త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jishnu dev Varma | భారత సాంకేతిక వృద్ధిలో బిట్స్ విద్యార్థుల పాత్ర కీలకం: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

Jishnu dev Varma | భారత సాంకేతిక వృద్ధిలో బిట్స్ విద్యార్థుల పాత్ర కీల‌క‌మ‌ని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. బిట్స్ పిలానీకి చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ పూర్వ విద్యార్థుల సమ్మేళనం.. 'బిట్సా గ్లోబల్ మీట్' (BGM26) ఆరో ఎడిషన్ శుక్రవారం హైదరాబాద్‌లోని బిట్స్ (బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) పిలానీ క్యాంపస్‌లో ప్రారంభమైంది.

P

Telangana | Published On Jan 9, 2026, 6.54 pm IST

Jishnu dev Varma | భారత సాంకేతిక వృద్ధిలో బిట్స్ విద్యార్థుల పాత్ర కీలకం: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
Advertisement

Jishnu dev Varma | భారత సాంకేతిక వృద్ధిలో బిట్స్ విద్యార్థుల పాత్ర కీల‌క‌మ‌ని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. బిట్స్ పిలానీకి చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ పూర్వ విద్యార్థుల సమ్మేళనం.. 'బిట్సా గ్లోబల్ మీట్' (BGM26) ఆరో ఎడిషన్ శుక్రవారం హైదరాబాద్‌లోని బిట్స్ (బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) పిలానీ క్యాంపస్‌లో ప్రారంభమైంది. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ సదస్సును ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ మాట్లాడుతూ ప్రపంచ సాంకేతిక కేంద్రంగా భారత దేశ కీర్తిని స్థాపించడంలో బిట్స్ పిలానీ వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.

స్టార్టప్‌లు, విద్యార్థుల నేతృత్వంలోని ప్రాజెక్టులు, పరిశ్రమల భాగస్వామ్యాలతో కూడిన బిట్స్ సంస్థలోని శక్తివంతమైన ఆవిష్కరణ, ఇంక్యుబేషన్ వ్యవస్థ, ఉన్నత విద్యా సంస్థలు జాతీయ ప్రాధాన్యతలకు, ప్రపంచ వాస్తవాలకు అనుగుణంగా తమను తాము ఎలా మలుచుకోవచ్చో నిరూపిస్తుందన్నారు. కార్మిక‌శాఖ ప్రిన్సిప‌ల్ సెక్రెట‌రీ దాన కిశోర్ మాట్లాడుతూ సాంకేతికత, నాణ్యమైన విద్య ప్రాముఖ్యతను వివ‌రించారు. వర్క్‌ఫోర్స్ డెవలప్‌మెంట్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, నిరంతర అభ్యాసంలో బిట్స్ వంటి సంస్థలు జాతీయ భాగస్వామిగా ఎలా సహకరిస్తున్నాయో వివ‌రించారు.

సదస్సు తొలి రోజున 'పిలానీ షార్క్స్' (Pilani Sharks) కార్యక్రమం ద్వారా స్టార్టప్ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సెషన్ లో పూర్వ విద్యార్థుల నేతృత్వంలోని కొత్త స్టార్టప్స్ తమ వ్యాపార నమూనాలను అనుభవజ్ఞులైన పెట్టుబడిదారుల ముందు ప్రదర్శించే అవకాశం లభించింది. దీనికి సమాంతరంగా, 'ఏజెంటిక్ ఏఐ' (Agentic AI), 'డిజిటల్ వెల్నెస్' (Digital Wellness) అంశాలపై సాంకేతిక వర్క్‌షాప్‌లు జరిగాయి. ఇవి అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, మానవ కేంద్రిత రూపకల్పన మధ్య ఉన్న సంబంధంపై దృష్టి సారించాయి.

బీజీఎం 2026 చైర్‌పర్సన్ అనిత సాకూరు మాట్లాడుతూ ఈ సదస్సు వివిధ తరాల మధ్య సహకారానికి ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంద‌న్నారు. మొదటి రోజు ముగింపులో ఇన్‌స్టిట్యూట్ వారసత్వాన్ని, స్నేహాన్ని చాటిచెప్పే సంప్రదాయ ఖవ్వాలీ నిర్వ‌హించారు. కార్య‌క్ర‌మంలో బిట్స్ గ్రూప్ వైస్ ఛాన్సెల‌ర్ ప్రొఫెసర్ వీ రామగోపాల్ రావు, ఇన్వెంటస్ క్యాపిటల్ పార్టనర్స్ ఎంజెల్ ఇన్వెస్టర్ కన్వల్ రేఖి, బీజీఎం 2026 చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మయూర్ పట్నాలా త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement