో అప్పుడే సంక్రాంతి (Sankranti) సందడి మొదలైంది. శనివారం నుంచి పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దీంతో శుక్రవారం నుంచే పట్నం వాసులు పల్లె బాట పట్టనున్నారు. హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్లే రోడ్లన్నీ వాహనాలతో (Traffic Jam) నిండిపోనున్నాయి.
trinethra.news : రాష్ట్రంలో అప్పుడే సంక్రాంతి (Sankranti) సందడి మొదలైంది. శనివారం నుంచి పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దీంతో శుక్రవారం నుంచే పట్నం వాసులు పల్లె బాట పట్టనున్నారు. హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్లే రోడ్లన్నీ వాహనాలతో (Traffic Jam) నిండిపోనున్నాయి. ఈ నేపథ్యంలో రాజధాని నగరంలో భారీ ట్రాఫిక్ ఏర్పడే అవకాశముందని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. దీంతో నగరవ్యాప్తంగా సమగ్ర ట్రాఫిక్ అడ్వైజరీని (Traffic Advisory) విడుదల చేశారు.
జనవరి 9 నుంచి 13 వరకు ట్రాఫిక్ అధికంగా ఉండనుందని, అలాగే జనవరి 16 నుంచి 19 మధ్య ఆంధ్రప్రదేశ్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల వైపు పెద్దఎత్తున ప్రయాణాలు జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు, ఎంజీబీఎస్ – ఆరాంఘర్ కారిడార్, ఎస్‌ఆర్‌నగర్ – లక్డికాపూల్, రేతిబౌలి – ఆరాంఘర్(అత్తాపూర్ మార్గం), కాచిగూడ – రామంతపూర్, ఎంజీబీఎస్ – దిల్సుఖ్నగర్ ప్రాంతాల్లో బస్సులు, ప్రైవేట్ వాహనాలు, ఆటోలు, పాదచారుల రాకపోకలతో తీవ్ర రద్దీ ఏర్పడే అవకాశముందని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 90102 03626 ట్రాఫిక్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్(ట్రాఫిక్) డి.జోయెల్ డేవిస్ సూచించారు.
మరోవైపు సంక్రాంతికి ప్రజలు ప్రశాంతంగా ఇండ్లకు వెళ్లేలా ఏర్పాట్లు చేశామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. హైదరాబాద్-విజయవాడ హైవేపై ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. గత సంక్రాంతి సమయంలో ఆంధ్రప్రదేశ్ వైపు సుమారు 9 లక్షలకుపైగా వాహనాలు వెళ్లాయని, ఈసారి వాహనాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ నివారణకు కలెక్టర్, ఎస్పీ, ఆర్ అండ్ బీ అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని వెల్లడించారు.

శాటిలైట్ ద్వారా టోల్ ఫీజు వసూలు!
సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతాయి. ఫాస్టాగ్ విధానం అమలులోకి వచ్చిన తర్వాత వాహనదారులకు నిరీక్షించాల్సిన ఇబ్బంది తప్పింది. అయితే టోల్ చేల్లించేందుకు కొద్దిసేపు వేచిఉండాల్సి ఉంటుంది. దీంతో పండుగల వంటి ప్రత్యేక సందర్భాల్లో వాహనాలు పెద్ద సంఖ్యలో లైన్లు కడుతున్నాయి. దీంతో ఆ కొద్దిసేపూ ప్లాజాల వద్ద వాహనాలు ఆగకుండా నేరుగా వెళ్లేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఏర్పాట్లు చేస్తున్నది. టోల్ రుసుమును శాటిలైట్ ద్వారా ఆటోమేటిక్‌గా వసూలు చేసేందుకు సంబంధించిన ట్రయల్ రన్‌ను గురువారం సాయంత్రం నిర్వహించింది. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద ఆటోమేటిక్ టోల్‌ను అధికారులు పరిశీలించారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





