MANNU | రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్.. ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థుల ఆగ్రహం
MANNU | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్ మాదిరి వ్యవహరిస్తున్నారని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ సీఎం అయితే రియల్ ఎస్టేట్ బ్రోకర్ లానే పని చేస్తాడని తీవ్ర విమర్శలు చేశారు.
MANNU | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్ మాదిరి వ్యవహరిస్తున్నారని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ సీఎం అయితే రియల్ ఎస్టేట్ బ్రోకర్ లానే పని చేస్తాడని తీవ్ర విమర్శలు చేశారు. బంజారాహిల్స్ నందినగర్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసిన అనంతరం ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులు మీడియాతో మాట్లాడారు.
రేవంత్ రెడ్డి ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్.. యూనివర్సిటీ భూములతో రియల్ ఎస్టేట్ హబ్‌గా మార్చాలని చూస్తున్నాడు. రాహుల్ గాంధీ ఢిల్లీలో కూర్చొని బీజేపీ విద్యావ్యవస్థను నాశనం చేస్తుంది అని మాట్లాడుతాడు.. ఇక్కడ రేవంత్ రెడ్డి ఆయనకు వ్యతిరేకంగా పాలసీలు తెస్తున్నాడు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో నీళ్ల సమస్య ఉంది, ట్రాన్స్ పోర్ట్ సమస్య ఉంది.. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి. ప్రభుత్వం ఈ సమస్యలను పట్టించుకోకుండా, తిరిగి మా భూములపై కన్నేయడం దారుణమని విద్యార్థులు మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి గారు మీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు యూనివర్సిటీ బయట చేసుకోండి.. యూనివర్సిటీ లోపల కాదు. మమ్మల్ని మా యూనివర్సిటీని రెవెన్యూ జనరేట్‌లా చూడకండి. మంత్రి జూపల్లి కృష్ణారావు ఇది రొటీన్ సర్వే అని అంటున్నాడు.. కానీ హెచ్‌సీయూలో కూడా ఇలానే రొటీన్ సర్వే అంటూ వెళ్ళి హంగామా చేశారు. ఇప్పుడు ఇదే పద్దతి మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ యూనివర్సిటీలో చేస్తున్నారని వారు పేర్కొన్నారు.
ప్రభుత్వ నోటీసులు చూశాక తాము ఉద్యమం చేయాలని నిర్ణయించుకున్నాం.. ఆ సమయంలో తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని ఓ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. నీకు బ్రతకాలని లేదా? చదువుల తర్వాత ముందుకు వెళ్లాలని లేదా అంటూ తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలిపాడు. భూములను అమ్మడం బీజేపీ పాలసీ.. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పాలసీని అమలు చేస్తుందని ధ్వజమెత్తాడు. ఉర్దూ యూనివర్సిటీతో ఆటలు ఆడితే దేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీకే నష్టం. సర్వేలు అంటూ మమ్మల్ని లైట్ తీసుకోకండి.. మేము ఉద్యమం మొదలు పెడితే వేరేలా ఉంటుంది అని సదరు విద్యార్థి హెచ్చరించాడు.
https://x.com/i/status/2009516278034370711
సంబంధిత వార్తలు

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
మే 21, 2026

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



