Huzurabad Sub Jailor | రిమాండ్ ఖైదీకి మెరుగైన సౌకర్యాలు.. ఏసీబీకి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్
Huzurabad Sub Jailor | రిమాండ్ ఖైదీగా ఉన్న ఓ వ్యక్తికి మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు లంచం డిమాండ్ చేసిన హుజురాబాద్ సబ్ జైలర్ నాంపల్లి దేవేందర్(46)ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Huzurabad Sub Jailor | త్రినేత్ర.న్యూస్ : రిమాండ్ ఖైదీగా ఉన్న ఓ వ్యక్తికి మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు లంచం డిమాండ్ చేసిన హుజురాబాద్ సబ్ జైలర్ నాంపల్లి దేవేందర్(46)ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధిత వ్యక్తి నుంచి సబ్ జైలు పెట్రోల్ బంకులో పని చేస్తున్న రావుల హరీశ్(30) ద్వారా సబ్ జైలర్ దేవేందర్ రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
అనంతరం సబ్ జైలు కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి కీలక రికార్డులను పరిశీలించారు. లంచం తీసుకున్న సబ్ జైలర్ దేవేందర్‌ను అదుపులోకి తీసుకున్నామని, ఆయనపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ గట్ల మహేందర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే ప్రజలు నిర్భయంగా ఏసీబీ అధికారులను సంప్రదించాలని ఆయన సూచించారు.
TRAP CASE - KARIMNAGAR RANGE
AO-1: Nampally Devender, Jailor at Huzurabad Sub-Jail of Karimnagar Dist,
A-2: Ravula Harish, Petrol Bunk Operator at Indian Oil Sub-Jail Petrol Bunk, Huzurabad were caught by ACB, Karimnagar Range.(Full details are in Press Note) pic.twitter.com/NpNpsCVMgg
— ACB Telangana (@TelanganaACB) September 7, 2026
తాజావార్తలు
- ●TG TET | రేపు, ఎల్లుండి టీజీ టెట్.. హాజరు కానున్న 24 వేల మంది టీచర్లు
- ●Gurrala Nagaraju | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసుల అనుచిత ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాం
- ●TTD | టీటీడీ ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ.1.11 కోట్ల భారీ విరాళం
- ●OU Convocation | రేపే ఓయూ స్నాతకోత్సవం.. సాయంత్రం 6 గంటలకు కూడా అందని ఐడీ కార్డులు
- ●Janhvi Kapoor | సౌత్‌లో జాన్వీ స్పీడ్‌కు బ్రేక్.. ఇక పాత్రే ముఖ్యం!
- ●Vinayaka Chavithi | రెండు సౌండ్ బాక్సులకే అనుమతి.. పోలీసుల వార్నింగ్

TG TET | రేపు, ఎల్లుండి టీజీ టెట్.. హాజరు కానున్న 24 వేల మంది టీచర్లు

Gurrala Nagaraju | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసుల అనుచిత ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాం

TTD | టీటీడీ ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ.1.11 కోట్ల భారీ విరాళం

OU Convocation | రేపే ఓయూ స్నాతకోత్సవం.. సాయంత్రం 6 గంటలకు కూడా అందని ఐడీ కార్డులు






